ఫేస్ బుక్ సృష్టి కర్త మార్క్ జుకర్ బర్గ్ - ambadipudi syamasundar rao

ఫేస్ బుక్ సృష్టి కర్త మార్క్ జుకర్ బర్గ్

ప్రస్తుతము చిన్న పెద్ద తేడా లేకుండా ఫెస్ బుక్ పేరు వినని వారు వాడని వారు ఉండరు అని చెప్పవచ్చు మార్క్ జుకర్ బర్గ్ అనే వ్యక్తి ఈ పేస్ బుక్ వ్యవస్థాపకుడు. జుకర్ బర్గ్ అమెరికన్ మీడియా మాగ్నెట్ ఇంటర్ నెట్ ఎంటర్ ప్రెన్యూర్ లోకోపకారి మరియు  దయాళువు.ఈయన పూర్తి పేరు మార్క్ ఇలియట్ జుకర్ బర్గ్   ఫేస్  బుక్ చైర్మన్ మరియు కో ఫౌండర్, సీఈఓ  కంట్రోలింగ్ షేర్ హోల్డర్. ఇంతే కాకుండా సోలార్ సెయిల్ స్పేస్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్  కు కూడా కో ఫౌండర్ మరియు బోర్డు మెంబర్ గా ఉంటూన్నాడు.జుకర్ బర్గ్ హార్వర్డ్ యునివేర్సిటి లో చదువు కొనేటప్పుడు ఫెస్ బుక్ అనే సోషియల్ నెట్ వర్కింగ్ సర్వీస్ ను ఫిబ్రవరీ 4,2004 న తన డోర్మిటారి రూమ్ నుండి లాంచ్ చేసాడు. ఈ ప్రోగ్రాం లో తన కాలేజీ రూమ్ మేట్స్  ఎడ్రదో సావెనీన్, ఆండ్రెయ మెక్ కొల్లుమ్ ,డస్టిన్ మోస్క్వీట్జ్ మరియు క్రిస్ హ్యూస్ భాగస్తులు ఈ ప్రోగ్రాం ను మొదట్లో కాలేజ్ కాంపస్ లను సెలెక్ట్ చేసుకోవటానికి ప్రారంభించారు. ఈ సైట్ చాలా త్వరితగతిన వ్యాపించి కాలేజీలు దాటి 2012 నాటికి ఒక  బిలియన్ వాడకం దారులకు చేరింది.  మే 2012 నాటికి ఈ కంపెనీని చాల మంది వాట దారులతో పబ్లిక్ చేసాడు
మే 14, 1984 లో న్యూ యార్క్ నగరంలోని వైట్ ప్లేన్స్ లో జన్మించిన జుకర్ బర్గ్ ,తండ్రి ఎడ్వార్డ్ జుకర్ బర్గ్ ఒక దంత వైద్యుడు,.తల్లి కరేన మానసిక వైద్యురాలు జుకర్ బర్గ్ కు ముగ్గురు సోదరి మణులు జుకర్ బర్గ్ జ్యుఇష్ సాంప్రదాయములో పెరిగాడు ఈయన పూర్వికులు జర్మనీ ఆస్ట్రియా, పోలాండ్ దేశస్తులు . ఆర్డస్లేయ్ స్కూల్ లో చదివేటప్పుడు క్లాసులో మొదటి వాడు గా వుండేవాడు రెండేళ్ల తరువాత ఫిలిప్స్ ఎక్స్టర్ అకాడమీ వారి ప్రైవేట్ స్కూల్ లో చేరి అక్కడ గణితము.,ఆస్ట్రానమీ,ఫిజిక్స్,క్లాసికల్ స్టడీస్ లో బహుమతులు పొందాడు.అలాగే యూత్ లో ఉన్నప్పుడు జాన్ హాప్కిన్స్ సెంటర్ వాళ్ళు టాలెంటెడ్ యూత్ కు నిర్వహించే సమ్మర్ క్యాంప్ కు హాజరు అయినాడు.మిడిల్ స్కూల్ లో ఉన్నప్పుడే జుకర్ బర్గ్ జ్యూక్ నెట్ ను క్రియేట్ చేసాడు ఇది పూర్తిగా పనిచేసే ఇన్స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫార్మ్ ఇది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది రెండు వైపులా నుండి కమ్యునికేషన్ కు అవకాశము కలుగజేస్తుంది. ఈయన 2004 లోఒకసారి 2017 లో మరోసారి హార్వర్డ్  నుండి డ్రాప్ ఔట్ 2017లోనే  హార్వర్డ్ కి వెళ్లి డిగ్రీ పూర్తి చేసాడు. 2009 లో జుకర్ బర్గ్ టై ధరించటం గురించి సవాలుని స్వీకరించి ఆ సంవత్సరము మొత్తము టై ని ధరింఛాడు. తన కాలేజీ అప్లికేషన్ ఫామ్ లో తాను ఫ్రెంచ్,,హీబ్రు లాటిన్, మరియు పురాతన గ్రీక్ భాషలు మాట్లాడగలనని   వ్రాయగలనని వ్రాసాడు. కాలేజీలో చదివేటప్పుడు కాలేజీ ఫెన్సింగ్ అట జట్టుకు నాయకత్వము వహించాడు.      , .
2007 నాటికే అంటే జుకర్ బర్గ్ వయస్సు 23 ఏళ్ళు గా ఉన్నప్పుడు అయన సెల్ఫ్ మేడ్ బిలియనీర్ గా ఎదిగాడు 2010 నుండి టైం మేగజైన్ జుకర్ బర్గ్ ను ప్రపంచములోని 100 ధనవంతులు అతి ప్రతిభావంతుల జాబితాలో పేర్కొంటూనే ఉంది.   డిశంబర్ 2016 లోని ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో పడవ వాడుగా పేర్కొన్నారు. .ఆగస్టు 8, 2020 నాటికి జుకర్ బర్గ్ సంపద 98. 6 బిలియన్లు ఫోర్బ్స్  ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానము ఆక్రమించాడు. 2019 నాటికి 50 సంవత్సరాల వయస్సు లోపు ధనవంతుల జాబితాలో ఇతను ఒక్కడే. 40 సంవత్సరాల లోపు ఉన్న 20 బిలియనీర్ల లిస్ట్ లో టాప్ ఈయనే   .
ఈయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము.ఫేస్ బుక్ లో ఈయన కుక్క పేజీకి 2. 6 మిల్లియన్ లైకులు ఉన్నాయి.
ఈయన వేసుకునే ఐకానిక్  బూడిద రంగు టి షర్ట్ ఖరీదు మూడు నుండి నాలుగు వందల డాలర్లు ఉంటుంది. ఈయన ట్విటర్ లో యాక్టివ్ కాదు 2009 నుండి 19 సార్లు మాత్రమే ట్వీట్ చెశాడు పెద్ద ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే జుకర్ బర్గ్ కు కలర్ బ్లైండ్ నెస్ ఉంది నీలము రంగు మాత్రమే బాగా చూడగలుగుతాడు అందుచేతనే ఫేస్ బుక్ లోగో కలర్ బ్లు లో ఉంటుంది.మీరు @ అని ఫేస్ బుక్ కామెంట్ బాక్స్ లో టైప్ చేసి ఎంటర్ నోక్కితే  జుకర్ బర్గ్ పేరు వస్తుంది.జుకర్ బర్గ్ అయన భార్యను అయన భవంతిలో గల బ్యాక్ యార్డ్(పెరట్లో) పెళ్లిచేసుకున్నాడు.ఈయన అవయవ దాననికి తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు(పురుషులకు) నాలుగు నెలల పూర్తి జీతము తో కూడిన పెటర్నిటీ ( భార్య ప్రసవించినప్పుడు) సెలవు ఇస్తారు విశేషము ఏమిటి అంటే జుకర్ బర్గ్ కూడా తన భార్య రెండవ శిశువును ప్రసవించినప్పుడు ఈ సెలవును వాడుకున్నాడు,వారములో కనీసము మూడు సార్లు అయినా పని నుండి విశ్రాంతి తీసుకుంటాడు. జుకర్ బర్గ్ మొదట్లో అక్యురా TSX కారును వాడేవాడు ప్రస్తుతము వోల్క్స్ వాగన్ GTI కారును వాడుతున్నాడు. జుకర్ బర్గ్ తానూ నాస్తికుడు అని చెప్పుకుంటాడు.కానీ 2016లో ఒక సందర్భములో మాట్లాడుతు ,"నేను జ్యుఇష్ సాంప్రదాయములో పెరిగాను అప్పుడు ప్రతి దానిని ప్రశ్నించే తత్వము అలవాటు చేసుకున్నాను కానీ ప్రస్తుతము మతము అవసరమని నమ్ముతున్నాను "అంటాడు
జుకర్ బర్గ్ అనేక వివాదాల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది వాటిలో కొన్ని ముఖ్యమైనవి. హార్వర్డ్ విద్యార్థులు కెమెరాన్ వింకల్ వాష్ ,టేలర్ వింక్ల్ వాష్ మరియు దివ్య నరేంద్ర అనే వాళ్ళు 2004లో ఒక లా సూట్ జుకర్ బర్గ్ మీద వేశారు వీరు జుకర్ బర్గ్ ఒక సోషియల్ నెట్ వర్క్ ప్రారంభించటానికి సహాయము చేస్తానని నమ్మించాడు వీరు మొదలుపెడదామనుకొన్న సోషియల్ నెట్ వర్క్ పేరు హార్వర్డ్ కనెక్షన్,కామ్ (ఆ తరువాత కనెక్ట్ యు అనే పేరు మార్చారు.వీరు వేసిన లా సూట్ సాంకేతితముగా 2007లో కొట్టివేశారు. అందుచేత మళ్ళ బోస్టన్ ఫెడరల్ కోర్ట్ లో రిఫైల్ చేశారు 2008 లో ఈ కేసును 1. 2 మిల్లియన్ కామన్ షేర్స్ వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి 20 మిలియన్ల డాలర్లు సొమ్ము ఇచ్చి ఫిష్ బుక్ సెస్ ను పరిష్కరించుకుంది.అలాగే ఎడ్యురో సావేరిన  అనే వ్యక్తి  ఫేస్ బుక్ మరియు జుకర్ బర్గ్ పై దావా వేసి కోర్ట్ బయటే సెటిల్ చేసుకున్నాడు ఈ సెటిల్ మెంట్ టర్మ్స్ రహస్యము అయినప్పటికీ ఫేస్ బుక్ కంపెనీ సావేరిన పేరు ఫేస్ బుక్ కో ఫౌండర్ గా అంగీకరించింది సావేరిన కూడా వెల్లడించకూడని కాట్రాక్ట్ ను ఈ సెటిల్  మెంట్ లో సంతకము చేసాడు.
2010 జూన్ లో పాకిస్తానీ డిప్యూటీ అటార్నీ జనరల్ ముహమ్మద్ అజహర్ సిద్ధికి జుకర్ బర్గ్ మీద ఫేస్ బుక్ కో ఫౌండర్స్  మీద ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడుఫేస్ బుక్ లో డ్రా ముహమ్మద్ పోటీ నిర్వహించారు ఈ పరిశోధనలో ఒక జర్మన్ లేడి ఈ కాంటెస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సిద్ధికి ఈ విషయములో ఆ దేశపు పోలీసులను ఇంటర్ పోల్ వారిని కాంటాక్ట్ చేసి జుకర్ బర్గ్ మరియుఇతరులను దైవ దూషణ మరియు దైవ నిండా నేరాలపైనా అరెస్ట్ చేయమని కోరాడు.అందువల్లే 2010లో పాకిస్తాన్ లో ఫేస్ బుక్ వెబ్ సైట్ తాత్కాలికంగా నిలిపివేయబడింది.మళ్ళా ఫేస్ బుక్ ఈ కాంటెస్ట్ తన వెబ్ సైట్ నుండి తొలగించేవరకు ఈ నిషేదం పాకిస్తాన్ లో కొనసాగింది.సిద్ధికి ఈ సమస్యను ఐక్య రాజ్య సమితిలో కూడా తీసుకురావాలని ఐక్య రాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రతినిధిని కోరాడు.
జూన్ 2010 లో న్యూ యార్క్ దగ్గరలో ఉన్న ఒక వుడ్ పెల్లెట్ ఫ్యూయల్ కంపెనీ యజమాని పాల్ సెలిగ్లియా తానూ ఫేస్ బుక్ లో 84 శాతము ఓనర్ ని అని జుకర్ బర్గ్ మీద దావా వేసాడు 2003 ఏప్రిల్లో తానూ జుకర్ బర్గ్ కాంట్రాక్ట్ సైన్ చేసినట్లు అయన వాదన దాని కింద వెయ్యి డాలర్లు ఇన్షియల్ ఫీడ్జ్ గాచెల్లించినట్లు చెపుతాడు. కానీ ఫేస్ బుక్ మేనేజ్ మెంట్ ఈ సూట్ ను తిరస్కరించింది. అప్పుడు సెలిగ్లియో తరుఫున వాదిస్తున్న కౌన్సిల్ కోర్ట్ బయట సెటిల్ మెంట్ కు ప్రయత్నించి విఫలమయింది.2012 లో ఫెడరల్ అధికారులు సెలిగ్లియోను దొంగ డాక్యూమెంట్లు సృష్టించి నందుకు అరెస్ట్ చేశారు దీనితో ఇతర లా ఫార్మ్స్ ఈ కేస్ నుంచి తప్పుకున్నారు.జులై 2016లో ఇజ్రాయిల్ మంత్రి గిలాడ్ ఏరడాన్ ఇజ్రాయేలు దేశస్తుల మీద పాలస్తీనా వాసులు చేసిన దాడికి జుకర్ బర్గ్ భాద్యుడని ఆరోపించాడు జనవరి 2017లో జుకర్ బర్గ్ 8 లా సూట్లను కొన్ని వందల హవానియన్స్ మీద ఫైల్ చేసాడు ఎందుకంటే కొంత భూమిని తన సొంత చేసుకోవటానికి(కొని) 2014లో జుకర్ బర్గ్ కొన్న 700 ఎకరాల ఈ భూమి హవాయి దీవులలో ఉంది  హవాయి దీవులలో భూమి యాజమాన్యపు చట్టము మిగిలిన 49 అమెరికన్ రాష్ట్రాల చట్టాలకు భిన్నముగాఉంటుందని తెలుసుకొని తన లా సూట్స్ ను వెనక్కు తీసుకున్నాడు.
2010లో జుకర్ బర్గ్ భారీ విరాళాన్ని డయాస్పోరా అనే పెర్సనల్ వెబ్ సర్వర్ కు దానము చేసాడు దీనిని కూల్ ఐడియగా జుకర్ బర్గ్ పేర్కొన్నాడు.
అలాగే సెప్టెంబర్ 2010లో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే స్టార్ట్ అప్ సంస్థను స్థాపించాడు. జుకర్ బర్గ్ 100 మిల్లియన్ డాలర్లను న్యూయార్క్ పబ్లిక్ స్కూళ్లకు విరాళము ఇచ్చాడు. ఈ విరాళము తన సోషియల్ నెట్ వర్క్ విడుదల సమయములో అవటం వలన కొంత విమర్శలను అంటే తన బిజినెస్ కోసము ఈ విరాళాలు అన్న విమర్శను ఎదుర్కొన్నాడు ఈ విమర్శలను తన డైన పద్దతిలో ఎదుర్కొన్నాడు.ఒక జర్నలిస్ట్ కధనం ప్రకారము ఈ సొమ్ము చాలా మటుకు సక్రమముగా ఖర్చు అవలేదు.డిశంబర్ 2010లో జుకర్ బర్గ్ బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఈ ముగ్గురు వ్యాపార దిగ్గజాలు ధ గివింగ్ ప్లెడ్జ్ అనే డాక్యుమెంట్ సంతకము చేశారు ఈ డాక్యుమెంట్ ప్రకారము వారి సంపాదనలో సగము దాన ధర్మాలకు ఖర్చు పెడతామని ఇతర ధనవంతులుకూడా ఈ కార్యక్రమములో భాగస్తులు కమ్మని అప్పీలు చేశారు డిశంబర్ 2013లో జుకర్ బర్గ్ 18 మిలియన్ల ఫేస్ బుక్ షేర్లను సిలికాన్ వేలి కంమ్యూనిటీ ఫౌండేషనుకు విరాళముగాఇచ్చాడు వీటి విలువ 990 మిల్లియన్ డాలర్లు. అవిరాళము అప్పటి విరాళ్లలో టాప్ అమెరికన్ పత్రికలూ జుకర్ బర్గ్ ను అతని భార్యను చాలా గొప్ప దాతలుగా ప్రశింసించింది. వీరు ఎక్కువ ఆరోగ్యము విద్య రంగాలకు విరాళాలు ఇచ్చేవారు ఎబోలా వైరస్ ను ఎదుర్కోవటానికి అలాగే ప్రస్తుతము ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిద్ 19 ఎదుర్కోవటానికి 25 మిల్లియన్ డాలర్లు ను బిల్ గేట్స్ ఫౌండేషన్  కు విరాళముగా ఇచ్చాడు అలాగే ఈ వ్యాధి కారణముగా నష్టపోయిన స్థానిక జర్నలిస్ట్ కుటుంబాలకు మరో 25 మిల్లియన్ డాలర్లను విరాళముగా ఇచ్చాడు. ఈ విధముగా తన సంపాదనలో చాలా మటుకు దాన ధర్మాలకు ఖర్చు పెట్టె మనస్తత్వం కలిగిన వాడు ఫేస్ బుక్ స్థాపకుడు జుకర్ బర్గ్
అంబడిపూడి శ్యామసుందర రావు