కరోనాను తరిమికొడదాం... - డా. చిటికెన కిరణ్ కుమార్

కరోనాను తరిమికొడదాం...

  కరోనాను తరిమికొడదాం ==================              వైద్య రంగాలలో డాక్టర్లు, నర్సులు నేడు కరోనా పేషెంట్ కి  చేసే సేవలు ప్రత్యక్షంగా కళ్ల ముందు కనిపించే దేవతల్లా కనిపిస్తున్నారు. వారి యొక్క జీవితాన్ని ఫణంగా పెట్టి వృత్తి ధర్మం నెరవేర్చడంతో పాటు బాధ్యతతో ఎందరో మంది జీవితాలకు ఊపిరి పోస్తున్నారు.  కష్టసాధ్యం అయినటువంటి రోగుల మధ్యలో  కర్తవ్యాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ప్రతిరోజు వ్యాక్సిన్లను అందించడం, వైద్య సేవలు చేయడం, 24 గంటలు వైద్య సేవల్లో తలమునకలు కావడం నిజంగా మరో సాహసమే.         పేగు తెంచుకుని పుట్టిన కన్న బంధాలే నేడు కొందరు దూరంగా ఉంటున్న సమయంలో ఏ బంధము ఎరగని వైద్య సిబ్బంది ఈరోజు ప్రజానీకానికి చేస్తున్న సేవలు అద్భుతమైనవి.          ఆత్మీయులను గుర్తు చేసిన కరోనా....            సాధారణంగా కరోనా సోకిన కుటుంబాన్ని కొంతమంది వెలివేసిన తీరు పరిస్థితులు ఉన్నాయి. కరోనా సోకగానే ఆ కుటుంబంతో శారీరకంగా దూరంగా ఉంటే బాగుంటుంది. కానీ మానసికంగా తెలియక చాలామంది దూరంగా ఉంటున్నారు. అది చాలా మనిషిని కలచి వేస్తుంది. మాట సాయంతో ఎంతో ధైర్యాన్ని అందించాల్సిన బాధ్యత కూడా సాటి వ్యక్తిపై మనం చూపించాల్సిన ప్రేమ కూడా ఎంతో ఉన్నది. మనో ధైర్యాన్ని అందించి తోటి మానవాళిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఈ సందర్భంగా తనకు ఆత్మీయులు ఎవరో వారి సన్నిహితం ఎంతవరకు ఉంటుందో కరోనా  తెలియచేసింది.  శారీరకంగా దూరంగా... మానసికంగా దగ్గరగా....             సృష్టిలో మానవ సంబంధాలే గొప్ప విలువైనవి. సాటి వ్యక్తి కి చేసే సహాయం, ఆత్మీయులకు చేసే సహాయం ఒక మాట తోడ్పాటు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కరోనా అని చెప్పగానే సాటి వ్యక్తి దూరంగా ఉండడం ఒక రకం  అయితే మానసికంగా దూరంగా ఉండి వారిని వంచనకు గురి చేసి  వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు.  అవగాహన పెంచుకోవాలి... =================         ప్రతి ఒక్కరూ కరోనా వైరస్‌పై ఆందోళన చెందకుండా అవగాహన పెంచుకుంటే దీని బారిన పడకుండా ఉండవచ్చు. అంతేగాక లక్షణాలున్నా చికిత్సలతో కోలుకోవచ్చు. అందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చైతన్యం చేయాలి. ఎవరూ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండటం అందరికీ మంచిది. అత్యవసర పరిస్థితుల్లో  మాత్రమే బయటికి వెళ్లాల్సి వస్తే భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. వైరస్‌ లక్షణాలు ఉంటే వెంటనే సమాచారం ఇచ్చి వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం.

మరిన్ని వ్యాసాలు

డా.సర్వేపల్లి రాధాకృష్ణ
డా.సర్వేపల్లి రాధాకృష్ణ
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
తెన్నేటి విశ్వనాథం.
తెన్నేటి విశ్వనాథం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.
బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
రక్తం -రక్తదాన ఆవశ్యకత
రక్తం -రక్తదాన ఆవశ్యకత
- కందర్ప మూర్తి
మంగళంపల్లి బాలమురళికృష్ణ.
మంగళంపల్లి బాలమురళికృష్ణ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మొక్కపాటి నరసింహ శాస్త్రి.
మొక్కపాటి నరసింహ శాస్త్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
న్యాయపతి రాఘవరావు.
న్యాయపతి రాఘవరావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.