భేతాళ ప్రశ్న - ..

betala prashna

1) పట్టణీకరణ,పారిశ్రామిక ప్రగతి-పర్యావరణ పరిరక్షణ పూర్తిగా భిన్న పార్శ్వాలు....జనాభాకు తగినన్ని నివాసాలు కావాలంటే అడవులు, పంటపొలాలు నశించాల్సిందే, నిర్మాణాలకు కావాల్సిన సామాగ్రి కోసం కలప కావాలంటే చెట్లను నరకాల్సిందే, ఉద్యోగాలు, ఉత్పత్తుల కోసం పరిశ్రమలు నెలకొల్పినప్పుడు అభివృద్ధి, రవాణా సౌకర్యాల కోసం వాహనాలు పెరిగినప్పుడు కాలుష్యం వెలువడక తప్పదు... ఇందులో మానవ తప్పిదం ఏమీ లేదు...ఇదంతా మానవ అభివృద్ధి పరిణామ క్రమమే...పెరిగిన ఎండ తీవ్రత నుంచి ఏసీలూ, ఫ్యాన్లూ, గొడుగులతో రక్షించుకోవడమొక్కటే మార్గం.

2) ఇది పూర్తిగా తప్పు..అభివృద్ధి సాధిస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది...ఒకచోట అడవులను నరికినప్పుడు సమాంతరంగా మరోచోట అడవులను పెంచడం, వాహనాలూ, పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం తగ్గేలా భద్రతా ప్రమాణాలు పాటించడం అత్యంతావశ్యం. ఇప్పటికైనా మనం మేల్కొని కరిగిపోతున్న ఓజోన్ పొరని కాపాడి గ్లోబల్ వార్మింగ్ నుండి భూమిని కాపాడితేనే భావి తరాలకు మేలు చేసిన వారమవుతాము...లేకుంటే భవిష్యత్ తరాలు ఎండ వేడికి మాడి మసైపోతారు.....

పై రెండింట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు