8-03-2019 నుండి14-3-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారంలో స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. అధికారులను లేదా పెద్దలను కలుస్తారు. చేపట్టిన పనులను వారంమొదట్లో విజయవంతంగా పూర్తిచేసిన మధ్యలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ ఆలోచనలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. జీవితభాగస్వామితో వివాదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగాలకు చేసిన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి, చివరి ఫలితం మీకు పెద్దగా ఆశాజనకంగా ఉండకపోవచ్చును.


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారంలో మీ వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. మీ ఆత్మీయులను నస్టపోయిన విషయంలో ఒకసారి ఆలోచనలో పడుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. చర్చలు చేయుట ద్వారా మరింతగా ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి వచ్చిన సూచనలు లేక సహాయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు మాత్రం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవాకాశం ఉంది.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారంలో కాస్త శ్రమించుట ద్వారా ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో సమయపాలన పాటించుట మంచిది. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగ పడుతాయి. వచ్చిన నూతన అవకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాల విషయంలో కాస్త నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు ముందుకు సాగుటకు అవకాశం ఉంది. 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారంలో ఆరంభంలో కాస్త ఒత్తిడి తప్పక పోవచ్చును, సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి సహకారం లభిస్తుంది, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. అనుకొకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. రావాల్సిన ధనం వారం మధ్యలో చేతికి అందుటకు అవాకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును, జీవిత భాగస్వమైతో మనస్పర్థలు మరింతగా పెరుగుటకు ఆస్కారం కలదు. చర్చలకు అవకాశం ఇవ్వకండి.

 

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. గతాంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం మంచిది. ఆత్మీయుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి, వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కుటుంబపరమైన విషయాల్లో పెద్దలనుండి వచ్చిన సూచనలకు అనుగుణంగా నడుచుకోండి. విలువైన వస్తువుల విషయంలో ఏమాత్రం అశ్రద్దగా ఉన్న నష్టపోయే అవకాశం ఉంది. దైవపరమైన విషయాల్లో పాల్గొంటారు. చిననాటి మిత్రులతో కాస్త సమయం గడుపుటకు అవకాశం కలదు.
 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారంలో పెద్దలతో సమయం గడుపుతారు, చిన్న చిన్న విషయాల్లో మీ ఆలోచనలను తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేస్తారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిత్రులనుండి లేక ఆత్మేయుల నుండి సహకారం లభిస్తుంది. మీ మాటతీరు మరింతగా స్పష్టంగా ఉండేలా చుసుకోవడం సూచన. సంతానపరమైన విషయాల్లో ఆశించిన మేర ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం తగినంత జాగ్రత్తలు తీసుకోవడం సూచన.

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారంలో దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగఅవకాశాలు లభిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులను  కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో పెద్దలతో కలిసి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. జీవితభాగస్వామితో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయంలో నూతన భాగస్వామ్య ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారంలో కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయాలు మరింతగా బలపడేలా మీ నిర్ణయాలు ఉంటే మంచిది. ముందుగా గతంలో చేపట్టిన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. మీకు రావాల్సిన రుణాలు తిరిగి రావడంలో ఇబ్బంది తప్పకపోవచ్చును. సంతానపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. బంధువుల నుండి నూతన విషయాలు తెలిసే అవకాశం ఉంది, వాటి గురుంచి కాస్త ఆలోచనలో పడుతారు.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారంలో మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది, వారితో కలిసి విందులల్లో సమయం గడుపుతారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, తోటిఉద్యోగుల నుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనల దిశగా అడుగులు వేస్తారు. విదేశాల్లో ఉన్న మిత్రురాలు లేదా బంధువుల నుండి సహకారం ఉంటుంది. కొంతమేర ఆలోచనలను లేక కోరికలని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. దైవపరమైన పూజలలో పాల్గొనే విషయంలో తీర్థయాత్రలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది, నూతన అవకాశాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఊరట చెందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సన ధనం సమయానికి చేతికి అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. సంతానపరమైన విషయాల్లో మాత్రం కొంత ఆందోళన చెందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో బాగాఉంటుంది , పెద్దలనుండి ప్రశంశలు లభిస్తాయి. విలువైన వస్తువులను పొందుటకు ఆస్కారం కలదు. మిత్రులతో నూతన ఆలోచనలు చేస్తారు.

 

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారంలో నూతన ప్రయత్నాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చేపట్టిన పనుల్లో కాస్త ఆలస్యంగా ముందుకు సాగుతాయి. వ్యాపార సంభందమైన విషయాల్లో మీ కంటూ స్పష్టమైన ఆలోచనలు ఉండటం మేలు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. గతంలో చేపట్టిన పనులకు నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. మిత్రుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకండి. వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండుట సూచన.

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారంలో ముఖ్యమైన పనులకు సమయం ఇస్తారు, బంధువుల సహకారంతో పనులను పూర్తిచేయుటకు అవకాశం ఉంది. మీ మాటతీరు మూలన చిన్న చిన్న సమస్యలు వచ్చిన, కాస్త ఓపికగా ఉండటం వలన అవి సర్దుకొనే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును, తగిన జాగ్రత్తలు తీసుకోవం వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితములు పొందుతారు. చాలావరకు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి , తప్పక మేలుజరుగుతుంది.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు

Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం