కపాలేశ్వరఆలయం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కపాలేశ్వరఆలయం

దివ్యక్షేత్రం-కపాలేశ్వరఆలయం- (శివరాత్రికి ప్రత్యేకం) దక్షణభారతదేశంలో ఎన్నో మహిమాన్విత దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాపేరెన్నికగలదేవాలయాలలో చెన్నయ్ నగరంలోని కపాలేశ్వర ఆలయంఒకటి.పలుపురాణాలలో ఈఆలయప్రస్తావనకనిపిస్తుంది. క్రీస్తుశకం 325లో ఈక్షేత్రంనిర్మింపబడింది.అనంతరం 1250 లోనూ తిరిగి16వ శతాబ్దంలోను పునర్ నిర్మించబడింది.అప్పుడే విజయనగరం రాజులు మరో ఆరు దేవాలయాలు నిర్మించారు. ఈఆలయశిఖరగోపురం37 అడుగులఎత్తులో ఎంతో సుందరంగా ఉంటుంది.పూర్వం ఈఆలయంలో నెమళ్లు ఎక్కువగా కనిపించేవి.వీటి ఆటపాటలను తమిళభాషలో "మైలాపు"అంటారు అందుకే ఈప్రాంతాన్ని "మైలాపూర్" గానేటికి పిలబడుతుంది. 1566లో పోర్చుగ్రీసువారు మైలాపూరును స్వాధీనపరుచుకున్నప్పుడు, ఈగుడిభాగంకొంతదెబ్బతింది.లింగాకారంలో స్వామి పడమటి దిక్కును చూస్తున్నట్లు,ఈగుడినిర్మింపబడింది.గుడిముందుభాగాన పెద్ద పుష్కరిణి, దానిమధ్యభాగంలో "మై"మండపం అందంగా నిర్మింపబడి "కపిలతీర్దంగా" పేరుపోందింది.స్వామిచేరువలో కరుణాముఖి "అంబిక"పేరున పార్వతిదేవి వెలసిఉంది.ఈమెద్రుష్టి యమస్ధానం వైపు సారించి ఉన్నందున పార్వతిని"కర్పకమ్మళ్"అనిపిలుస్తారు. ఒకరోజు శివుడు కైలాసంలో పార్వతిదేవికి "పంచాక్షరి"-"విభూధి"మహిమవివరిస్తున్నప్పుడు పార్వతిదేవి మయూరాల నృత్యం చూస్తు శివుని మాటలపై ఏకాగ్రత నిలపలేక పోయింది. కోపించిన శివుడు 'మయూరమైఫో'అనిశపించాడు.తనతప్పుతెలుసుకున్న పార్వతిదేవి ముక్కంటిని వేడుకోగా,'నేను భూలోకంలో కపాలీశ్వరుడిగా వెలుస్తాను. నన్ను బిల్వపత్రలతో పూజించిన అనంతరం నీకు శాపవిమోచన'అన్నాడు. అలాచేసిన పార్వతి అక్కడ"ఉమయమ్మళ్"గా భక్తులకుదర్శనం ఇస్తుంది. ఇంకా ఈఆలయంలో కడవుల్ తీర్దం-వేదతీర్ధం-వాలితీర్ధం-గంగైతీర్ధం-వెళ్లితీర్ధం-రామతీర్ధం అనేపుణ్యతీర్ధాలుఉన్నాయి. 63 నయనార్లను ఇక్కడదర్శించుకోవచ్చు.నాట్యగణపతి,శృంగారువేల్ పేరున కుమారస్వామి కొలువై ఉన్నారు. సృష్టికర్తబ్రహ్మ ఇక్కడ పూజలు నిర్వహించాడని,సీతాన్వేషణసమయంలో శ్రీరాముడు స్వామిని సేవించాడని,రాక్షసులగురువైన శుక్రాచార్యుడు ఇక్కడతపమాచరించి స్వామిని ప్రసన్నంచేసుకుని,నవగ్రహాలలో ఒకగ్రహానికి తనపేరు,వారంరోజులలో ఒకరోజుకి తనపేరుఉండేలా వరంపొందాడని స్ధలపురాణం ద్వారా తెలుస్తుంది. తొలుత ఈప్రాంతాన్ని "శుక్రపురి"గాప్రసిధ్ధిచెందింది. ఎంతోమహిమాన్విత ఈఆలయం తప్పక దర్శనీయం.

మరిన్ని వ్యాసాలు

మోక్షప్రదాయని చిదంబరం.
మోక్షప్రదాయని చిదంబరం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
చదువులతల్లి...
చదువులతల్లి...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
దక్షణాది నటి జయంతి.
దక్షణాది నటి జయంతి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Prakrithi-purushudu-aatma
ప్రకృతి - పురుషుడు - ఆత్మ
- కందుల నాగేశ్వరరావు