పరీక్ష - డా.ముట్నూరు ఉపేంద్రశర్మ.

exam

ఒక ఊరిలో గోపాల శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు.అతను వివిధ రకాల వ్యాపారాలు చేసి బాగా సంపాదించాడు. వయసు మీద పడడం వల్ల ఈ మధ్య వర్తకంలో కాస్త వెనక బడ్డాడు. ఓ రోజు బాగా ఆలోచించి తన ఇద్దరు కొడుకులను పిలిచి తన పరిస్థితి గురించి కుటుంబ పరిస్థితి... వ్యాపారం గురించి నాలుగు మాటలు చెప్పాడు. తర్వాత తన జేబు లొంచి వెయ్యి రూపాయలు తీసి...ఇద్దరికి చెరో ఐదువందలు చొప్పున ఇచ్చి ఇంట్లో ఖాళీగా ఉన్న ఓ గదిని నింపమన్నాడు. పెద్దకొడుకు గడ్డిని...కర్రలను తెచ్చి ఆ గదిని నింపేసేడు.అది చూసి తండ్రి నవ్వుకున్నాడు. రెండో కొడుకు ఓ పెద్ద కొవ్వొత్తును తెచ్చి వెలిగించాడు...కాంతి ఆ గదిని నిపేసింది.అది గమనించిన తండ్రి రెండో కొడుకుకు తాళాలు ఇచ్చి...వ్యాపార బాధ్యతలను అప్ప జెప్పాడు.