బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు- జానీ వాకర్ - ambadipudi syamasundar rao

బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు- జానీ వాకర్

హిందీ సినిమాలు చూసేవాళ్లకు ఈ పేరు హాస్యనటుడిగా బాగా పరిచయము హిందీ సినిమాలలో పాత తరము హాస్యనటులలో మేటి హాస్య నటుడు జానీ వాకర్ మాలిష్ మాలిష్ తేల్ మాలిష్ ల;వంటీ పాటలు విన్నప్పుడు గుర్తుకు వచ్చే హాస్యనటుడు జానీవాకర్ ఇలాంటి పాటలు అయన  ఖాత లో చాలా ఉన్నాయి వీటిలో తాగుబోతు పాటలలో అయన చూపిన నటన అబ్దుతము అయన మరణము హిందీ సినిమాలకు తీరని లోటు ఈయన తన హాస్యముతో మిలియన్ల ప్రజల అభిమానాన్ని దేశ వ్యాప్తముగా చూరగొన్నాడు. ఇప్పటికి ఆయనపేరు అయన సినిమాల ద్వారా ప్రజల మనస్సులలో శాశ్వతముగా నిలిచిపోయింది,. అయన గురించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాము.
జానీ వాకర్ అసలు పేరు బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రవేశించాక జానీ వాకర్ అనే పేరుతొ వెండి తెర  మీద ప్రత్యక్ష మయినాడు. జానీవాకర్ అనేది అప్పట్లో పాపులర్ విస్కీ బ్రాండ్ ఎందుకంటే అయన వేసిన కొన్ని తాగుబోతు వేషాలవల్ల ఆయనకు ఆ పేరు ఖాయము చేశారు సినిమాలలో చేరక మునుపు ఈయన బెస్ట్ సిటీ బస్ సర్వీసులలో కండక్టర్ గాపనిచేసేవాడు ఈయనను గుర్తించిన వ్యక్తి మరో సీనియర్ నటుడు బలరాజ్ సహానీ. దాదర్ బస్ డిపోలో కండక్టర్ ఉద్యోగము  చేస్తున్నప్పుడు బస్సుల లోని ప్రయాణీకులను తన హాస్యముతో మెప్పించేవాడు ఈయన హాస్య ధోరణికి బస్సులోని  ప్రయాణీకులు కడుపుబ్బా నవ్వుతు వారి ప్రయాణ బడలికను మరచిపోయేవారు.
గురుదత్ సినిమా  బాజీ సినిమాలో వేషము కోసము సహానీ, గురుదత్ కు ఖాజీ పేరును సిఫార్సు చేసాడు గురుదత్ కూడా ఖాజీ తాగుబోతు నటనకు ఇంప్రస్ అయి తానూ దర్శకత్వము వహిస్తున్న బాజీ లో వేషము ఇవ్వటానికి ఒప్పుకున్నాడు.
సినిమాలో పచ్చి తాగుబోతు వేషాలు వేసి జనాన్ని మెప్పించి కడుపుబ్బా నవ్వించే జానీవాకర్ నిజానికి తాగుబోతు కాదు. ఒక చుక్క సారా త్రాగి ఎరగడు ఒక సాంప్రదాయక ముసల్మాను ఏ రకమైన దురలవాట్లు లేని వాడు అయన నిజ జీవితానికి సినిమా తెర పై కనిపించే పాత్రలకు ఎటువంటి సంబంధము లేదు అది అయన నటన మాత్రమే. అటువంటి పాత్రలు పోషించటంలో అయన ఉద్దేశ్యము ప్రేక్షకులను నవ్వించటమే. అయన ఆకారము స్వరము బాడీ లాంగ్వేజ్ ఆయనను హాస్య నటుడిగా నిలబెట్టాయి.ఆయనలోని నటనకు వన్నె తెచ్చాయి.
గురుదత్ తో జానీ వాకర్ కు ఉన్నఅనుభందము అభిమానము గురుదత్ చేత జానీ వాకర్ కోసము మంచి మంచి పాత్రలు సృష్టించబడేవి అలాగే జానీ వాకర్ ఆ పాత్రలకు ప్రాణము పోసి ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానాన్ని పొందాడు.గురుదత్  జానీవాకర్ కు నటనలో స్వేచ్ఛ ఇచ్చేవాడు అది ఆయనకు జానీవాకర్ పైన ఉండే నమ్మకము నటించేటప్పుడు జానీవాకర్ సెట్స్ లో ఉండే లైట్ బాయ్ లు ఇతర నటీనటుల హావభావాలను గమనిస్తూ వారికి నవ్వు తెప్పించేవిగా ఉన్నాయో లేదో గమనిస్తూ నటించేవాడు.ఆ విధముగా తన స్వంత డైలాగులనే పలికించేవాడు గురుదత్
కూడా ఆ డైలాగులనే తన అసిస్టెంట్ల తో ఆ పాత్ర డైలాగులుగా వ్రాయించుకొనేవాడుట.
.1955లో సినిమా సెట్స్ పై పనిచేస్తుండగా పరిచయమైనా నూర్జహాన్ ను ఆవిడా కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఉన్న, ప్రేమవివాహము చేసుకున్నాడు జానీవాకర్ సోదరులలో ఒకరు టోనీ వాకర్ సినీ నిర్మాత మరొక సోదరుడు విజయ్ కుమార్( వాహుద్దీన్ )నటుడు జానీవాకర్ ముగ్గురు కొడుకులలో ఒకడు నాజిర్ ఖాన్ ఆతను బాలీవుడ్ తెరపైన టివి తెరపైన కనిపిస్తూ నటన వార సత్వాన్ని కొనసాగించి మంచి నటుడిగా పేరు సంపాదించాడు. నాజిర్ ఖాన్ ఆరవ తరగతిలోనే ఉండగా జానీవాకర్ అతని చదువు మాన్పించి సినిమాలలో సోదరుడి ప్రోద్బలము తో చేర్పించాడు.కానీ కొడుకు చదువును మధ్యలో మాన్పించినందులకు మనవళ్ల చదువు భాద్యత తీసుకున్నాడు
క్రమేణా జానీవాకర్ స్థానాన్ని మరో హాస్యనటుడు మెహమూద్ తీసుకున్నాడు సినిమాలలో హాస్యము గురించి వస్తున్నా మార్పులగురించి ఒకసారి మాట్లాడుతూ "మారోజుల్లో మేము సినిమాకు ప్రేక్షకులు వారి భార్య పిల్లలతో వస్తారు కాబట్టి అస్లీల, ద్వందార్ధ సంభాషణలు లేకుండా జాగ్రత్త పడే వాళ్ళము అప్పట్లో కధకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది హాస్యము కథతో జోడింపబడి ఉండేది హాస్యనటుడు కథానాయకుడికి తోడుగా ఉంటూ హాస్యాన్ని పండించేవాళ్ల ము అందువల్ల అస్లీలతకు అవకాశము ఉండేది కాదు నా 300 సినిమాలలో నేను నటించిన ఏ సన్నివేశాన్నిలేదా సంభాషణను సెన్సార్ .బోర్డు వాళ్ళు కట్ చేయలేదు"అని గర్వముగా జానీ వాకర్ చెపుతాడు.అందుచేతనే జానీ వాకర్ సినిమాలను నేటికీ ఇంటిల్లిపాది చూసి ఆనందిస్తున్నారు
తన నటనకు ఎన్నో రకాల పురస్కారాలను అందుకున్నాడు.పోటీ పెరిగి హాస్యములో ధోరణులు మారటం వలన నటన తగ్గించుకున్నా చివరగా  కమల్ హాసన్ సినిమా చాచి 420 లో తాగుబోతు మేకప్ ఆర్టిస్ట్ గాకనిపిస్తాడు 2003 లో  ఈ మేటి హాస్యనటుడు తన జీవితాన్ని చాలిస్తాడు అయన తన పాత్రల ద్వార ప్రేక్షకుల మదిలి శాశ్వతముగా గుర్తుంటాడు.,