అడిగేది మీరే ఆన్సరిచ్చేది మీరే.. - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

ప్ర: హాస్పిటల్లో ‘ష్’ అని ఎందుకుంటుంది?

జ: బిల్లు చూసి మాట్లాడొద్దని.

***

ప్ర: ఒకప్పుడు హోల్ సేల్ ఇప్పుడు?

జ: ప్యాకేజీలు.

***

ప్ర: ప్రేమికులకు, దంపతులకు తేడా?

జ: వాళ్లు ఒకరికోసం ఒకరు నడుచుకుంటూ అయినా విమానం మీద వెళ్లినట్టు వెళితే, వీళ్లు విమానం మీదైనా నడుచుకుంటూ వెళ్లినట్టు వెళతారు.

***

ప్ర: కొత్త సీసాలో పాతసారా?

జ: పదార్థాల టైటిల్ ముందు ‘న్యూ’ అని పెట్టడం.

***

ప్ర: ఒకతను ‘నా జీవితమే ఒక రైలుబండి’ అన్నాడు. అంటే?

జ: స్వేచ్చ లేకుండా, వాళ్లావిడ అభిప్రాయ పట్టాల మీదనే నడుస్తాడు కాబట్టి.

***

 

.

 

 

..

మరిన్ని వ్యాసాలు

ANthariksham
అంతరిక్షం
- రవిశంకర్ అవధానం
Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్