మహిళా ఉద్యమం-సవాళ్ళు - పిళ్లా కుమార స్వామి

మహిళా ఉద్యమం-సవాళ్ళు

పురుషాధిక్య సమాజంలో స్ర్తీలు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో తెలిపే సిలబస్‌ను గూడ పురుషులే రూపొందించారు.ఆదిమ సమాజం లో ఉన్న మాతృ స్వామిక పద్దతిని ఒక ప్రణాళిక ప్రకారం పురుషాధిక్య సమాజంగా మార్చారు.దీని కోసం రామాయణం, మహాభారతం లాంటి కావ్యాలను రచించారు. స్ర్తీలను ప్రాణ పరిమళంతో అణువణువు స్పందించే మనుషులుగా గాక ఒక బానిసగానో, ఒక ఆటబొమ్మగానో, ఒక విలాసవస్తువుగానో చూసే సంఘం గుండెల్లో ప్రశ్నల బాణాలు సంధించారు నేటి తరం మహిళలు. ‘ఎన్నాళ్ళు ఈ పూర్వకాలపు పాఠాలు/ మనసును గుర్తించలేని పాతకాలపు భావాలు’ అని మ మణ్డణణణ్డణణ్డ.సమాజంలో ఎన్నో ఏళ్లుగా పురుషులు స్త్రీలపై చేస్తున్న పెత్తనాన్ని అధికారాన్ని సమూలంగా తుడిచి పెట్టే లక్ష్యంగా స్త్రీవాద ఉద్యమం వచ్చింది.దీనికి ప్రధాన కారణం చాలామంది మహిళలు విద్యా వంతులు కావడమే. దీని వెనుక కొన్ని వందల ఏళ్ళ సంస్కరణవాదుల పోరాటం ఉంది.ఎక్కడో అక్కడక్కడా కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు సాహిత్య ప్రపంచమంతా పురుషాధీనమే. ఉపనిషత్తుల కాలంలోవిద్యావంతులుగా ఉన్న గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా, మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం. ఆడవాళ్ళకు చదువెందుకు, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా 19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలైనవారు స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. చదువుల చందమామ నుదయింపజేశారు. "స్త్రీకి కూడా శరీరం ఉంది .దానికి వ్యాయామం ఇవ్వాలి .ఆమెకు మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి .ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి " అంటూ చలం సంప్రదాయాల చేతిలో కీలుబొమ్మల్లా బతుకుతున్న స్ర్తీలలో చైతన్యం కలిగించేలా రచనలు చేసి స్త్రీ వాద ఉద్యమాన్ని 1960 లలోనే ప్రారంభించారు ఆంధ్రదేశంలో. వీటన్నిటి నేపథ్యంలో సంపన్న మహిళలతో ఈ ఉద్యమం ప్రారంభమైంది.ఇది సమాజం పైమంచి ప్రభావాన్ని చూపింది. మహిళలే రాసిన నీలీమేఘాలు,గురిచూసి పాడేపాట,నల్లపొద్దు మొదలై న సాహిత్యం గిడస బారిన సమాజాన్ని ఒక్క కుదుపు కుదిపింది.దాంతో సమాజంలో మార్పులు మొదలయ్యాయి. వివాహం చేసుకోవడంలో , నిశ్చయించడంలో ఆమె ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత పెరిగింది.వివాహ సంబంధాన్ని తెంచుకోవడం లో ఆమెకు హక్కు,స్వతంత్రత ఏర్పడింది. ఇప్పుడు సమాజంలో స్త్రీ పురుషులు విడాకులు చాలా సులభంగా తీసుకొంటున్నారు.ఇటీవల ముస్లిం స్త్రీలకు తలాక్ పద్దతి తొలగించి విడాకులు తీసుకునే చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. పిల్లలపై స్త్రీ పురుషులకు సమాన హక్కులు, ఉమ్మడి లైంగిక నియమావళి, తన ఆదాయాన్ని సంపాదనను వినియోగించుకునే హక్కు కావాలని స్త్రీ వాదులు కోరారు.పురుషులతో పాటు సమాన హక్కులు ఉండాలని కోరారు. స్త్రీ లకు పురుషులతో పాటు సమానంగా ఆస్తి హక్కు చట్టం చేయడంతో ఆదాయాన్ని వినియోగించుకొనే హక్కు సహజమై పోయింది. అన్నింటికీ సర్దుకుపోవాలని మహిళలకు చెప్పేవారు. "ఈ నాలుగక్షరాలే/ స్ర్తీని అగ్నికాహుతి చేసే సాధనాలు’ అని ఈ సర్దుకు పోవడం స్ర్తీలకే ఎందుకు పరిమితం కావాలని ప్రశ్నించారు. ‘నీటిలోనే జీవిస్తుంది చేప/ కాసేపు నేలపైన ఉండమంటే/ నశిస్తుంది మరుక్షణమే/ నింగిలో విహరించే పక్షిని/ కాసేపు సర్దుకో నేలపైనే ఎగురు’ అంటే ఎంత అసహజమో ఈ సర్దుకు పోవడం కూడా అంతకష్టమైనదే అన్నది నిష్టుర సత్యం.ఇలాంటి సంఘటనలు మధ్యతరగతి లో వస్తుంటాయి. దళితులకు ఈ సమస్య రాదు.వారు సర్దుకు పోకుండా భర్తను ఎదిరించి స్వతంత్రంగా జీవించే నేర్పును కలిగి వుంటారు.సామాజిక జీవితంలోని అన్ని రంగాలలో కార్యకలాపాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన హక్కు, ప్రభుత్వ యంత్రాంగంలో దాని అంగాల్లో సంపూర్ణమైన రాజకీయ సమానత్వం మహిళాలోకం కోరడంమొదలైంది. అంబేద్కర్ మహాశయుడు ఎంతో ముందుచూపుతో మహిళలందరికీ సమాన హక్కులు రాజ్యాంగం లో పొందు పరిచారు.ఆచరణలో అమలుకోసం వీరి నుంచి వచ్చిన బలమైన సాహిత్యం ఒక ఉద్యమం గా మారింది. ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు ఆస్తి హక్కులో మహిళలకు సమాన వాటా చట్టంచేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది .ఆ తర్వా త దాన్ని చట్టం చేశారు.ఇది మహిళల హక్కుల కు సంబంధించి ఒక ముందడుగు.ఈ ఉద్యమం ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన స్త్రీలకు మాత్రమే ఉపయోగపడినా మధ్యతరగతి ప్రజల్లో కొంత అవగాహనకలిగించింది.మెల్లగా అది అందరి మహిళల గురించి ఆలోచించే విధంగా అందరిలోకి వెళ్లింది. అయితే అత్యధిక స్త్రీలు ఎదుర్కొంటున్న దోపిడీ, అసమానత, వేతన అసమానత్వం, కుల వివక్ష మొదలైన సమస్యలకు ఈ ఉద్యమం పరిష్కారం కనుగొనలేక పోవటమేగాక వీటిని గుర్తించలేక పోయింది. ఇవన్నీ సాంఘికవిప్లవం ద్వారా సాధ్యమవుతాయనే విషయాన్ని స్త్రీవాద ఉద్యమం గుర్తించకపోగా, ఇలాంటి పోరాటాలకు వ్యతిరేక శక్తి గాఉండిపోయింది. సామాన్య ప్రజానీకంలో ఉన్న మహిళల విముక్తికి అది దోహదపడలేదు. చిన్నపిల్లల పట్ల ప్రమతోనూ, మృదువుగా ఉండటంలో,మహిళలను ,దళితుల ను సమాదరించటంలో చట్టాలెన్ని వున్నా పాతకాలపు ఛాందస భావాలే ఇప్పటికీ సమాజంలో రాజ్యమేలు తున్నాయి.ఇవన్నీ ఆధునిక భావనలు.బుద్దుడు తన సంఘాలలో 2500 క్రితమే అమలు చేశారు.కానీ దాన్ని పారదోలిన నాల్గుపడగల హైందవం ఆధునికం కాలేకపోయింది.ఆ వుచ్చులో వున్న మన భారతీయ సమాజం ఆధునికం కానందువలన స్త్రీ వాద ఉద్యమం ఒక ఊపుతో వచ్చి మెల్లగా అది ఒక ధోరణిగా నిలబడిపోయింది. స్త్రీ వాదులు చెప్పినట్లు స్త్రీ ని పురుషుడు దోపిడీ చేయడం లేదు. పైగా స్త్రీ పురుషులిద్దరూ ఈ కార్పొరేట్ వ్యవస్థలో దోపిడీ చేయబడుతున్నారు. ఇద్దరూ కలిసి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. స్త్రీ సమస్యల పోరాటంలో పురుషునికి సహకారం అవసరం ఎంతో ఉంది. పురుషులతో స్త్రీలు శత్రు వైరుధ్యం పెంచుకోవడం మాని కలిసి పోరాడాల్సి వుంది. ___ పిళ్లా కుమారస్వామి 9490122229