18-5-2018 నుండి 24-5-2018 వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. సభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మీఋ ఆశించిన దానికన్నా అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది , వాటిని తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, అనుభవజ్ఞులతో కలిసి చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరులనుండి వచ్చిన సూచనలు మీకు పెద్దగా నచ్చక పోవచ్చును. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. 

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తం మీద ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ,ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు ఆస్కారం ఉంది. గతంలో తలపెట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొనే ప్రయత్నం చేస్తారు. సంతానపరమైన విషయాల్లో ఒత్తిడి కలిగి ఉంటారు, ముఖ్యమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులనుండి వచ్చిన సూచనలు వింటారు.

 



మిథున రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ఆలోచనలను స్వాగతిస్తారు. పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుంబంలో శుభకార్యక్రమాల గురుంచి కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. సంతానం విషయంలో ఒకింత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.
 

 

కర్కాటక రాశి :ఈవారం మొత్తం మీద నూతన పనులను చేపట్టుటకు ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో కలిసి సమయాన్ని గడుపుతారు. మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. దైవపరమైన పనులకు సమయం ఇస్తారు. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది లేక వాటికోసం కాస్త అధికంగా ధనం వెచ్చించే ఆస్కారం కలదు. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. నూతన పనుల కన్నా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయి, నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేస్తారు. వారి అభిప్రయాలను కూడా పరిగణలోకి తీసుకోండి.

 

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం చేతికి అందుతుంది, నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, మీరు చేపట్టిన పనులకు గాను పెద్దలనుండి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సభ్యులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. సంతానం నుండి నలుగురిలో గుర్తింపును పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చర్చల్లో నిదానం అవసరం.

 

 

తులా రాశి :  ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి గుర్తింపును పొందుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. బంధువులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపారంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును, జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఏమాత్రం అశ్రద్దగా ఉన్న ఇబ్బందులు పొందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది ,వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను మిత్రులకు తెలియజేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు, కాకపోతే కాస్త ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో పెట్టుబడులు లభిస్తాయి. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు, ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. నూతన స్థిరాస్తిని కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులతో కలిసి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. తండ్రితరుపు బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి, ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు.
 

మకర రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. గతంలో మీకు రావాల్సిన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యల తగ్గుటకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవితభాగస్వామితో మనస్పర్థలు వచ్చే ఆస్కారం ఉంది, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన.

 

కుంభ రాశి :  ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. సమయాన్ని విందులకు లేక వినోదాలలో గడుపుటకు ఇష్టపడుతారు. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, నూతన పరిచయాలు ఏర్పడుతాయి. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాల విషయాల్లో స్పష్టత అవసరం అలాగే ప్రణాళిక కలిగి ఉండుట సూచన. గతంలో మధ్యలో ఆగిన పనులను తిరిగి ఆరంభించే అవకాశం ఉంది. సోదరులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. విదేశాల్లో ఉన్న బంధువులను కలుసుకుంటారు.
 

మీన రాశి : ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. తలపెట్టిన పనులను నిదానంగా ముందుకు తీసుకెళ్లటం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలను సైతం పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి, నలుగురిని కలుపుకొని వెళ్ళుట చేత లబ్దిని పొందుతారు. గతంలో మధ్యలో ఆగిన పనులను పూర్తిచేసే ఆస్కారం ఉంది. జీవితభాగస్వామి నుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, లబ్దిని పొందుతారు.