కాకూలు - సాయిరాం ఆకుండి

బాహు (మూల) బలి!

ప్రజలు నిక్కచ్చిగా ప్రశ్నించే ఈ రోజుల్లో...
రాజకీయాలు అంత సులువేం కాదు!

జనం స్పష్టంగా ఆశించే పద్ధతిలో....
నేతలుండకపోతే ఊరికునేదే లేదు!!


లగ్గవెప్పుడురా మావా అంటే

ప్రపంచానికే ఆదర్శమంట...
హిందూ వివాహ సాంప్రదాయం!

కొత్తగా సహజీవనమంట...
అరువుతెచ్చుకున్న భ్రష్టాచారం!!


కష్టే విఫలి

స్వేదం చిందినా నేల పండదేమిటో?
సేద్యం సాగినా బతుకు గడవదేలనో?

స్వార్థం నిండిన రాజకీయ కారణాలెన్నో...
వ్యర్థమైపోతున్న మన జలవనరులెన్నో!!