జాబ్‌ కెళ్తున్నారా.? జేబు జాగ్రత్త.! - ..

Beware of the pocket.

చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగాల వేటలో పడే యువతకి గాలమేయడానికి కేటుగాళ్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ కేటుగాళ్ల తీవ్రత చాలా పెరిగిపోయింది. మల్టీ నేషనల్‌ కంపెనీలో బీభత్సమైన ప్యాకేజీలు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. పత్రికల్లో ప్రకటనలు, ఛానెల్స్‌లో కహానీలు.. ఇవి చాలవన్నట్లు పాంప్లెట్లూ యువతను చాలా తేలిగ్గా బురిడీ కొట్టించేస్తున్నాయి. ఇంట్లో పోరు సంగతి పక్కన పెడితే, తొందరగా లైఫ్‌లో సెటిలైపోవాలనే కంగారు కావచ్చు. .ఫ్రెండ్స్‌ నుండి వస్తున్న ఒత్తిడి వల్ల కావచ్చు.. ఏదో ఒకటి చేసేద్దామనే తొందరలో తప్పటడుగులు వేస్తున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. 
కొన్ని పేరున్న కంపెనీలు సైతం, సెక్యూరిటీ డిపాజిట్‌ అడుగుతుండడం మామూలే. దాన్ని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు నిరుద్యోగులకు గాలమేస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఉద్యోగార్ధులే అప్రమత్తంగా ఉండాలి. ఒకటికి పదిసార్లు కంపెనీ ప్రొఫైల్‌ చెక్‌ చేసుకోవాలి. సెక్యూరిటీ డిపాజిట్‌గా డబ్బు కట్టాల్సి వస్తే, దాని కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవేమీ కాదు, ఎలాగోలా ఉద్యోగం వస్తే చాలనుకుంటే మాత్రం తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

డబ్బు వృధా చేసుకోవడం ఇక్కడ ఓ సమస్య అయితే, ఇంకో సమస్య ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ని ఇంకొకరి చేతుల్లో పెట్టి, వాటి కోసం కాళ్లరిగేలా తిరగాల్సి రావడం. ఇటీవల కాలంలో డాక్యుమెంట్స్‌ సమస్యలు ఎక్కువైపోయాయ్‌. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తమ వద్ద ఉంచుకుని, ఉద్యోగార్ధుల్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు కేటుగాళ్లు. ఉడుకు రక్తం.. అన్నీ తమకే తెలుసనే మొండితనం.. వీటి కారణంగానే అక్రమార్కులకు యువత అవకాశమిచ్చినట్లు అవుతోందని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. అమ్మాయిలూ, అబ్బాయిలూ ఈ మోసపోవడం విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

దురదృష్టమేంటంటే, 20 నుండి 25 ఏళ్ల వయసున్న వారికంటే, 25 నుండి 30 ఏళ్ల వయసున్న వారు ఇంకా తేలిగ్గా ఈ బురిడీగాళ్ల వలకు చిక్కుతున్నారట. దానికి కారణం ఒత్తిడి. ఉద్యోగం ఇంకా రాలేదు.. అన్న ఆవేదనతో ఎలాగోలా ఉద్యోగం వస్తే చాలనుకునే వారినే లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు పక్కా స్కెచ్‌ వేసి వారిని తమ బుట్టలోకి లాగుతున్నారు. చాలా వరకూ పేరున్న కంపెనీలు తమకు సంబంధించి, అన్ని ముఖ్యమైన వివరాల్ని అందుబాటులో ఉంచుతాయి. అనుమానాల నివృత్తి కోసం, డెస్క్‌లు అందుబాటులో ఉంచుతాయి. కానీ, వాటిని వినియోగించుకోవడం తెలియకనే అసలు సమస్య వస్తోంది. బీ కేర్‌ ఫుల్‌.. జాబుతో మంచి లైఫ్‌ సంపాదించడం సంగతేమో కానీ, ఉన్న బేస్‌ మిస్‌ చేసుకోవద్దు.

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్