కవితలు - కొప్పుల .ప్రసాద్, ( తెలుగు ఉపన్యాసకులు)

కాసే ఎండకు లేదు కులం

వీచే గాలికి లేదు కులం
కురిసే వానకు లేదు కులం
మనుషులకే ఎందుకు ఈ కులం!!
 
జంతువులకు లేదు కులం
పక్షులకు లేదు కులం
ఏ ప్రాణికి లేదు కులం
మానవులకు ఎందుకు ఈ కులం!!
 
ఉయ్యాల కు తెలియదు కులం
మోసే పాడేకు లేదు కులం
చేరే మట్టికి లేదు కులం
మనిషికి ఎందుకు కులం!!
 
అగ్ర వర్ణం మా కులం
మధ్యతరగతి మా కులం
అధమ వర్గము మా కులం
సమానత్వం లు లేని కులం!!
 
తినే కాడ లేని కులం
త్రాగే కాడ లేని కులం
తిరిగే కాడ లేని కులం
వివాహానికి కావాలి కులం!!
 
ఓట్ల కోసం కులం
పదవుల కోసం కులం
ఘర్షణల కోసం కులం
అభివృద్ధిలో లేదు కులం!!
 
ఇతర దేశాలలో కొన్ని తెగలు
మన కేమోఎన్నో కులాలు
రాజ్యాంగాన్ని మార్చే కులాలు
భావితరాలను చీల్చే కులాలు!!
 
ఇకనైనా మరవండి కులాల్ని
చెయ్యండి అభివృద్ధి అందరిని
కులాలు లేని దేశాన్ని నిర్మించండి
భారతీయులంతా ఒక్కటే అని చెప్పండి
 

 

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు