రాజమండ్రి పక్కనే ఉన్నా ఒక గ్రామంలో జరిగిన ఒక మంచి ప్రేమ కథే ఈ "పారిజాతం పూలు"అనే కథ .
అప్పుడే మంచుతెరలు తొలుగుతూ సూర్యోదయం అవుతున్నవేళ. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిలో మమేకమైన పారిజాతం పూల పరిమళం మనసుకు ఆనందాన్నిస్తుంది . రాఘవయ్య వీధిలో ఉన్న పెద్ద చెట్టె ఆ పారిజాతం చెట్టు , ఆ విధికి అదే అందం .తెల్లవారుజామునే అందమైన పడుచు అమ్మాయిల నుంచి పిల్లలవరకు...రాలి పడిన ఆ పారిజాతం పూల కోసం వస్తారు. ఆ పడుచు అమ్మాయిలలోనే ఒక అందమైన అమ్మాయి 'రాధ'. ఆ ఊరిలో రంగయ్య , లక్ష్మమ్మ ల కూతురే రాధా. ఆచారాలు ,కట్టుబాట్లకు గౌరవం ఇచ్చే కుటుంబం. రంగయ్య ఆవేశపరుడే అయినా మంచి మనసున్నవాడు, లక్ష్మమ్మకు ఇల్లే సర్వస్వం. కనకమ్మా (రాధ నానమ్మ) ,కనకమ్మకు రాధా అంటే అమితమైన ఇష్టం .రాధతో చాల చనువుగా,సరదాగా ఉంటుంది. రాధ....,రాధా...అంటు అరుస్తూ రాధా గదిలోకి వచ్చిన లక్ష్మమ్మ అక్కడ రాధా లేకపోవడం చూసి,"ఈ పిల్లకి తెల్లవారడమే ఆలస్యం ,స్నేహితులతో కలిసి ఆ చెట్టు దెగ్గరికి పరిగెత్తడం...ఇదే పని, అంతే కానీ కొంచం ముగ్గు వేదం,ఇంటి పనుల్లో సహాయం చేదాం అని ఉండదు అంటూ గోనుకుంటుంటే కనకమ్మ కలుగ చేసుకుంటూ "ఏమిటే నా మనవరాలిని అంటున్నావు,అది పనులుచేస్తే ఇంకా నువ్వు ఎందుకంటా'..అంటూ దీర్ఘాలు తీసింది.
"ఆ...ఒక్కమాటా పడనివ్వరుగ, మీరు కాదు గారాబంతో దాన్ని చెడగొట్టింది అంటూ వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మమ్మ. పచ్చటి పరికినిలో,కాళ్లకు..సవ్వడి చేసే మువ్వల పట్టీలతో,పారిజాతం చెట్టు దెగ్గరికి వెళ్లిన రాధ, రాలి కింద పడిఉన్న పూలల్లో నుంచి ఒక పారిజాతం పువ్వును తీసి, ఎర్రగ పండిన గోరింటాకు చేతులతో సుకుమారంగ...తన చేతి వేళ్ళతో బోసిగా ఉన్న తన వాలు జడలో అలంకరించింది. తన స్నేహితులతో కలిసి పూలు పోగుచేస్తున్న రాధను..అటుగా వెళ్తున్న కృష్ణ కుమార్ ఆగి మరి రాదనే చూస్తుండిపోయాడు, కదులుతున్న బాపు బొమ్మల ఉన్న రాధ అతనికి చూడగానే నచ్చింది. కృష్ణ కుమార్ పైచదువులకోసం పొరుగూరికి వెళ్లి ఉంటాడు.కలశాలకు సెలవులు ఇవ్వడంతో తన సొంతూరికి వచ్చాడు .అలా రాధనే చూస్తున్న కృష్ణ దెగ్గరికి తన చిన్ననాటి స్నేహితుడు వచ్చి పలకరించడంతో ఈ లోకంలోకి వచ్చి తనతో మాటల్లో పడతాడు.తరువాత చెట్టు వైపు చుసిన కృష్ణకి అక్కడ ఎవరు కనిపించరు. ఇంటికి పూలు తీస్కొచ్చిన రాధ,చక్కటి పారిజాతం పూలమాల కట్టి ...జడలో పెట్టుకొని .ఒక చేతిలో రెండు,మూడు పుస్తకాలు...వాటిపైన స్టీల్ లంచ్బాక్స్ పట్టుకొని ,ఇంకో చేత్తో జామకాయ తింటూ..తన స్నేహితురాలు కమలతో కలిసి కళాశాలకు వెళ్తుంది . సాయంత్రం కళాశాలనుంచి తన చెల్లిని తీసుకురడానికి వెళ్లిన కృష్ణకి , తన స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకుంటూ వెళ్తున్న రాధ కనిపిస్తుంది.కృష్ణ తన చెల్లి సుబ్బలక్ష్మిని రాధా గురించి అడిగితే, తనా!!...తానొక పారిజాతం పూల పిచ్చిది అన్నయ్యా కానీ మంచి పిల్లనే అంటు రాధా గురించి చెప్పుకొస్తుంది. మరుసటి రోజు పోదున్నే,చెట్టు దెగ్గరికి వెళ్లిన రాధ, తనతోటి వారు ఆశ్చర్యపోయారు .
ఎప్పుడు ముత్యాల రాలి పడి ఉండే పారిజాతం పూలు ఒక్కటి కుడా కనిపించట్లేదు, ఒక్కటి కూడా ఉంచకుండా ఎవరు తీసుకెళ్లారో అంటూ తిట్టుకుంటూ నిరాశగా వెళ్ళింది .ఆ బోసి జడతోనే కలశాలకు వెళ్లిన రాధకు,ఒక అమ్మాయి అరటి ఆకుతో చుట్టిన పొట్లం ఇచ్చి మీకు ఒక అన్న ఇవ్వమన్నాడు అని చెప్పి వెళ్లి పోతుంది. ఆ పొట్లం పై రాధగారి కోసం అని రాసి ఉంటుంది,తెరిచి చుసిన రాధా ముఖం ఆశ్చర్యంతో,ఆనందంతో వెలిగిపోతుంది ఎందుకంటే ఎవరో చక్కటి పారిజాతం పూల మాలను పంపారు.వెంటనే ఆ మాలను తీసి జడలో పెట్టుకొని.అది పంపింది ఎవరో తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంది ....కానీ ఫలితం లేకుండా పోతుంది.ఎవరు పంపారో కానీ మహానుభావుడు మంచిపనే చేసాడు అనుకుంటుంది మనసులో. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి.చెట్టు దెగ్గర పువ్వులు లేకపోవడం చుసిన రాధా ,తన తోటి వారు ...ఇదెక్కడి విచిత్రమో 'మనూర్లో ఎవరో పూల దొంగ పడ్డట్టున్నాడే అని అంది ఒక అమ్మాయి.ఎక్కడన్నా బంగారమో ,డబ్బో దొంగిలించే దొంగల్ని చూసాం కానీ ఈ పూల దొంగ ఏంటే బాబు అంటూ ఇంకో అమ్మాయి వంతపాడింది.ఇక చేసేదేంలేక ఇళ్ళకి వెళ్లారు అందరూ,ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న కృష్ణ చిన్నపాటి చిరునవ్వుతో తన చేతుల్లో ఉన్న పూల మూటను చూస్తాడు . ఒత్తి చేతుల్తో వచ్చిన రాధను చూసి "ఏంటే ఖళీ చేతుల్తో వచ్చావ్ పూలేవి?? అంది లక్ష్మమ్మ .ఆహ్ ....పూల దొంగ పడ్డడ్లే అంటూ తన గదిలోకి వెళ్ళింది .
ఆ పుణ్యాత్ముడు ఎవరో మంచిపని చేసాడు అంటూ రంగయ్యకు కాఫీ కలిపి ఇచ్చింది లక్ష్మమ్మ . రాధ క్లాస్రూమ్ లో ఉన్న తన బుర్రలో మాత్రం ఏవేవో ఆలోచనలు మెదులుతున్నాయి .అసలు నిన్న పూలు పంపింది ఎవరు? ఈరోజు కూడా పంపుతాడా? లేక నిన్న తెలిసిన వారు ఎవరన్నా ఆటపట్టిస్తున్నారా?ఒకవేళ పంపితే నాకుమాత్రమే ప్రేతేకంగా ఎందుకు పంపాలో? అంటూ ఆలోచిస్తుంది.క్లాస్సులన్నీ పూర్తయి ఇళ్లకువెళ్లే సమయమైంది ,అప్పటిదాకా పూలకోసం వేచిచూసి రాధ "నిన్న ఎవరో సరదాగా పంపి ఉంటార్లే అనుకోని ...స్నేహితులతో కలిసి ఇంటిదారి పట్టింది .ఆలా నడుస్తూ ఒక చెట్టువద్దకు రాగ ,అకస్మాత్తుగా రాధామీద పారిజాతం పూలవాన కురిసింది .అల కురవడమే అలసక్యం రాధ ఆనందానికి అవధులు లేవు .తన చేతిలో పుస్తకాలు కమలకిచ్చి (రాధ స్నేహితురాలు )ఆనందంతో వికసించిన ముద్దమందారం లాంటి ముఖంతో ,పసిపాప లాంటి అందమైన నవ్వుతో తనమీద కురుస్తున్న ఆ పారిజాతపూల వానలో తడిసి పరవసించిపోయింది.
ఇదంతా దూరం నుంచి చూస్తున్న కృష్ణ , రాధ ముఖంలో ఆనందం,అమాయకత్వం చూస్తూ సంతోషంతో మురిసిపోయాడు .రాధ తన స్నేహితులతో కలిసి ఆ పూలు వేసిన ఇద్దరు కుర్రలని జరిగిందని గురించి ప్రశ్నించింది ,"ఒక అన్న ఇలా చేస్తే చెరో రెండురూపాయిలు ఇస్తానన్నాడక్క" అంటారు ఇద్దరు. ఎవర్రా మీకు డబ్బులు ఇస్తాడన్న అన్న అని అడిగితే !..ఏమో అక్క మాకు తెలీదు,తన పేరు కూడా చెప్పలేదు అంటారు. రాత్రి పెరట్లో మల్లె పందిరి కింద మడతమంచం పై పడుకొని చందమామకేసి చూస్తూ...."అసలు ఎవరు మీరు ,ప్రేత్యేకంగా నాతోనే నాకు ఇష్టమైన పూలతో మేపించేటంతటి వీరుడా మీరు!! ఇంకా ఎన్ని రోజులో ఈ దాగుడుమూతలు నేను చూస్తా అని మనసులో అనుకుంటూ సిగ్గుపడిపోతుంది రాధ.పక్క మంచం మీద కూర్చొని తాంబూలం చుట్టుకుంటున్న కనకమ్మ ....సిగ్గుతో ఎర్రగా కందిన రాధ ముఖంకేసి చూస్తూ "ఎవరే ఆ కుర్రాడు " అని అంది . దిగ్గున లేచి కూర్చున్న రాధ "ఎవరా...కుర్రాడు అని తిరిగి ప్రశ్నిస్తుంది. నా దెగ్గర వద్దు ని నాటకాలు!! ఎప్పుడులేనిదీ చందమామకేసి చూస్తూ వెర్రి నవ్వులు నవ్వుతుంటేనే అర్ధమైందిలేవే...ఎవరో చెప్పు అంటూ కొంటెగా అడుగుతుంది రాధ నానమ్మ.
సిగ్గుపడుతు లేచి తన నానమ్మ పక్కన కూర్చొని తనను రెండు చేతులతో చుట్టుకుంటూ ...'నిజంగా అతను ఎవరో నాకు తెలీదే కనకం"అంటు జరిగింది చెప్పి '.నామీద పూలు పడుతున్నపుడు ఆ ముచ్చు మొఖం గిరిజాని చూడాలి అసూయతో మాడిపోయింది అనుకో" అనుటు నవ్వుకుంది .ఇలాంటి దొంగాటాలు మకాలంలో లేవమ్మా అంటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకొని పడుకున్నారు . అటు కృష్ణ కుమార్ పరిస్థితి కూడా ఇంతే.కళ్ళు మూస్తే రాధ,కళ్ళు తెరిస్తే రాధ ...అంతలా రాధ ప్రేమలో మునిగాడు .సావిట్లో నవారుమంచంపై పడుకొని జాబిల్లి వంక చూస్తూ...."చందమామ సైతం చూసి అసూయపడే అందం నిది, తామరాకు మీద నీటిబిందు లాంటి స్వచ్ఛమైన మనసు నీది ,కలువ రేఖలాంటి కనుల మధ్య నీటి బిందు లాంటి ఎర్రటి బొట్టు, మహాలక్ష్మి లాంటి కల గల ముఖం రాధ నిది!! నేన్ ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ,ఈజన్మలో నువ్వు నా కంటపడ్డావ్!! ఆ రాధాకృష్ణులగా మనం ఎప్పుడు కలిసి ఉంటామో అనుకుంటూ రాధ ధ్యానంలోనే నిద్రపోయాడు .
కొన్నిరోజులకు కృష్ణ , రాధకి ఒక ఉత్తరం రాసి పంపిస్తాడు.రాధ ఆ ఉత్తరం అందుకొని తెరిచి చూస్తే ఇలా ఉంటుంది " ప్రియమైన రాధ గారికి రాయునది..నాపేరు కృష్ణ కుమార్ ,నేను పొరుగూరిలో ఉన్నత చదువులో ఉన్నాను .సెలవులకాని ఊరికి వచ్చిన రోజు...ఇంటికి వెళ్లే దారిలో మిమ్మల్ని చూసాను "ఆ మంచుతెరల్లో ,పచ్చటి పరికినిలో,త్రచుపాములాంటి వాలు జడతో అపురూపమైన బాపు బొమ్మల దర్శనం ఇచ్చారు,మిలనే స్వచ్ఛమైనది మీ మనసు.మీరు నాకు నాచేసారు రాధగారు,మిమల్ని పెళ్లిచేసుకోవాలి అనుకుంటున్నాను ,మీరు నా జీవితంలోకివస్తే అంతకన్నా అదృష్టం నాకు మరేది లేదు .మీకు ఇష్టమే అయితే సాయంత్రం కళాశాల వెనకనున్న చెరువు దెగ్గరకురండి.ఒకవేళ మీరు రాకపోతే మీకు ఇష్టంలేదు అని భావించి మరెప్పుడు మిమల్ని ఇబందిపెట్టాను, మీరాకకై ఎదురు చూస్తుంటాను ఇట్లు ఇంకా మీకు ఏమి కానీ కృష్ణ" అని ఉంటుంది. ఆ ఉత్తరం చదివిన రాధ ముఖం లో భయం,ఆందోళన,నిస్సహాయత కనిపిస్తున్నాయి.
సాయంత్రం కళాశాల పూర్తయ్యాక , తనకోసమే ఎదురు చూస్తున్న కృష్ణ దెగ్గరకు వెళ్ళింది. మీరెందుకలాచేసారు అని అడిగింది. ఆ స్వరం వినడంతో వెన్నకి తిరిగి...రాధను మొదటిసారి దేగ్గర్నుంచి చుసిన కృష్ణ ,ఆమె అందానికి ముగ్ధుడై అలానే ఉండిపోయాడు. మిమ్మల్నే' అన్న పిలుపుతో ఈలోకంలోకి వచ్చిన కృష్ణ , సందేహంగా..నేనా! నేనేం చేశాను అని బదులిచ్చాడు. "ఎం చేసారా? ఎం చేయలేదు మీరు?? పూలతో ఆ దాగుడుమూతలు, పిచ్చిరాతలు, ఏంటి అని అడిగింది. చుడండి రాధగారు మీరంటే నాకు ఇష్టం అందుకు మీకు అభ్యంత్రం లేకపోతే రాధాకృష్ణుళ్ళా ఏకమౌదాం అని రాధ వైపు సూటీగా చూస్తూ అన్నాడు.అందుకు రాధా ముఖంలో ఆందోళన దర్శనమిచ్చింది.మీరు దీనిగురించి భయపడ్తున్నారో నేను అర్ధంచేసుకోగలను, నేను మీకు ఎలాంటి ఇబంది కలుగనివ్వను ,నా ఇంటి మహాలక్ష్మిగ , నా సహధర్మచారిణిల మిమల్ని గౌరవిస్తాను,నా కడదాకా మీ తోడుగా ఉండడానికి సిద్ధమయ్యే మీకు ఇది చెబుతున్న, నన్ను నమ్మండి రాధగారు అంటు ఒక రాజు తన సర్వస్వాన్ని తన రాణి కాళ్ళ దెగ్గర పెట్టినట్టు...తలవంచి ప్రేమగా ఆమె పాదాలను తాకుతాడు. ఆ మాటలకు ఆనందంతో రాధ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి,మరేమి మాట్లాడలేకపోతుంది.
అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతున్నా రాధతో, రాధగారు ఆగండి,ఎమన్నా తప్పుగా మాట్లాడి మిమల్ని బాధ పెట్టి ఉంటె నన్ను క్షమించండి రాధగారు..అంటు కేకలేస్తున్నా కృష్ణ వైపు వెన్నకి తిరిగి చూసి పొద్దున్న కృష్ణ ఉత్తరంతోపాటు పంపిన ఎర్రగులాబీ తీస్కొని తన జడలో పెట్టుకుంటుంది, కృష్ణ అంటే రాధకు ఇష్టం ఉన్నట్లుగా. అది చుసిన కృష్ణకు ఆనందం కట్టలు తెంచుకుంటుంది, ప్రపంచంలో ఎవరు సాదించనిది ఇతనే సాధించినట్లు పొంగిపోయాడు. అలా ఇంటికి వెళ్లిన రాధ తన గదితలుపులు మూసి కృష్ణ రాసిన ఉత్తరాన్ని తన చేతులోకి తీస్కొని ముద్దాడింది.కృష్ణ మాట్లాడిన మాటలను తలుచుకుంటూ సిగ్గుపడిపోతుంది.ఇంతలో "ఏవిటే ఓ తెగ సిగ్గుపడిపోతున్నావ్ ,ఏమిటి కథ అంటు స్వరంవినిపిస్తుంది.ఆ మాటలను ఒక్కసారిగా ఉలిక్కిపడి తిరిగిచూస్తే...మంచానికి పక్కాగా కనకమ్మ నుంచొని ఉంది. ఒసేయ్ కనకం నువెంటే ఇక్కడ,ఎప్పుడొచ్చావు అని అంది రాధ.ఎప్పుడు రావడం ఏంటి నేను ఈ గదిలోనే ఉన్న, నువ్వే సారా సారా వచ్చి గడియపెట్టి పిచ్చిదానిలా నవ్వుకుంటున్నావ్ అంది కనకమ్మ .రాధ తన నానమ్మతో జరిగిందంతా చెపింది.'ఆహా...ధైర్యం ఎక్కువేన్వ్...అబ్బాయి ఎలా ఉంటాడు! ఒడ్డు-పుడవు,బాగుంటాడ? అని అడిగింది కనకమ్మ.ఓ...అందగాడినే, చూపుతిప్పుకోలేరు ఆడవాళ్ళూ...అంతందంగా ఉంటాడంటే నమ్ము...కాకపోతే ఎలాంటి వాడో చూడాలి అంటూ పందిరిమంచం పై వాలిపోయింది రాధ. అలా రాధాకృష్ణుల ప్రేమాయణం మొదలవుతుంది .
ఆ ప్రయాణంలోనే ఒకరి అభిప్రాయాలు మరొకరు అర్ధంచేస్కోడాలు, ఇరువురి ఇష్టాలను గౌరవించుకోడాలు జరిగిపోతాయి. రాధకి కృష్ణ స్వభావం ,ఆడవారిపట్ల తనకు ఉన్న గౌరవం ఎంతగానో నచ్చుతాయి . ఇది ఇలా ఉండగా,కృష్ణ సెలవులు ముగిసి తిరుగు ప్రయాణం చేసే రోజు రానేవచ్చింది. రాధకి కృష్ణ తనను విడిచి వెళ్లడం ఇష్టం లేదు.కృష్ణని హత్తుకొని చాల బాధపడుతుంది రాధ."నువ్వలా బాధపడిపోతే ఎలా రాధ,నిన్ను వదిలి నీకు దూరంగా వెళ్లడం అంటే నామనసుకి కష్టమే.ఇంకొక్క ఏడాదే కదా,అయిపోగానే నేను ఉద్యోగంలో చేరి నిన్ను పెళ్లిచేసుకోడమే కదా.చదువేపూర్తవకపోతే నిన్ను ఎలా పోషించగలను రాధ.మనం దూరంగా ఉన్న మన మనసులు ఒక్కటే కదా,మనం ఉత్తరాలలో మాట్లాడుకుందాం.సంవత్సరం ఇట్టే గడిచిపోతుంది నన్ను నమ్ము" అని ధైర్యమిస్తాడు కృష్ణ.మీదేంపోయింది అన్నట్టు మౌనంగా ఉండిపోతుంది రాధ. మరుసటి రోజు తెల్లవారు జమునే పారిజాతం చెట్టు వద్ద ఎదురుచూస్తున్నా కృష్ణ వద్దకు పరుగేతుకుంటూ వెళ్లి అతన్ని హత్తుకుంటుంది,కృష్ణ చేతులు పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ ..."నాకోసం త్వరగా వచ్చేస్తారుకదు.."అంటుంది కన్నీళ్లను ఆపుకుంటూ.వచ్చేస్తాను రాధ అంటూ తాను తెచ్చిన పారిజాతం పూలమాలను రాధ జడలో అలంకరించి, సరేమారి వెళ్ళొస్తాను అంటూ రాధ నుదుటిమీద ముద్దుపెట్టి...రాధకేసి చూస్తూ నువ్వు జాగ్రత్త ,వెళ్ళగానే ఉత్తరం రాస్తాను అని చెప్పి బైలుదేరుతాడు.కృష్ణ వెళ్తుంటే పారిజాతం చెట్టుకింద ఒంటరిగా నుంచున్నా రాధ అంతే చూస్తుండిపోతుంది. కృష్ణ వెళ్లిన మూడురోజులకు కృష్ణనుంచి ఉత్తరం వస్తుంది. "ప్రియమైన రాధకి, నేను క్షేమంగానే చేరాను,నా గురించి చింతించకు.ప్రత్యేక్షంగ నా కళ్లయెదుట లేకపోయినా నూవ్వు ఎప్పుడు నా హృదయంలోనే ఉంటావు..అంటు రాసిన ఉత్తరం పూర్తిగా చదివి,ఆ ఉత్తరాన్ని ముద్దుపెట్టుకొని,కృష్ణ కోసం ఉత్తరం రాయడం మొదలుపెడుతుంది. ఇలా రాధాకృష్ణుల ప్రేమాయణం మూడు నేనాలాపాటు ఉత్తరాలతో నడిచింది.
ఒకరోజు రాధా తన కళాశాలకు వెళ్లేముందు...పందిరిమంచం పై పడుకొని సిగ్గుపడుతూ, ఆనందపడుతూ కృష్ణ రాసిన ఉత్తరం చదువుతుంది.ఇంతలో రాధా తల్లి కేకవేయడంతో ఉత్తరాన్ని మడిచి పరుపుకింద పెట్టి హడావిడిగా జడలో పూలు పెట్టుకొని వెళ్తుంది. అప్పటికి ఇదంతా పెరట్లో నుంచొని కిటికీలోనుంచి రాదని చుసిన రాధ తండ్రి, రాధ ప్రవర్తనకు అనుమానపడతాడు. రాధకి ఇంతవరకు ఎవరు ఉత్తరాలు రాయలేదే...ఒకవేళ రాసిన అంత సిగ్గుపడిపోడానికి కారణం ఏమైఉంటుంది??అని సందేహిస్తూ తొందర తొందరగా రాధ గదిలోకి వెళ్లి పరుపుకింద ఉన్న ఉత్తరం తీసుకుంటాడు రంగయ్య.
ఆ ఉత్తరం చదివిన రంగయ్యకి కోపంముంచుకొస్తుంది.కోపంతో ఆ ఉత్తరాన్ని చింపిడేస్తాడు .కళాశాలకు వెళ్లిన రాధా, కృష్ణకు జవాబు ఉత్తరం రాసి పోస్ట్ చేసి ,సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇంట్లోకి వచ్చి చుసిన రాధాకు తన అన్న ,నాన్న ఎప్పుడు లేనంత కోపంగా కూర్చొని ఉంటారు. పాపం లక్ష్మమ్మ వంటింటి గుమ్మానికనుకొని బోరున ఏడుస్తుంది. రాధకేసి దీనంగా-భయంగ చూస్తుంది కనకమ్మ. మూడు నెలలు గడిచిన రాధ నుంచి ఒక్క ఉత్తరంముక్క లేకపోయేసరికి, రాధకేమైనా అయ్యిందేమోనన్న భయంతో ఊరికి బైలుదేరాడు కృష్ణ. ఊరు చేరుకున్న కృష్ణ మరుసటి రోజు కళాశాలకెళ్ళి రాధ కోసం ఎదురుచూశాడు,కానీ రాధ ఎక్కడ కనిపించలేదు.మరుసటిరోజు తెల్లవారు జామునే పారిజాతం చెట్టు వద్ద రాధకోసం ఎదురుచూస్తున్నా కృష్ణకు తన మిత్రుడి ద్వారా గుండెళ్లుపగిలే నిజం తెలిసింది.రాధకి రెండు నెలలక్రితమే పెళ్ళైపోయిందంట, మంచి సంబంధం వచ్చిందని రాధ తల్లితండ్రులు వెంటనే పెళ్లి చేసారంట అని చెప్పాడు వచ్చిన మిత్రుడు. ఆ వార్తవిన్న కృష్ణకు భూమికంపించినంత పనైంది. నిస్సయంగా నుంచున్న కృష్ణకు మువ్వలసవ్వడి వినిపించడంతో తలెత్తిచూస్తాడు...వచ్చింది మరెవరో కాదు రాధ...తాను మనసారా ప్రేమించిన రాధ. మేడలో పసుపుతాడుతో,ఏదో చెప్పుకొని దుఃఖంలో ఉన్న ముఖంతో,బలవంతంగా ఆపుకుంటున్న కన్నీళ్లతో ఉంది. తాను ఇదివరకుచూసిన అన్నట్టు అన్నటుంది, ముఖాన ఆ అందమైన నవ్వు లేదు, ఆ కల లేదు...ధారలుగా కారుతున్న కన్నీళ్లతో అలానే చూస్తుంది పోయాడు కృష్ణ. బలవంతంగ వారి జీవితాలను ఎవరు లాగేసుకునట్టు నుంచొని ఉన్న రాధాకృష్ణులను చూస్తుంది ఆ పారిజాతం చెట్టు. బలంగా వీచిన గాలికి రాలిపడిన పారిజాతం పూలు ఎగిరిపోయాయి.
**కథ సమాప్తం**

