ఫ్రీ - బన్ను

article on free

మనం ''ఫ్రీ'  అనే పదానికి ఆకర్షితులమవుతున్నాము! మూడు చొక్కాలు కొంటే ఒక చొక్కా ఫ్రీ అంటే ఒకటి కొనేవాడు, మరో రెండు తీసుకుంటున్నాడు. ఒక్కో చొక్కా ఖరీదు రూ. 1200  నుండి రూ. 1500 వరకు వుంటుంది. తీరా కొన్నాక ఫ్రీ చొక్కా వేరేది ఇస్తున్నారు (చవకది). అలాగే సూపర్ మార్కెట్స్ లో రెండు వేల బిల్లు చేస్తే 1KG చక్కర ఫ్రీ అంటారు. అవసరం లేనివి కొనేసి 1KG చక్కర ఫ్రీ గా వచ్చేసిందని చంకలు గుద్దేసుకుంటున్నాము. నిజానికి 1500 బిల్లు నుంచి 2000 చేయటానికి కొనే వస్తువుల్ని మనం వాడక పోవడం వలన అవి పాడైపోతున్నాయి. 500 వేస్టయి, 50 రూపాయలు వస్తున్నాయన్నమాట!

'ఫ్రీ' అని ఎక్కడన్నా కనిపిస్తే (పేపర్లో లేక TV లో) ఎంతో దూరం వెళ్లి తెచ్చుకుంటున్నారు. పెట్రోలు ఛార్జీలు కూడా ఆలోచించట్లేదు.

మీ నంబరుకు లక్ష రూపాయలు వచ్చిందంటూ మన సెల్ ఫోన్ కి SMS వస్తే... మనమేదో సాధించినట్టు ముస్తాబై ఆ క్లబ్ వాళ్ళు పిలిచిన చోటుకెళ్లడం, వాళ్ళు మా రిసార్ట్ కొనండి - లక్ష తగ్గిస్తాం అనగానే నిరుత్సాహ పడిపోవడం, ఇవన్నీ కామన్ అయిపోయాయి.

'ఫ్రీ' అనే పదం చూసినప్పుడు 4 సార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలని నా సలహా!

కోరికలు ఉండొచ్చు. మన కోరికలు మన పరిధి లో వుండాలి. కోరికల్ని చంపుకోమని నేనటం లేదు. మనం శక్తివంతులమే! ఎంతో సాధించగలం కూడా! అలా అని ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం తప్పని నా అభిప్రాయం.

ఎవరూ మనకి 'ఫ్రీ' గా ఏమి ఇవ్వరు. మన 'వీక్ నెస్' ని వాళ్ళు వాడుకుంటున్నారు. మనం పలుమార్లు అలోచించి ఆ 'ఫ్రీ' వస్తువు మనకు ఉపయోగిస్తుంది అనుకుంటేనే వాటి జోలికి వెళదాం!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం