శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Sri Swamy Vivekananda Biography

వివేకానందునికి మానవాళి పట్ల గల తీవ్ర ఆవేదనను వ్యక్త  సంఘటన గురించి తురియానంద స్వామి ఈ విధముగా తెలియచేశారు. స్వామీజి బొంబాయి వెళుతుండగా మార్గ మధ్యము లో ఆయనను కలుసుకుందామని తురియానంద స్వామి, బ్రహ్మానంద స్వామి ఆబు రోడ్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. వారితో వివేకానందుడు ఇలా అన్నారు. సోదరాః నేను మీ "మతమని పిలవబడే దాన్ని అర్ధము చేసుకోలేకుండా వున్నాను. కాని నా హృదయము మాత్రం అంతులేని విధముగా విస్తరించింది. ఇతరుల బాధలను చూసి ఆవేదన చెందుతున్నాను. నన్ను నమ్మండి. ఇతరులు బాధ పడుతుంటే నేను కూడా బాధతో విలవిలలాడి పోతున్నాను." ఈ మాటలంటూ ఆయన కళ్ళ నుండి కన్నీళ్ళు ధారగా కారసాగాయి.

అమెరికా నుంచి తిరిగి వచ్చాక, వివేకానందుడు రామేశ్వరములో ప్రసంగం చేసారు. అది ఇప్పటికి రామేశ్వరాలయ శివాలయము లో  గోడలపై పవిత్రముగా చెక్కబడి ఉన్నది. ఆ ప్రసంగములో స్వామీజి ఏ విధముగా ఉపన్యసించారు. "పవిత్రముగా ఉండటము - ఇతరులకు మంచి చేయటము - ఇదే పూజలన్నిటి సారాంశం. పీడలు, బలహీనులు, దరిద్రులు, వ్యాధి గ్రస్థులు - వీరిలో శివుడిని దర్శించి పూజించే వాడే నీజమైన శివ భక్తుడు. విగ్రహములో మాత్రమే శివుని దర్శించేవాడి పూజ ఇంకా ప్రాధమికమైనది. ఇతరుల గురించి ఈ రకమైన ఆవేదన, విశ్వ శ్రేయస్సు కొరకు తమకున్నదంతా త్యాగం చేయటం - ఇవి మహానుభావులందరి ముఖ్య లక్షణం. దైవం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాని దీని గురించి మనకి ధృఢ విశ్వాసము లేక, దైవం గురించి అక్కడా, ఇక్కడా వెదుకుతున్నాము. వివేకానందుల గురువుగారైన శ్రీ రామకృష్ణుల శిష్యులలో ఒకరైన అద్వైతానంద స్వామి పుణ్య క్షేత్ర దర్శనం కోసం యాత్రలకు వెళదాము అనుకున్నారు. అతనిని వద్దని చెపుతూ శ్రీ రామకృష్ణులు ఈ విధముగా అన్నారు. "దైవం ఎక్కడో దూరముగా వున్నదనుకున్నంత కాలం అజ్ఞానంలో ఉన్నట్లే!

దేవుడు ఇక్కడే మనలోనే వున్నదనుకున్నప్పుడు సంపూర్ణ జ్ఞానము కలుగుతుంది. తన శిష్యునికి ఈ విషయాన్ని హృదయాన్ని హత్తుకునేటట్లు ఆయన ఈవిధముగా చెప్పారు. "ఒక వ్యక్తి చుట్ట తాగుదామనుకున్నాడు. చుట్ట ముట్టించుకుని నిప్పు కోసం పక్క ఇంటికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి సమయం. అందరు మంచి నిద్ర లో వున్నారు. ఇతనిని చూడగానే ఆ ఇంటతను "ఏమిటి సంగతి" అని అడిగాడు. జవాబుగా అతను ఏమిటో వుహించలేవా? నాకు చుట్ట తాగటమంటే ఎంత ఇష్టమో, నీకు తెలుసు కదా! చుత ముట్టించుకోవటానికి నిప్పు కోసం వచ్చాను. అన్నాడు. అతను" చాలా బాగుంది! నువ్వెంత వింత మనిషివి! అర్ధరాత్రి సమయములో మా ఇంటి తలుపు కొట్టి మమ్మల్ని నిద్ర లేపి చాలా కష్టపడ్డావు. నీ చేతిలోనే లాంతరు వుంది కదా. దాని లోని మంటతో నువ్వు చుట్ట ముట్టించుకోవచ్చు కదా" అని శ్రీ రామకృష్ణులు ఈ కథ చెప్పి ఇలా అన్నారు.

"మానవుడు అన్వేషించేది అతని దగ్గరే, అతి సన్నిహితముగా వుంది. కాని దానిని తెలుసుకోలేక అతను, ఒక చోటు నుంచి మరొక చోటికి పరిగెడుతూనే వున్నాడు". మనకు కావలసింది మనలోనే వున్నదని అర్ధమైన మరు క్షణం ఊరకే ఉండలేము. ప్రపంచము లో ప్రతి ఒక్కరు శాంతి, ఆనందం, సుఖం, తమలోనే వున్నాయని తెలుసుకోలేక వాటి కోసం ఎక్కడెక్కడో వెదుకుతున్నారు. శాంతి, ఆనందాలకు మూలం మన"ఆత్మయే". అదే మన నిజతత్త్వం. అదే మన సనాతన ధర్మం.

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్