వేయిపడగలు - Manasa Nirakh

 వేయిపడగలు కవిసామ్రాట్ విశ్వనాథ శర్మ గారి అద్భుత రచన, వేయి పేజీల నవల . అద్భుతమైన సాహిత్యం, విశ్లేషాత్మకమైన పాత్రల అభిప్రాయాలూ, కలిసి  సృజనాత్మకమైన  సన్నివేశాలతో కూడి మనిషి జీవితం లోని  అన్ని  ధార్మిక విషయాలని ప్రస్తావించి, లోతుగా విశ్లేషించి ఆలోచింపచేసే 20వ శతాబ్దం నాటి సాంఘిక నవల.భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాల గొప్పతనం, దైవికమైన హిందూ ధర్మ విశిష్టత స్వతంత్ర పోరాట సమయం లో భారత దేశ పరిస్థితి, ఆంగ్లేయుల రాక,ఆధునిక నాగరికత,  సంస్కృతి ఎలా విస్తరింపబడింది అనే విషయాలు, ప్రస్తావిస్తూనే ,విభిన్నమైన పాత్రల ద్వారా సామాన్యుల జీవితాలు, పశ్యాథపు పెను ప్రభావాలకు లోనైన  సందర్భాలు, ఇతర ధార్మిక విషయాలు, వారి జీవితాలతో ముడిపడ్డ కాస్త నష్టాలూ ప్రస్తావిస్తూనే వివిధ పాత్రల ద్వారా  భార్య భర్తల అన్యోన్యత, భక్తి యొక్క అసలు అర్థం ,దాని పవిత్రత, అందమైన స్నేహం, గురు శిష్యుల సంబంధం,రాజపాలన మొదలైనవి చాల స్పష్టమైన అభిప్రాయాల ద్వారా, సన్నివేశాల ద్వారా చెప్పబడిన మహా గ్రంధం.

ఆధునికుల మహాభారతం గా గౌరవింపబడే ఈ నవల ముఖ్యంగా ధర్మా రావు అనే వ్యక్తి జీవిత నైపధ్యం గ సాగుతుంది. అతను జీవితకాలం లో అనుభవించిన అనేక పరిస్థితుల్ని వివరిస్తూ ,ధార్మికంగా అతను ఎలా నడుచుకున్నాడో, అందరు ఎలా నడుచుకోవాలో అర్థమయ్యేలా వివరిస్తుంది. ధర్మా రావు,ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి,రామేశ్వర శాస్త్రి అనే ఒక పెద్ద ధర్మాత్ముడి కుమారుడు, తండ్రి దాన ధర్మాల వాళ్ళ ఆస్థి అంత నష్టపోయినా, అయన నేర్పిన ధర్మ మార్గం లో జీవితాన్ని కొనసాగిస్తూ, తన జ్ఞాన సంపద అవసరమైన వద్ద పంచుతూ, జీవితాన్ని కొనసాగిస్తాడు.లౌకికమైన పోకడలు తెలుగు సంస్కృతి ఆచారాల్ని పక్క దారి పట్టిస్తుంటే సమర్దించనందుకు ఉద్యోగం పోయినా, చలించని గొప్ప మనస్తత్వం కలవాడు.తన అపారమైన జ్ఞాన సంపద ద్వారా భగవంతుడికే అంకితమవ్వాలి అనుకున్న దేవదాసి ధ్యేయానికి సహకారం అందించి ఆమెకి మోక్షం కలిగించేలా చూస్తాడు. ఇది వివరంగా అర్థమవ్వాలి అంటే ఆ నవల సారం చదవాలి. తన స్నేహితులకి చేతనైన సహకారం అందించే విషయాలు చాల వివరంగా చెప్పబడ్డాయి. ఈ నవల చదివిన తరవాత సంబంధాలు ఎంత సున్నితమైనవో , స్నేహం ఎంత మధురమైన సంబంధమో అన్న భావన కచ్చితంగా కలుగుతుంది. ఆధునిక జీవితం లో మనందరికీ అవసరైమా ఎన్నో విషయాలు ఇందులో పలు సన్నివేశాల రూపం లో ప్రస్తావింపబడ్డాయి.

ఈ నవలలో ఈ కాలానికి ఉపయోగపడే కొన్ని ముఖ్య సందేశాలు కొన్ని పాత్రల ద్వారా పరోక్షంగా చెప్పబడినవి:
1 .ధర్మా రావు - మనము ధర్మాన్ని కాపాడితే ధర్మం మనలని రక్షిస్తుంది.
2 .అరుంధతి -ప్రేమ చాల పవిత్రమైనది.దాంపత్య ధర్మం చాల గౌరవింప బడేది.
3 .గిరిక -సంకల్పం ఎంత గొప్పగా ఉంటె విజయం అంత గొప్పగా వరిస్తుంది. విజయం సాధించడానికి సమయం పట్టవచ్చు కానీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి
4 హరప్పా -గురువు మాట వేదవాక్కు వంటిది.తమ జీవిత ధర్మం ప్రతిఒక్కరు ఆచరించాలి.
5  మంగమ్మ- తెలిసి చేసినా,తెలియక చేసినా, తప్పు చేస్తే, అనుభవించక తప్పదు.
6 .రామేశ్వరం -మంచి చెడుల  పోరు లో అంతిమ విజయం మంచిదే.

గణాచారి పాత్ర ద్వారా సనాతన ధర్మ విషయాలని సున్నితంగా వివరింపడింది. అంతేకాదు ఈ నవలలో విషయాలు ,పాత్రలు ఎంత గొప్పవి అంటే , ఎపుడో రాయబడిన ఈ నవల లో వివరించిన విషయాలే మన  తెలుగు లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి అని నాకు అర్థమైంది. అంత గొప్ప సందేశాత్మక నవల ఈ వేయిపడగలు, ప్రతిఒక్కరు చదివితే ఎంతో విజ్ఞానం,వివేకం అంతకన్నా మంచి నుభవం తప్పకుండా కలుగుతుంది.

ముఖ్యంగా ఈ జెనెరేషన్ లో టెక్నాలజీ మనుషుల మధ్య దూరం పెంచుతుంది.ఇలాంటి నవలలు మనుషుల్ని మనసులు లోతుల్లో ఉన్న బంధాల గురించి ఆలోచింపచేస్తుంది.వేయిపడగలు అంటే మనిషి మనసులో స్పృశించే వెయ్యి భావాలూ, ఒక్కో భావానికి అనేక అంతరంగాలు, అవి మిగిలినుంచే వేయి అనుభవాలు.