వెన్నెలకంటి - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

వెన్నెలకంటి

సినీ పాటల రేడు వెన్నెలకంటి. వీరి పూర్తిపేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.1957/నవంబర్ /30 వతేదిన నెల్లూరులో జన్మించారు.అక్కడే డిగ్రీ చేసి,చంద్రగిరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసారు. 1975 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వీరు రాసిన తొమ్మిది కవితలు ఎంపిక అయ్యాయి.జంద్యాల గారు రాసిన'ఏక్ దిన్ కాసుల్తానా''ఈచరిత్ర ఏసిరాతోరాసినా''ఎవ్వనిచే జనించు' 'దర్పణం వంటి నాటకాలలో నటించారు.1986 లో నటుడు నిర్మాత అయిన ప్రభాకరరెడ్డి గారు 'శ్రీరామచంద్రుడు'అనే చిత్రంలో'చిన్ని కన్నయ్యకు వెన్నెల జోలపాట'అనేది మొదటి పాట రాసే అవకాశం కలిగించారు.అనంతరం గాయకుడు బాలుగారి ప్రోత్సాహంతో 'అన్నాచెల్లెలు'(1987) చిత్రంలో 'అందాలు అవురావురన్నాయి'అనేగీతం రాసి సినిమా రచయితగా స్ధిరపడ్డారు. 'ప్రేమాగ్ని' అనేసినిమాకు మాటలు రాసారు.'నాయకుడు' (1988)చిత్రం ద్వారా అనువాద రచయితగా పరిచయమై, జురాసిక్ పార్కువంటి పలు ఆంగ్ల చిత్రాలు తెలుగులోకి అనువాదించారు.అనువాదమే కాకుండా,నేరుగా వచ్చిన పలు చిత్రాలకు వేయికి పైగా పాటలు రాసారు.బాల్యంలోనే తన పదకొండో ఏట'భక్త దుఃఖనాశ పార్వతీశ' మకుటంతో శతకంరాశారు.అలా 'రామచంద్ర' 'లలిత' శతకాలుకూడారాసారు.సినిమాల్లో బాపు గారి 'రామరాజ్యం(2010) లో మొదటి పద్యం సినిమాల్లోరాసారు.'ఉషోదయం ఆపలేవు' 'వెన్నెలజల్లు' కవితా సంకలనాలు.'లహరి' కావ్యం వీరి ముద్రిత రచనలు.వీరి రాసిన 'ఆత్మావత్ సర్వ భూతాని' 'యత్ర నార్యస్తు పూజ్యన్తే'నాటికలు అనేక పరిషత్ పోటీలలో పలు బహుమతులు పొందాయి.దాదాపు మెత్తం 1800 పైగా రచనలుచేసారు.వీరికుమారులు శశాంక్ డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగా,మరోకుమారుడు రాకేందుమౌళి సినీ గీతరచయితగా ఎదుగుతున్నారు. తన సరళ సినీ సాహిత్యంలో శాశ్విత స్ధానం పొందిన వీరు 2021/జనవరి /5 వతేదిన కళామాతల్లి పాదసేవకై తరలివెళ్ళారు.

మరిన్ని వ్యాసాలు

Cine srungaram
సినీ శృంగారం
- మద్దూరి నరసింహమూర్తి
Heaven On Earth - Kashmir
భూలోక స్వర్గం కాశ్మీర్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
రెండవ ప్రపంచ యుద్ధం-రహస్యాలు/విశేషాలు 6
రెండవ ప్రపంచ యుద్ధం - 6
- శ్యామకుమార్ చాగల్
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే పాత ప్రేమికులను వదులుకోవాల
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే...
- సదాశివుని లక్ష్మణరావు
ప్రభల సంస్కృతి .
ప్రభల సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బుడబుక్కలవారు.
బుడబుక్కలవారు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పూరి జగన్నాధ రథ యాత్ర .
పూరి జగన్నాధ రథ యాత్ర .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
వీధి నాటకం .
వీధి నాటకం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.