23-08-2019 నుండి 29-08-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబాటు పొందుతారు. సోదరుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం ఉంది. మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన ధనంలో స్పష్టత వస్తుంది, ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం కలదు. విదేశాల్లోఉండేవాళ్ళు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయుటకు చేయు ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఒకింత తడబాటు ఉంటుంది, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళుట మంచిది. సంతానం విషయాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ఆరంభంలో కొంత ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదాపడే సూచన. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. మానసికంగా దృడంగా ఉండుట సూచన. విదేశాల్లో ఉన్న వారితో చర్చలు చేయుటకు అవకాశం కలదు. రుణపరమైన విషయాల్లో ఒకింత ఇబ్బందులు తప్పకపోవచ్చును. మిత్రులతో కలిసి మీ ఆలోచనలు పంచుకుంటారు , చర్చల్లో ఒకింత నిదానం అవసరం.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఉద్యోగంలో ఒకింత పనిఒత్తిడి ఉంటుంది, చేసే పనివిషయంలో స్పష్టత అవసరం. అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు హాజరు అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు అలాగే వివాదాలకు దూరంగా ఉండుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. నూతన పరిచయాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం దైవపరమైన విషయాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ముందుగా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేయుప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. మిత్రులనుండి లేక ఆత్మీయుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో చర్చల్లో పాల్గొనే అవకాశం కలదు.
 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఆరంభంలో ఒకింత ఆందోళన తప్పక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకు సైతం అశ్రద్ధ చేయకపోవడం సూచన. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచ్చును. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పెద్దలతో మీకున్న పరిచయం వలన లబ్దిని పొందుతారు. మీ మాటతీరు మూలన కొంత నష్టపోయే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, చర్చలకు అవకాశం ఉంది.

 

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం పెద్దలతో చర్చలు చేయునపుడు కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడం మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, మీ ఆలోచనల్లో ఒకింత జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం పెద్దలతో లేక ఆత్మీయులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందినా, అనుకోని ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. స్వల్పఅనారోగ్యం మిమ్మల్ని బాధకు గురిచేసే అవకాశం కలదు.

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆరంభంలో ఒకింత ఆందోళన చెందిన వారంచివరలో అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉన్న, సమయానికి పనులను పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆత్మీయుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చర్చల్లో పాల్గొంటారు.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన విషయాల్లో ఆసక్తిని చూపిస్తారు. విదేశాలలో ఉన్నవారు స్వదేశానికి తిరిగివచ్చే అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. సంతానం విషయాల్లో సంతోషాన్ని కలిగి ఉంటారు. జీవితభాగస్వామితో ఊహించని విభేదాలకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగినజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తండ్రితరుపు బంధువులతో మాటపట్టింపులకు వెళ్లకపోవడం సూచన.
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం మాత్రం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు.

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం