సత్యజిత్ రాయ్ - ambadipudi syamasundar rao

సత్యజిత్ రాయ్

భారత దేశపు చలచిత్ర రంగానికి ప్రపంచవ్యాప్తముగా గుర్తింపు తెచ్చినవారిలో సత్యజిత్  రాయ్ ప్రముఖుడు.  ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించిన సత్యజిత్ రాయ్ భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత మే 2 1921న సత్యజిత్ సుకుమార్, సుప్రభ దంపతులకు అంటే బెంగాలీ కళాకారుల కుటుంబములో పుట్టాడు  రాయ్ వంశ చరిత్ర తెలుసుకోవలసినది  చాలా ఉంది సత్యజిత్ రాయ్ వంశ చరిత్రలో పది తరాలు వెనక్కి పొతే ఈయన వంశనికి " రాయ్ "అనే బిరుదు మొఘలుల నుండి పొందినది అని తెలుస్తుంది వారి వంశస్తులు బెంగాలీ కాయస్తులు అయినప్పటికీ రాయ్ కుటుంబీకులు విష్ణువును ఆరాధించే వైష్ణవులు సాధారణముగా బెంగాలీ కాయస్తులు శైవ సాంప్రదాయము పాటించేవారు.రాయ్ కుటుంబ చరిత్రను వారి పూర్వీకులను గురించి తెలుసుకుంటే శ్రీ రామసుందర్ దేవ్ నాడియా జిల్లాలోని చక్కదహ్ కు చెందిన వారు వారు  అక్కడినుండి ఈస్ట్ బెంగాల్ లోని షేర్ పూర్ కు వలస వెళ్లి అక్కడ షేర్ పూర్ జమిందార్ ను ఆశ్రయించారు అయన రామ్ సుందర్ ప్రతిభను గుర్తించి అయన తో పాటు తన ఎస్టేట్ లో ఉంచుకొని తన జమిందారిలో కొంత భాగము ఇచ్చి రామ్ సుందర్ ను తన అల్లుడిగా చేసుకున్నాడు. రాయ్ తాత ఉపేంద్రకిషోర్ రాయ్ చౌదరి, ఒక రచయిత, తత్త్వవేత్త, ప్రచురణకర్త, బ్రహ్మ సమాజం నాయకుడు  సుకుమార్ (రాయ్ తండ్రి)బెంగాలీలో నాన్సెన్స్  కవిత్వము (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, నవ్వు పుట్టించే కవిత్వము) సృష్టికర్త, బాల సాహిత్యవేత్త, విమర్శకుడు.
రాయ్‌కు 3 సంవత్సరములు ఉన్నపుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయముతో రాయ్‌ని పెంచింది.రాయ్ కలకత్తా లోని బాలిగంజ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు  రాయ్ కళల పై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రెసిడెన్సీ కాలేజీలో అర్థశాస్త్రము చదివాడు. శాంతినికేతన్ పై చిన్న చూపు ఉన్నప్పటికీ తల్లి ప్రోద్బలముతో టాగూర్ కుటుంబము పై గౌరవముతో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్) లను ఆభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు నందలాల్ బోస్  వినోద్ బిహారీ ముఖర్జీ నుంచి నేర్చుకున్నాడు, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు దర్శించి భారతీయ కళల పై మక్కువ పెంచుకున్నాడు  వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రాయ్, లండన్ లో ఫ్రెంచి నిర్మాత జాన్ రెన్వాను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా బైసికిల్ థీవ్స్ తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు
1943 లో రాయ్ బ్రిటిష్ వారు నడిపే ఆడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో నెలకు 80 రూపాయల జీతానికి చేరి డి జె కీమర్ అనే ఆయనతో కలిసి పనిచేసేవాడు విజువల్ డిజైనింగ్ అంటే ఆసక్తి అభిలాష ఉన్నప్పటికీ ఆ సంస్థలో బ్రిటిష్ వారికి భారతీయులకు వేతనాలలో ఉండే తేడా  ను ఇష్టపడక బయటికి వచ్చాడు. ఆ తరువాత డి కె గుప్తా  ప్రారంభించిన సైనేట్ ప్రెస్ లోచేరాడు గుప్తా తన సంస్థ ప్రచురించే పుస్తకాలకు కవర్ డిజైన్లను  మంచి కళాత్మకంగా తయారు చేయమని రాయ్ కి బాధ్యత అప్పజెప్పాడు ఆ విధముగా ప్రముఖుల పుస్తకాలకు కవర్ డిజైన్ చేసేవాడు వాటిలో జవహర్ లాల్ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా, జిమ్ కార్బెట్ రచించిన మాన్ ఈటర్స్ ఆఫ్ కుమావున్ వంటి పుస్తకాలూ మరియు ప్రముఖ బెంగాలీ రచయితల పుస్తకాలు ఉన్నాయి. విభూతి భూషణ్ బందోపాధ్యాయ రచించిన నవల పథేర్ పాంచాలి యొక్క చిన్నపిల్లల వర్షన్ పై పనిచేసి దానికి ఆమ్ ఆంతీర్ భేపు అనే పేరుతొ విడుదల చేసాడు ఆ సబ్జక్ట్ వలన బాగా ప్రభావితము చెందిన రాయ్ తన మొదటి సినిమా పాథేర్ పాంచాలిగా తీశాడు
చిదానంద దాస్ గుప్త మరియు ఇతరులతో కలిసి రాయ్ 1947లో కలకత్తా  ఫిల్మ్  సొసైటీని ప్రారంభించి విదేశీయ సినిమాల ప్రదర్శనను మొదలుపెట్టాడు ఈ సినిమాలను రాయ్ చూడటమే కాకుండా సీరియస్ గా స్టడీ చేసేవాడు రెండవ ప్రపంచయుద్ధము సమయములో కలకత్తాలో ఉన్న అమెరికన్లతో  స్నేహముగా ఉండి అమెరికన్ ఫిలిమ్స్ విషయాలు తెలుసుకొనేవాడు అప్పుడు నార్మన్ క్లార్ అనే అమెరికన్ ఉద్యోగి తో స్నేహము చేసి అతనితో సినిమాలు చదరంగము, వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్ మొదలైన అంశాలపై అతనితో అభిప్రాయాలను పంచుకొనేవాడు. 1949లో రాయ్ తన దగ్గర బంధువు అయిన ,తానూ ఇష్టపడ్డ బిజయ్ దాస్ ను వివాహమాడాడు వారికి సందీప్ రాయ్ అనే కొడుకు ఉన్నాడు
ఆతను కూడా సినీ దర్శకుడే, ఆ సంవత్సరంలోనే ప్రెంచ్ దర్శకుడు జీన్ రెనార్ తన సినిమా షూటింగ్ కు కలకత్తా వస్తే రాయ్ ఆయనకు లొకేషన్స్ ఎంచుకోవటంలో సహాయము చేసేవాడు రాయ్, రెనార్ తో తన మనస్సులోని కోరిక పాథేరే పాంచాలి సినిమా తీయటం గురించి చర్చిస్తే అయన రాయ్ ని ఎంకరేజ్ చేసాడు 1950లో డీజే కెమెర్ అనే దర్శకుడు రాయ్ ని తన హెడ్ క్వార్ట్రర్స్ ఆఫీసులో పనిచేయటానికి లండన్ పంపాడు. అక్కడ ఉన్న ఆర్నెల్ల కాలములో రాయ్ 99 సినిమాలు చూసాడు ఇవన్నీ రాయ్ మీద అయన దర్శక ప్రతిభ మీద ప్రభావాన్ని చూపాయి అప్పటి నుండి తానూ ఫిల్మ్ మేకర్ అవాలని గట్టిగా తీర్మానించుకున్నారు.
రాయ్ సినిమాలు తీయటానికి అనుభవము లేని సిబ్బందిని ఎన్ను కొనేవాడు అయినప్పటికీ కెమెరామన్ సుబ్రతా మిత్ర కళాదర్శకుడు బన్సీ చంద్రగుప్తా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. నటులు కూడా చాలా మంది ఔత్సాహిక నటులే కొత్తవారే ప్రారంభములో  కొన్ని విజయ వంతము కానీ ప్రయత్నాలతో  రాయ్ చాలా మంది నిర్మాతలను వారి పెట్టుబడులను తన ప్రాజెక్ట్స్ లో పెట్టించలేక పోయినాడు చివరకు తన సొంత సేవింగ్స్ తో 1952లో పాథేరే పాంచాలి సినిమాను కష్టపడి రెండేళ్లకు పూర్తిచేసాడు ఈ సినిమాకు రాయ్ ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ చౌదరి కొంత సొమ్మును పోగుచేసాడు ఆ టైం లో కొంతమంది స్క్రిప్ట్ ను మార్చమని లేదా ప్రొడక్షన్ ను సూపర్ వైజ్ చేస్తామన్నా రాయ్ ఒప్పుకోలేదు చివరకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఆర్ధిక సహాయముతో సినిమాను పూర్తిచేయగలిగాడు 1955లో విడుదల అయినా ఆ సినిమా దేశవిదేశాలలో అనేక బహుమతులను గెలుచుకొని రాయ్ కి పేరు తెచ్చింది.ఈ సినిమాకు ప్రముఖ సితార్ విద్వాంసుడు రవిశంకర్ సంగీత బాణీలకు సహాయము చేశాడు రాయ్ సౌమిత్ర ఛటర్జీ షర్మిల టాగోర్ వంటి ప్రముఖ నటి మణులను వెండి తెరకు పరిచయము చేసాడు
రాయ్ అంతార్జాతీయ కెరీర్ అపరాజితో సినిమాతో మొదలైంది ఈ సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ లయన్ ను గెలుచుకుంది
రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు సమకాలీన సినిమా
రంగము లోఈయన 20 వ శతాబ్దపు చలన చిత్ర నిర్మాత,దర్శకుడి గా పేరు పొందాడు. 1958- 64 మధ్యకాలములో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి అవి మ్యూజిక్ రూమ్(1958) ,డా బిగ్ సిటీ(1963), చారులత(1964)
1967లో రాయ్ ద ఏలియెన్ అనే సినిమాకు స్క్రిప్ట్ వ్రాసాడు ఈ స్క్రిప్ట్ కు బంకు బాబుర్ బంధు అనే కధ  ఆధారము.  ఈ కదా సందేశ్ పత్రికకు 1962లో రచించినది ఈ సినిమాను కొలంబియా పిక్చర్స్ వారు ఇండో అమెరికన్ కొ ప్రొడక్షన్ గాను ప్రముఖ హాలీవుడ్ నటులు మర్లాన్ బ్రాండో పీటర్ సెల్లెర్స్ ముఖ్య తారాగణముగా తీద్దామని అనుకున్నారు మైఖేల్ విల్సన్ పెట్టుబడి పెట్టేటట్లుగా నిర్ణయించుకున్నారు విల్సన్ రాయ్ ని ఇద్దరికీ స్నేహితుడైన ఆర్ధర్ సి క్లార్క్ ద్వారా అప్ప్రోచ్ అయినాడు విల్సన్ కాపీ రైట్ తీసుకున్నాడు కానీ ఈ డీల్ లో రాయ్ కి ఒక్క పైసా కూడా ఇప్పటికి దక్కలేదు ఆ తరువాత బ్రాండో ను జేమ్స్ కొబర్న్ తో రీప్లేస్ చేశారు రాయ్ ఈ సినిమా పట్ల విరక్తి ఏర్పడి కలకత్తా వచ్చాడు కొలంబియా సంస్థ వారు అనేక సార్లు రాయ్ ని ఈ ప్రాజెక్ట్ పునరుద్దరించాలని 1970 లోను 1980 లోను విజ్ఞప్తి చేశారు కానీ ఫలితము లేకపోయింది కానీ 1982లో వచ్చిన ఒక హాలీవుడ్ ఎంటర్ టైన్  మెంట్ సినిమా రాయ్ కథను పోలి ఉండటాన్ని క్లార్క్ రాయ్ గమనించారు ఈ పనిచేసినది ఎవరోకాదు స్టీవెన్ స్పీల్ బర్గ్ కానీ స్పెల్ బర్గ్ రాయ్ వాదనను మొండిగా తిరస్కరించాడు
రాయ్ తీసిన సినిమాలో ఎక్కువగా మధ్యతరగతి స్త్రీల చిత్రీకరణ ఉంటుంది.ఈ సినిమాల లోని ఏ ఒక్క సన్నివేశమైన ఒక చిన్న కథలాగా ఉంటుంది.రాయ్ సినిమా చిత్రీకరణలో నెగటివ్ లలో సీన్లు, కలలో సన్నివేశాలు,ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు లాంటి కొత్త పోకడలను సృష్టించాడు 1977లో రాయ్ మున్షి ప్రేమ్ చంద్ కధను షత్రంజ్ కె కిలారి అనే పేరుతొ లక్నో లో హిందీ లో సంజీవ్ కుమార్ సయీద్ జాఫ్రీ, అంజాద్ ఖాన్ షబానా అజమీ విక్టర్ బెనర్జీ , రిచర్డ్ అటెన్ బర్రో వంటి భారీ తారాగణముతో తీసాడు ఇది అయన తీసిన మొదటి హిందీ సినిమా.1980లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గూపి గైన్ బాఘా బైన్ అనే పొలిటికల్ సినిమా తీసాడు
 సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్"ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకుని గౌరవ ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి భారతీయునిగా నిలిచాడు.ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు. . ..
.ప్రపంచానికి సత్యజిత్ రాయ్ ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా కూడా ఆయన బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు. తన తాత ప్రారంబించిన "సందేశ్" పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రాయ్ తిరిగి ప్రారంభించాడు. ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రాయ్ పిల్లల కోసం "ఫెలూదా" అన్న డిటెక్టివ్ ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాసారు. ఇందులో ఫెలూదా, అతని కజిన్ తపేష్, జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు. ఇది కాక సత్యజిత్ రాయ్ ప్రొఫెసర్ శొంకు అన్న మరో పాత్రని కూడా సృష్టించి నవలలు రాసాడు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది. సత్యజిత్ రాయ్ కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు ఆయనకు వివిధ రంగాలలో ఉన్న విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆయన రచనల్లో చాలా వరకు గోపా మజుందార్ ఆంగ్లానువాదం చేసారు. సత్యజిత్ రాయ్ పిల్లల నవల - "ఫతిక్ చంద్" తెలుగు లోకి కూడా అనువదితమైంది. ఇవి కాక, సినిమాలు తీయడం గురించి ఆయన అనేక వ్యాసాలు రాశాడు. వాటిలో కొన్ని తెలుగులోకి అనువదితం అయ్యాయి కూడా   ఆయన కథలన్నీ మొదట పన్నెండు కథల సంకలనాలుగా వచ్చాయి. పన్నెండుకి రకరకాల నామాంతరాలతో విడుదల కావడం వాటి ప్రత్యేకత. ఉదాహరణకు - "డజన్", "టూ ఆన్ టాప్ ఆఫ్ టెన్" వగైరా
సత్యజిత్ రాయ్ తన కెరీర్ లో 32 ఇండియన్ నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఒక బంగారు సింహము, ఒక బంగారు ఎలుగుబంటి, రెండు వెండి ఎలుగుబంట్లు అంతార్జాతేయ్య వేదికలమీద అందుకున్నాడు అలాగే 1992లో అకాడమీ హానరరీ అవార్డు కూడా అందుకున్నాడు భారత ప్రభుత్వము భారత రత్న బిరుదు తో సత్కరించింది. ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయన పై ఓ స్టాంపును విడుదల చేసింది చలన  చిత్ర సీమలో చార్లీ  చాప్లిన్ తరువాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న రెండవ వ్యక్తి రాయ్ ఒక్కడే. అలాగే భారత ప్రభుత్వము నుండి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ను ప్రాన్సు  ఆధ్యక్షుడి నుండి 1987లో సత్కారాన్ని పొందాడు.   కానీ అపూర్  సంసార్ సినిమా మీద బెంగాలీ విమర్శకులు చాలా ఘాటుగా విమర్శించారు విమర్శకుల విమర్శలకు చాలా అరుదుగా స్పందించే రాయ్ ఈ విమర్సలకు జవాబుగా ఒక వ్యాసాన్ని కూడా వ్రాసాడు అదే విధముగా అయన అభిమాన సినిమా చారులత సినిమాను  కూడా డిఫెండ్ చేసుకున్నాడు  రాయ్ బ్రిటిష్ రాజ్ మీద కూడ దేవి వంటి సినిమాలు తీసాడు ప్రధాన మంత్రి జవహర్ లాల్ సలహా మేరకు విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ పై ఒక డాక్యుమెంటరీ ని 1962లో తీసాడు అలాగే బంగ్లా దేశ్ విమోచన గురించి సినిమా తీద్దామనుకున్నాడు కానీ ఆ ఆలోచనను కారణాంతరాల వల్ల విరమించుకున్నాడు  రాయ్ సినిమాలలో కలర్ లో తీసిన మొదటిది కాంచన్  గంగ ఆ తరువాత చారులత ఈ సినిమాకు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది ఈ సినిమా రాయ్ కి అభిమాన సినిమా  సినిమా నిర్మాణము ఇష్టమైనప్పటికీ తనకు పర్యటన అంటే అభిమానము అని చెప్పేవాడు అందులో భాగము గానే జపాన్ పర్యటించి అక్కడ తానూ అభిమానించే జపాన్ ఫిల్మ్ మేకర్ అయినా అకిరా కురుసోవా ను కలిసి ఫిల్మ్ నిర్మాణములో మెళకువులను తెలుసుకున్నాడు రాయ్ కి అయన కెరీర్ మొత్తములో జీన్ రెనార్ పట్ల అభిమానము అని చెప్పేవాడు అలాగే నియో రియలిజం ను ప్రతిబింభించేటట్లు సినిమాలు తీసే ఇటాలియన్ దర్శకుడు డి సెక ను కూడా అభిమానించేవారు తానూ సినిమా కళను జాన్ ఫోర్డ్, బిల్లీ వైల్డర్ వంటి పాత హాలీవుడ్ మాస్టర్స్ నుండి నేర్చుకున్నాను అని చెప్పేవాడు స్టాన్లీ కుబ్రిక్ ను సూపర్ టెక్నిషియన్ గా అభివర్ణించేవాడు రే దృష్టిలో స్క్రిప్ట్ దర్శకత్వములో అంతర్భాగమని గట్టిగా విశ్వసించేవాడు ఇతర భాషలలో సినిమాతీయాలంటే (అయన రెండే రెండు సినిమాలు బెంగాలీ లో కాకుండాఇతర భాషలో తీశాడు) ముందు సినిమా స్క్రిప్ట్ ను ఇంగ్లీష్ లో వ్రాసుకొని తర్జుమా చేయించుకొనేవాడు రాయ్ సినిమాలకు సినీమాటోగ్రఫర్ గాపనిచేసిన సుబత్రో మిత్ర పనితనం రాయ్ సినిమాలకు వన్నె తెచ్చేది నాయక్ సినిమాతరువాత మిత్ర రాయ్ టీమ్ నుండి తప్పుకోవటం వలన ఫోటోగ్రఫి క్వాలిటీ తగ్గినది అని విమర్శకుల అభిప్రాయము ప్రముఖ సంగీత విద్వాంసులు పండిట్ రవి శంకర్, విలాయత్ ఖాన్, అలీ అక్బర్ ఖాన్ వంటి వారితో రాయ్ పనిచేసేవాడు సినిమాలలో సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు.రాయ్ తో పనిచేసిన నటులు అందరు సంతృప్తిగా పనిచేసేవారు దర్శకుడిగా అయన వారిలోని ప్రతిభను వెలికితీసేవాడు ఆ పాత్ర ప్రభావము తప్ప నటీనటుల ప్రభావము కనిపించేది కాదు
 రాయ్ పని రాక్షసుడు చేసే పనిని తప్ప దేనిని ప్రేమించేవాడు కాదు రోజుకు 12 గంటలు పని చేసేవాడు కాస్త ఎక్కువ సిగరెట్లు కాల్చెవాడు ఇతర దురలవాట్లు ఎమి లేవు తెల్లవారు ఝామున రెండుగంటలకు లేచి తన స్క్రిప్ట్ పనులు చూసుకొనేవాడు పురాతన వస్తువుల సేకరణ పట్ల అభిమానము చూపేవాడు మంచి మంచి పెయింటింగ్స్ అరుదైన పుస్తకాలను సేకరించేవాడు రాయ్ సినిమాలు మానవత్వాన్ని యూనివర్సల్ బ్రదర్ హుడ్  ను ప్రేరేపించేవిగా ఉండేవి. ప్రపంచ వ్యాప్తముగా రాయ్ ని విమర్శకులు మెచ్చుకునేవారు  ఈ విమర్శకులు రాయ్ గురించి చెప్పినవి వ్రాస్తే అదే పెద్ద వ్యాసము అవుతుంది.సైట్ అండ్ సౌండ్ క్రిటిక్స్ సంస్థ వారు రాయ్ ని ప్రపంచవ్యాప్తముగా ఎన్నుకున్న పది దర్శకులలో 7 వ వాడిగా గుర్తించారు అలాగే  2004లో బిబిసి వారు నిర్వహించిన పోల్ లో గ్రేటెస్ట్ బెంగాలీ ఆఫ్ ఆల్ టైమ్స్ గా ఎన్నుకోబడ్డాడు
తన సినిమా నిర్మాణాలలో విసుగుగా ఉన్నప్పుడు డార్జిలింగ్ లేదా పురిలకు వెళ్లి రిఫ్రెష్ అయ్యేవాడు రాయ్ సినిమాల విజయము అయన వ్యక్తిగత జీవితమూ మీద ఏమాత్రము ప్రభావము ఉండేది కాదు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా తన భార్య,తల్లి  పిల్లలతో, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి  ఒక అద్దె ఇంట్లోనే ఉండేవాడు 1983లో ఘరే బరె  అనే సినిమా కు పనిచేస్తున్నప్పుడు రాయ్ కి గుండె నొప్పి వచ్చింది అప్పటి నుండి సినిమాల పై పనిచేయటం తగ్గించాడు కొడుకే ఆ సినిమా భాద్యతలు చేపట్టి పూర్తిచేశాడు  ఈ దర్శక దిగ్గజము ఏప్రిల్ 23, 1992లో అంటే అయన పుట్టిన రోజుకు 9 రోజులు ముందు తనువూ చాలించాడు కానీ అయన పేరు భారతీయ చలన  చిత్ర సీమలో ప్రేక్షకుల మదిలో శాశ్వతముగా అయన సినిమాల ద్వార ఉంటుంది
అంబడిపూడి శ్యామసుందర రావు
. 

మరిన్ని వ్యాసాలు

Cine srungaram
సినీ శృంగారం
- మద్దూరి నరసింహమూర్తి
Heaven On Earth - Kashmir
భూలోక స్వర్గం కాశ్మీర్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
రెండవ ప్రపంచ యుద్ధం-రహస్యాలు/విశేషాలు 6
రెండవ ప్రపంచ యుద్ధం - 6
- శ్యామకుమార్ చాగల్
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే పాత ప్రేమికులను వదులుకోవాల
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే...
- సదాశివుని లక్ష్మణరావు
ప్రభల సంస్కృతి .
ప్రభల సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బుడబుక్కలవారు.
బుడబుక్కలవారు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పూరి జగన్నాధ రథ యాత్ర .
పూరి జగన్నాధ రథ యాత్ర .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
వీధి నాటకం .
వీధి నాటకం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.