పసుపు కుంకుమ లఘు చిత్ర సమీక్ష - -సాయి సోమయాజులు

pasupu kumkuma short flim review

ఎల్.బీ.శ్రీ రాం గారు లఘు చిత్రాల ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే! మంచి మోరల్ వాల్యూస్ ఉన్న కథలను ఎంచుకుని సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్న ఎల్.బీ గారి సినిమా- ‘పసుపు.. కుంకుమ’ సమీక్ష, మీ కోసం-

కథ:

ఓ ఊరిలోని పెద్ద మనిషి భార్య చనిపోయే ముందు తన ఆస్తి తన కూతురికి చెందాలన్నట్టుగా వీలునామా రాస్తుంది. కొన్నేళ్ల క్రితమే తనకి నచ్చిన వాడిని పెళ్ళి చేసుకోవాలని ఇంటి నుంచి పారిపోయి తన తండ్రి, అన్నయ్యలతో  బంధాలు తెంచేసుకుంటుంది. తన కూతురు పేరు మీద ఉన్న ఆస్తిని తన కొడుకు పేరు మీదకు ట్రాన్స్ఫర్ చెయ్యడానికి, కూతురి సంతకం కోసం వెళతాడు ఆ పెద్దమనిషి. తర్వాత ఏమయ్యిందన్నదే ఈ కథ...

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్ ఎల్.బీ.శ్రీ రాం గారనే చెప్పుకోవాలి. ఉన్న వారందరిలో ఆయనొక్కరే బాగా నటించారు. కథ కాన్సెప్ట్ చాలా బాగుంది.

మైనస్ పాయింట్:

సినిమాకి కంపోజ్/సెలెక్ట్ చేసిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ కి సెట్ అవ్వదు. కొన్ని సీన్స్ సరిగ్గా చిత్రీకరించలేకపోయారు. ఎమోషనల్ డెప్త్ క్రియేట్ అవలేదు. సబ్‍టైటిల్స్ లో గ్రమాటికల్ మిస్టేక్స్ ఉండడమే కాకుండా, కొన్ని చోట్ల సబ్‍టైటిల్స్ మిస్ అవుతాయి. ఒక షాట్‍లో- టీ.వీ.లో ఒక క్రూ మెంబర్ రిఫ్లెక్షన్ గమనించవచ్చు. ఎల్.బీ. శ్రీరాం గారి అల్లుడు పాత్ర ధరించినతని గెటప్ కాని, పర్ఫార్మెంస్ కాని చాలా పూర్ అని చెప్పుకోవాలి. అతనే కాదు, ఎల్.బీ.శ్రీ రాం గారి మనవరాలి పాత్ర ధరించిన ఓ చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ సెలెక్షన్ బ్యాడ్ అనే చెప్పుకోవాలి. ఆ పిల్ల నటనే కాదు, డబ్బింగూ అస్సలు మ్యాచ్ కాలేదు.  డైలాగ్స్ ఇంకొంచెం బాగా రాసుండాల్సింది.

సాంకేతికంగా:

ఎడిటింగ్.. షాట్ ఫ్రేమింగ్ చాలా అమచ్యూర్‍గా అనిపిస్తుంది. కొన్ని కట్స్ చాలా అబ్రప్ట్ గా అనిపిస్తుంది. లైటింగ్ ఆర్టిఫీషియల్‍గా కనిస్తుంది. డైరక్షన్ చాలా బలహీనం.

మొత్తంగా్:
పాత కథ... పాత కథనం కూడా!

అంకెలలో:
2.5/5

Link: https://www.youtube.com/watch?v=a88j7xFwzLs