కాకి నా కథ నాయకుడు - Dr Rama Padma (Singapore)

Crow is My Hero

కకాలుకీయం  కాకమ్మ చెప్పిన జీవన వేదం
మేఘవర్ణుడనే కాకి రాజు గుర్తున్నాడా
స్థిరజీవి లాంటి కాకి మంత్రి నీ చూసారా

ఇది అన్నారు వారు

ఆడకు  నిప్పుతో చెలగాటం
ఆర్పేయ్యి  మిగిలిన ఆఖరి  నిప్పుకణం
మిగల్చకు శత్రువు ఋణం
ధైర్యమే ధర్మం
దాతృత్వమే చేసుకొనే మంచి కర్మం
సాహసమే సంపద
తెలివితేటలే పెట్టుబడి

కాకమ్మ కధలు జీవన వేదాలు

సమస్యల ను ఎదురుకో
సవాళ్ళకు బెదిరిపోకు
యుద్ధం చేసినవాడిదే విజయం
పారిపోతే అది పరాజయం

కాకి నేందుకు చిన్నచూపు
కాకి నాకు కధా నాయకుడు
కాకి నాకు వేదం చెప్పిన ఋషీశ్వరుడు
నల్లని కాకి నాకు పసితనపు నేస్తం

అమ్మమ్మ చూపించిన కాకి
కాకా అంటూ మాటలు నేర్పిన కాకి
ఎండవేళ కుండలో నీళ్లు తెలివిగా తా గిన కాకి
గులకరాళ్లు తో విజ్ఞానం చూపిన కాకి

ఐకమత్యానికి  మరో పేరు కాకి
అన్నమైన మలినమైన ఒక్కలాగే స్వీకరించే స్థితప్రజ్ఞుడు కాకి

పిండము తిని పితరులను తరిమ్పచేసిన కాకి

చిలుకలు గోరువంకలు హంసలు కోయిలమ్మలు  ఇవేనా కావాలి
ఇంటిచుట్టూ తిరిగే కాకి అంటే అందరికి అలుసా

కాకి నా పసితనం కాకి నా చిన్నతనపు చందమామ కథల నేస్తం
కాకి నా మొదటి సైన్స్ టీచర్ .  కాకి వచనం నేను విన్న మొదటి ప్రవచనం