మరణం మాట్లాడుతుందట..!! - మంజు యనమదల

poem
నీకు తెలుసా
మరణం కూడా 
మాట్లాడుతుందట
 
మన తప్పొప్పుల 
లెక్కలన్నీ బేరీజు వేసే
సమయమప్పుడిస్తుందట
 
బంధాలకు బాధ్యతలకు
మనం పూసిన తేనెను
ఒలికించే ప్రయత్నం చేస్తుందట
 
అహానికి అధికారానికి
చరమగీతాన్ని రాసేసి
చివరి చరణం పాడుతుందట
 
కపటానికి కాయానికి
మధ్యనున్న ప్రేమను
తెలియజేస్తుందట
 
అటు ఇటు వెరసి
మనమేంటో
మన చావు చెప్తుందట..!!

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - Vinashakale vipareetha buddi
వినాశకాలే విపరీత బుధ్ధి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఓపికను తికమక పెట్టే -  ఓటీపీ !
ఓపికను తికమక పెట్టే - ఓటీపీ !
- బొల్లిముంత వెంకట రమణా రావు
జీవన కళ
జీవన కళ
- Aruna Nistala
కార్తీకమాసం స్పెషల్ పోలి స్వర్గం
కార్తీకమాసం స్పెషల్ పోలి స్వర్గం
- విష్ణుభొట్ల రామకృష్ణ
Kashi Prayana Kathalu - Danam Chesina Taraganidi
కాశీ ప్రయాణ కథలు - దానము చేసిన...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అనుమానం మా జన్మహక్కు!
అనుమానం మా జన్మహక్కు!
- బొల్లిముంత వెంకట రమణా రావు