క్యాన్సర్‌ ముప్పు పెంచవు - ..

Cancer does not increase the threat

మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముందుగా ఆహార పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు చెబుతున్నారిలా

* ఆలివ్‌నూనెకున్న గుణాలు రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తాయి. తాజాగా చేసిన ఓ అధ్యయనంలో రోజూ నాలుగు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌నూనె చేర్చుకోవడం వల్ల ఈ క్యాన్సర్‌ వచ్చే ముప్పు 68 శాతం తగ్గుతుందని తేలింది. అలాగే 3500 మహిళల మీద చేసిన మరో అధ్యయనం కూడా ఇంచుమించు ఇలాంటి ఫలితాలే చెప్పింది. రోజూ కనీసం ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల ఆలివ్‌నూనె చేర్చుకున్నా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని చాలామటుకూ తగ్గించుకోవచ్చు.

* ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలూ, వాల్‌నట్లూ, గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటికి రోగనిరోధక శక్తి పెంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అవి పరోక్షంగా క్యాన్సర్‌ వచ్చే తీవత్రను తగ్గిస్తాయి.

* ఎక్కువగా శాకాహారం తినడం వల్ల రొమ్ముక్యాన్సర్‌ వచ్చే ముప్పు తగ్గుతుందట. వాటిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లూ, పీచు దీనికి ముఖ్య కారణం. క్యాబేజీ, క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, ఉల్లీ, వెల్లుల్లీ, పుట్టగొడుగుల్లో కూడా క్యాన్సర్‌ను నిరోధించే పోషకాలుంటాయి. అయితే చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే అరటిపండ్లూ, అనాస, మామిడి వంటి వాటిని దూరంగా ఉంచాలి.

* సోయాలో ఉండే ఈస్ట్రోజెన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాల్ని పెంచుతుందన్న అపోహ

ఉంటుంది. అయితే రోజూవారి ఆహారంలో కాస్త సోయా చేర్చుకోవడం మంచిదేనని చెబుతున్నారు నిపుణులు. సోయాతో తయారు చేసే ప్రాసెస్డ్‌ ఆహారానికి దూరంగా ఉండాలి.

మరిన్ని వ్యాసాలు

Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు