దక్షణాది సిని ముఖచిత్రం ఏ.వి.యం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

దక్షణాది సిని ముఖచిత్రం ఏ.వి.యం.

దక్షణాది సిని చరిత్రకు సాక్ష్యం ఏ.వి.యం. ఆశయం,పట్టుదల,కృషి ఉంటే ఎంతటి కష్టతరమైన లక్ష్యానైనా చేరుకోవచ్చునని ఎందరో మహనీయులు ఎన్నోరంగాలలో నిరూపించారు. ఇదేబాటలో తమిళనాడు రామనాధంపురం జిల్లాలోని కారెైక్కుడి ప్రాంతానికి చెందిన ఏ.వి.మొయ్యప్పన్ మొదట్లో డిపార్ట్ మెంట్ స్టోరు నడిపేవారు. ఆయనకు గ్రామ్ ఫోన్ రికార్డులపై ఆసక్తి ఏర్పడటంతో జర్మనీకి చెందిన ఓడియన్ రికార్డింగ్ కంపెనీ తో ఓప్పందం చేసుకుని మద్రాస్ మౌంట్ రోడ్డులో "సరస్వతిస్టోర్స్ "ప్రారంభించి ఇందులో78 ఆర్ .పి.యం గ్రామ్ ఫోన్ రికార్డులు అమ్మతూ దక్షణభారతదేశానికి డీలర్ గాఉన్నారు. అలాసినిమా పరిశ్రమపై వగాహన ఏర్పడటంతో 1934 లో సరస్వతి సౌండ్ ప్రోడక్షన్స్ "అనేసంస్ధను కొందరుమిత్రులతో కలసి స్ధాపించి "అల్లిఅర్జున" అనేచిత్రంనిర్మంచారు. ఆచిత్రంలో నాటకరంగంవారినే నటింపచేసారు.ఆసినిమా 80 వేలు నష్టంచవిచూపింది.మిత్రులు విడిపోయారు.అనంతరం"సరస్వతిటాకీస్ ప్రోడ్యూసింగ్ కంపెని"స్ధాపించి"రత్నావళి"అనేచిత్రాన్ని లక్షరూపాయలతో నిర్మించారు, బోమ్మకనిపించిన కొద్దిసేపటికి మాటవినిపించడంతో ఆచిత్రంపరాజయంపొందింది. మొయ్యప్పన్ పట్టువదలని విక్రమార్కునిలా ఏ.సుబ్బయ్య.జయంతిలాల్ ఠగూర్ తో కలసి ప్రగతిపిక్చెర్స్ అనేసంస్ధ పేరున"నందకుమార్ "అనే తమిళచిత్రాన్ని నిర్మిస్తూ అందులో తొలి సారిగా నేపధ్యగానంప్రవేశపెడుతూ బొంబాయికి చెందిన "లలితవెంకట్రామ"న్అనేవిద్వాంసురాలితో పాటలు పాడించి కథానాయకిపైచిత్రీకరించారు.హిందీ-మరాఠీ-తమిళంభాషలలో నిర్మించిన ఆచిత్రం నిరాశనే మిగిల్చింది.అప్పుడు మొయ్యప్ప మద్రాసులో సినిమా స్టూడియో నిర్మించాలిఅనుకున్నారు ,అప్పుడు రెండోప్రపంచ యుధ్ధంజరుగుతున్న సమయం కావడంతో పలు సమస్యలు ఎదురైనాయి. తమస్వస్ధలమైన కారెైక్కుడి లోనే 1945లో ఏ.వి.యం స్తూడియో ప్రారంభించి "నామ్ ఇరువర్ "అనేతమిళసినిమానిర్మించి అందులో ప్రముఖ తమిళకవి సుబ్రమణ్యభారతీయార్ "గారిచేపాటలు పాడించి విజయం సాధించారు. 1948లో మద్రాసు వడపళని ప్రాంతానికి తనస్టూడియోని తరలించారు. తమిళనాట పేరుపోందిన "పరాశక్తి"నాటకం హక్కులు 1951 లో కొనుగోలుచేసి,"నేషనల్ పిక్చెర్స్ "అనేసంస్ధతోకలసి పరాశక్తి పేరున శివాజిగణేషన్ న్ని పరిచయం చేస్తూ కధానాయకి పండరీబాయి తో నిర్మంచి న 1952 అక్టోబర్10 విడుదలైనఈచిత్రం విజయంసాధించింది. దక్షణాదిన ప్రదర్శింపబడుతున్న నాటకం"భూకైలాస్ "నుచిత్రంగా తీసివిడుదల చేస్తే రజితోత్సవం జరుపుకుంది.అనంతరం కన్నడ హరిశ్చంద్ర చిత్రాన్ని తమిళంలో అనువాదించి విజయంసాధించారు. 1948లో నిర్మంచినతమీళచిత్రం"వాళకై" చిత్రం ద్వారా నటి వైజయంతి మాలను పరి చయం చేసారు.ఈచిత్రం తెలుగులో "జీవితం" పేరునవిడుదల జరిగింది. కన్నడంలో వీరు నిర్మించిన"బేదారు కన్నప్ప"చిత్రంద్వారా నటుడు రాజ్ కుమార్ ని పరిచయంచేసారు."కళ్ళత్తూరుకన్నమ్మ"అనేతమిళ చిత్రంలో ఆరేళ్ళవయసుఉన్న కమల్ హసన్ని పరిచ యంచేసారు."ఓరు ఇరవు "చిత్రానికి అన్నాదురైని -పరాశక్తి చిత్రానికి కరుణానిధిని -"సంఘం "చిత్రంలో నందమూరివారినితమిళనాట పరిచయంచేసారు."-అన్బేవా"చిత్రానికి యం.జి.ఆర్ .ని-నటి జయలలితనుకూడా ఈసంస్ధ చిత్రాలలో పనిచేసారు.అలా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలసి పనిచేసిన ఘనత వీరికే దక్కుతుంది. పాటలులేని తమిళ సినిమా "అందనాళ్ "కి కేద్రప్రభుత్వంతొలిసారిగా "సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ "లభించింది.1957లో నిర్మించిన హిఃదీ బాలల చిత్రం"హంపంచిఏక్ డాల్ కే" బంగారు పతకం పొందింది. అలాగే బలరాజ్ సహని-పండరీబాయి నటించిన హిందీ చిత్రం"బాభి"సర్ణోత్సవం జరుపుకుంది."వదిన" "సదారమ" "కాళహస్తిమహత్యం" "బేతాళలోకం" "సర్వర్ సుందరం,1966."రాము" "లేతమనసులు" "అవేకళ్ళు" పుట్టినిల్లు మెట్టినిల్లు" "నోము" "పూజ" భక్తప్రహ్లద" "మూగనోము" "చిట్టిచెల్లెలు" "పున్నమినాగు" "శిక్ష" " మెరుపుకలలు" "సంసారంఓచదరంగం" "శివాజి"వంటి 180 కిపైగా చిత్రాలునిర్మించగా(పలుభాషలలో) వీటిలో 50 చిత్రాలకుపైగా రజతోత్సవంచేసుకున్నాయి. బుల్లితెరపైకూడా ఎన్నో మెగా ధారావాహికలు ఈసంస్ఢ చేపట్టింది.రాష్ట్రపతి చేతులు మీదుగా పలు రజిత-స్వర్ణపతకాలు అందుకున్న మొయ్యప్పన్ చెట్టియార్ 1979ఆగస్టు12 న మృతి చెందారు.వీరి కళాసేవలుగుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీరిస్టాంపు బిళ్ళ విడుదలచేసింది. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం సౌత్ యిండియా ఫిలింఛాంబర్ లోవీరి శిలావిగ్రహం ఏర్పాటుచేసింది.దక్షణాదినతొలిసారిగా "డబ్బింగ్ " "నేపథ్యగానం" పోస్టుసింక్రనైజేషన్ " "యానిమేషన్ "వంటిపలుపక్రియలకు నాందిపలికిన ఈసంస్ధలో డైలాగ్ డైరెక్టర్ గా రంగూన్ రామారావు-జావర్ సీతారామన్ -దర్శకులు యం.వి.రామస్వామి-కృష్ణన్ -పంజు రచయిత తొలేటి వెంకటరెడ్డి వంటివారు ఎందరో పనిచేసారు. అన్నిహంగులు కలిగి ఆసియా ప్రముఖ స్టూడియోలలో ఒకటిగా మంచి గుర్తింపుపొందింది. డా. బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .