కనువిప్పు - బెల్లంకొండనాగేశ్వరరావు

kanuvippu

అమరావతి నగరంలో పేరమ్మ అనే వితంతువు తన కుమారుడు అప్పయ్య కోడలు ఈశ్వరితొ  కలసి నివసిస్తు ఉండేది. ఇరుగుపొరుగు వారి మాటలు విని ఈశ్వరి తన అత్తగారితో ఎప్పుడు తగవుపడుతూ ఉండేది. ఊరి వెలుపల ఆశ్రమం లోని సదానందస్వామిని దర్శించుకున్న ఈశ్వరి "స్వామి మా అత్తగారి పోరు భరింపలేకుండా ఉన్నాను ఎలాగైనా ఆమె త్వరగా   మరణించే మార్గం చెప్పండి" అని వేడుకుంది  .ఆమె అమాయకత్వానికి జాలిపడిన సదానందుడు" దాని కేముంది నేటి నుండి నువ్వు  మీ అత్తగారిని  కన్నతల్లి కన్నమిన్నగా అపురూపంగా ఆరు నెలల చూసుకోవాలి అంతే నేను ఇక్కడ పూజ చేస్తాను వెళ్ళిరా!"అన్నాడు. సదానందుని సలహ మేరకు తన అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. కోడలిలో వచ్చిన మార్పు చూసిన పేరమ్మ ఈశ్వరి పట్ల ఆప్యాయంగా ఉండసాగింది. అత్త గారు తనను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూడటంతో మనసు మారిన ఈశ్వరి ఆరో నెల ప్రారంభం కావడంతో ఆందోళనతో సదానందుని ఆశ్రమానికి పరులాంటి నడకతో వెళ్ళి "స్వామి మన్నించండి ఇరుగు పొరుగు వారి మాటలు విని తల్లి వంటి అత్తగారిని అపార్దం చేసుకున్నాను అందుకే ఆమె మరణించాలి అని తప్పుడు కోరిక కోరుకున్నాను నా తప్పు తెలిసి వచ్చింది  నాకు కనువిప్పు అయింది మన్నించండి దయచేసి  నన్ను బిడ్డలా చూసుకునే నా అత్తగారికి ఎటువంటి ఆపద రాకూడదు నన్నుక్షమించండి"అని వేడుకుంది.

"తల్లి చెప్పుడు మాటలు ఎంతటి ముప్పు తెస్తాయో  అనుభవపూర్వకంగా తెలుసుకున్నావా? మీ యిద్దరి లోనూ అంతర్గతంగా దాగి ఉన్న ప్రేమా అనురాగాలు వెల్లడి కావడానికే నేను అలా చెప్పాను ,మీ అత్తగారికి ఎటువంటి  ప్రాణ భయం లేదు ఎక్కడ అయినా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? మంత్రాలన్ని మానవుల హితానికే ప్రేమానురాగాల విలువ అనుభవపూర్వకంగా తెలుసుకున్న నీవు అందరిచే గౌరవింపబడతావు వెళ్ళిరా తల్లి" అని ఆశీర్వదించాడు.

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్