నిజమైన అబధ్ధం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

నిజమైన అబధ్ధం.

నిజమైన అబధ్ధం.(సినిమా పాటలపై వ్యాసం).
సంస్కృతంలో కలా శభ్ధం తద్బావ రూపం కళ.కలయతి ఇతి కలా అని వ్యుత్పత్తి.వృధ్ధి చెందుతుంది కనుక అది కళ.అంటే చంద్రునిలో పదహారవ భాగమని, శిల్పమని అర్ధాలు.చంద్రకళ అందంగా ఉంటుంది.అహ్లాదాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఆగుణాలున్న చిత్రలేఖనాది క్రియలను సైతం మనం కళలుగా పేర్కొంటున్నాం.మరి కళలు అనగానే చతుష్షష్టికళలు-అనుకోవడం పరిపాటి. అయితే అది ఒకప్పటిమాట.శాస్త్ర సాంకేతిక రంగాల అభివృధ్ధి కారణంగా మన ప్రాచీన కళల స్వరూప స్వభావాలు అనూహ్యంగా మారిపోయాయి.ఎన్నో సరికొత్త కళలు పుట్టుకొస్తున్నాయి. ఇవాళ కళలు అరై నాలుగు కావు-అవి అసంఖ్యాకాలు!
ఇంతకీ ఈ చతుష్షష్ట కళలను మొదట పరిగణించివాడు వాత్స్యాయనుడు(మల్లినాగుడు). అసలు ఏదైన అభ్యసించేవేళ అది విద్య.అదే విద్య నైపుణ్యంలో ప్రదర్శించేవేళ అదికళ.
మన సినీకవులు అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల సమర్ధులు. మనకు పగలే వెన్నెలను చూపించగలరు, జాగాన్నే ఊయలలు ఊగించగలరు. ఎందరో సినిమా మహా రచయితలు మనకు మానసిక ఆనందాన్ని కలిగిస్తూ,అందరికి అర్ధమైఏలా ఎన్నో పాటలు రాసి నవ్వించారు, కవ్వించారు,కన్నీరు పెట్టించారు, అభద్ధాన్ని నిజమని మని మనచే ఒప్పించారు. వారి పాటలకు నాడు -నేడు విని ఆనందిస్తున్నాం. ఈ సాహితీ ప్రవాహం అనంతం ఇది నిరంతరం సాగుతునే ఉంటుంది.అటువంటి కవుల చతురత కలిగిన కొన్ని గీతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
మన ఇంట్లో వివాహం అంటే ఆరునెలల ముందే కల్యాణ మండపం ఏదో నిశ్చయించుకుంటాం! వంటవారిని మూడు నెలల ముందే మాట్లాడుకుంటాం. ఎన్నో పెళ్ళి పనుల వత్తిడికి లోనౌతాము.బంధు మిత్రులను అందమైన శుభలేఖతో ఆప్యాయంగా ఆహ్వానిస్తాము.
మరి ఈ కవిగారు చూడండి ఎంత గొప్ప అబధ్ధంతో మనందరికి ఆపెళ్ళికి ఎలా తెలియజేస్తున్నాడో గమనించండి!
'సన్నాజాజికి గున్నామావికి పెళ్ళికుదిరింది'(ముత్యాల పల్లకి.1970. ) అయ్యా మల్లెమాల గారు మీ పెండ్లి పిలుపు కాదంటామా తప్పక వచ్చి తిని బహుమతి ఇవ్వకుండా వెళతాం.
మరో కవి చాతుర్యం, గూడు కట్టని చిలుక-గోరింకలను ఏకంగా ప్రేమికులను చేసారు ఈయన.
'గున్నమామాడి కొమ్మమీదగూళ్ళురొండుండేవి'(బాల్యమిత్రులకథ1973.)
మరో కవి చిలుక-గోరింక చమత్కారంమైన పాట.
'చిలుకా-గోరింక కులికే పకపకా'(చెంచులక్ష్శి. 1958.)
చిలుకకు గోరింకకు జంట ఏమిటి మహాశయా అని మనం అంటున్నా!
'గోరింక గూటికే చేరావు చిలుక' (దాగుడు మూతలు.1964.)
ఇదేం చోద్యమండి బాబు,గుడ్డుముందా-కోడిముందా అని ఈకవిగారు మనల్ని అడిగినట్లు ఈపాటరాసారు.
'మావి చిగురు తినగానే' (సీతామహలక్ష్మి.1978.)
ఇదేమిటి? మరీ విడ్డూరం.సోగసైన కనులు-ఇంపైన మనసు కలిగిన గులాబిబాల అట మీరు ఎక్కడైనా చూసారా?
'ఓహా గులాబిబాలా' (మంచిమనిషి.1964. )
అసలు గూడు కట్టలేని పక్షులు కొన్ని ఉన్నాయి.అటువంటి వాటి లో చిలుక ఒకటి అవునా,మరి ఈ కవిగారేమిటి ఈపాట ఇలా రాసారు.
'పయనించే ఓచిలుక ఎగిరిపో పాడైపోయనుగూడు' (కులదైవం.1960.)
చిలుక గూడు కట్టదు. చెట్టు తొర్రలో జీవిస్తుంది మహాప్రభో అని మనం అంటున్న, ఈకవి గారు చూడండి ఎంత చమత్కాంగా చిలుకకు బంగారు గూడే కట్టారు.
'ఓ బంగారు గూటిలోని చిలుక'(కొడలు దిద్దిన కాపురం.1970.)
తుమ్మెద అంటే అందరికి భయమే అది మన చేరువకు వస్తే చెవులు మూసుకుంటాం.ఆలాంటి తుమ్మెదనే పాట పాడించిన ఈకవిని మెచ్చకుండా ఉండలేం!
'ఝుం ఝుం తుమ్మెద పాడింది' (చిట్టిచెల్లెలు.1972.)

మాకేచాలక,లేక చెట్టులు,పుట్టలు వెదుకు తుంటే, మాతిండి లోనే వాటా అడుగుతున్నాడు,ఈ కవి ఎవరండి బాబు.
'ఉడతా ఉడతా హుచ్ '(జీవనతరంగాలు.1973.)
అయ్యా కవివర్యా మాగొంతుకు దారం ఉరిబిగించి,మాగుండెలో సూదిని గుచ్చి మాలగా చేసి స్త్రీలు తలలో తురుముకున్నది చాలక, మమ్మల్ని మాట్లాడమంటారా? ఇదేంన్యాయం?
'మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా' (నిర్ధోషి.1967.)
ఇదెక్కడి గోలండి,మాయింటాయన కనపడక నేవెదుకుతుంటే వాళ్ళ ఇంటాయన ఎలా ఉంటాడో నేను చెప్పాలట,అప్పుడెప్పుడో మేము ఉత్తరాలు చేరవేసి ఉండవచ్చు అంతమాత్రాన అన్ని మమ్మల్ని అడగటమేనా అంటుంది ఓపావురం.
'ఒహా ఒహా పావురమా ఓయ్యారి పావురమ'(మంచి మనిసులు.1962. )
నాజంటకోసం నేనుకూస్తుంటే మధ్యలో ఈయన గారి పాటఏటో అంటుంది గువ్వ .
'గుట్ట మీద గువ్వకూసింది' (బుద్ధిమంతుడు.1969.)
మమ్మల్ని పట్టి బోనులో పెట్టి మాచేత మీజాతకాలు చెప్పించుకున్నది చాలక,బంగారు చిలుక అంటారు.నిజంగా బంగారు చిలుకనైతే వడ్డాణమే చేయించుకుంటారు.
'చిలకమ్మ చిలకవే బంగారు చిలకవే' (జయంమనదే.1956.)
'ఓహా బంగరు చిలుక'(భలే అమ్మయిలు.1957.)
'ఓబంగరు వన్నెల చిలుకా'( తోటరాముడు.1975.)
అయ్యా కమ్మగా తినండి, కంటినిండా నిద్రపోండి.అంతేగాని మేము ఏ ఆకుల్లో ఉంటే మీకెందుకు,ఏపండు తింటే మీకెందుకు? చీటికి మాటికి మమ్మల్ని పిలవకండి.
'ఓ..ఓ..చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట ఇటురావమ్మా '(దొంగరాముడు.1955.)
తాగిన పాలు అరగక మేము గెంతులేస్తుంటే ఈయనగారి మమ్మల్ని చెప్పమంటాడేమిటి?
'తువ్వాయి తువ్వాయి' (బాంధవ్యాలు.1968.)
అయ్యా కవిగారు ఏ చెట్టుపైన ఉండాలో ఏపండు తినాలో కూడా మీయిష్టమేనా? మాచెట్లు మాపండ్లు మాయిష్టం మీరు మాకు చెప్పకండి.
'జామిచెట్టు నీడనున్న జాతి రామచిలుక'(యం.ఎల్.ఏ.1957.)
అయ్యా మీ పిల్లలను ఆడించడానికి మేము అవసరమమా?
'చదమామరావే జాబిల్లి రావే'(మనోరమ.1959.)
అందరూ ఏ.సి.కూలర్,ఫ్యాన్ గాలి ఆస్వాదిస్తుంటే కరంటుపోవడంతో నేను గుర్తుకువచ్చానా ఎప్పటికైనా నావిలువ గుర్తించండి.అలాగుర్తించిన ఈమె పాట వినండి.
'సడి సేయకోగాలి'(రాజమకుటం.1960. )
పసిపాపలనుండి పెద్దవాళ్ళవరకు ఆంనందం,అహ్లాదం పంచుతాం మేము. అయినా వానకు తడవనివారు,ఎండలో తిరగనివారు,చలికి గజగజ లాడనివారు,వేకువన మంచులో నడవనివారు,వెన్నెలకు మురిసిపోని వారు ఉంటారా? ఈకవి గారు అన్యాయంగా మాపై నింద మోపారు.
'మంటలురేపే నెలరాజా'(రాము.1968.)
ఇది మరీ బాగుంది. ప్రేమించే ముందు తెలియదా ప్రేమ ఏమిటో ప్రతివాళ్ళు మమ్మల్నే అడుగుతారు? అంటున్న ఈచిలకమ్మ మాటలు వినండి.
'రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో'(ప్రతిజ్ఞ పాలన.1965.)
రాయలసీమ అంటే అందరికి తెలుసు. కాని పాలవంకసీమ అంట అదెక్కడ స్వామి?అందులో పైడి చిలుక వాలిందట ఇది నిజమైన అబధంకదూ!
'పాలవంక సీమలో' (పాలమనసులు.1968.)
అసలు పక్షులు-జంతువులు మాట్లాడటం అని రాయడం నేటిది కాదు.రామాయణంలో సీతను అపహరించి వెళుతున్న రావణునుని జటాయువు అడ్డగించి పోరాడి గాయపడుతుంది.అనతరం తనవద్దకు వచ్చిన శ్రీరామునికి సీతజాడ జటాయువు పక్షి చెప్పిమరణిస్తుంది.అలానే రాముని సైన్యమైన వానరులు అంతా మనుష్యభాషలోనే మాట్లాడతారు.
అంతదూరంఎందుకు మనం నాడు చదివిన,నేడుమన పిల్లలు చదువుతున్న బాల సాహి త్యంలో పంచతంత్రం తోపాటు వేలకథలు జంతువులు సంభాషించినట్లు మనకు కనిపిస్తాయి.సాహితీ మూర్తులు అందరుపాట,కథా వంటి అన్నిరకలా సాహిత్యాలలో 'నిజమైన అబధ్ధాన్ని'
రాసి మనల్ని మెప్పించారు.అలాంటి మహనీయులను మనసారా అభినందనలు తెలియజేద్దాం!
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.9884429899.

మరిన్ని వ్యాసాలు

కరోనాను తరిమికొడదాం...
కరోనాను తరిమికొడదాం...
- డా. చిటికెన కిరణ్ కుమార్
మిశ్రమ దంతాలు(Mixed dentition)
మిశ్రమ దంతాలు(Mixed dentition)
- డా.కె.ఎల్.వి.ప్రసాద్
కొమర్రాజు లక్ష్మణ రావు.
కొమర్రాజు లక్ష్మణ రావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అమృతానికి మారుపేరు అమ్మ.
అమృతానికి మారుపేరు అమ్మ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!(దంతవైద్య విజ్ఞాన వ్యాసం)
అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!
- డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్
టంగుటూరి ప్రకాశం పంతులు .
టంగుటూరి ప్రకాశం పంతులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.