విశ్వనాథ సత్యనారాయణ. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

విశ్వనాథ సత్యనారాయణ.

విశ్వనాథ సత్యనారాయణ.
వీరు సాహితి రంగంలో సామ్రాట్ !జ్ఞాని!తెలుగు సాహిత్యరంగానికి మణికిరీటం వంటి తిరుపతి వేంకటకవుల ప్రియశిష్యుడు, తెలుగు సాహిత్య రంగానికి జ్ఞానపీఠం తెచ్చిన ఘనాపాటి.అయిన వీరు 1895 సెప్టెంబర్ 10న కృష్ణాజిల్లా నందలూరులోపార్వతిదేవి శోభనాద్రి గార్లకు జన్మించారు. తన కార్యక్షేత్రాన్నికడదాకా విజయవాడలోనే జరిపారు.వీరు స్వయంగా 'సత్యనారాయణ అండ్ కొ 'అనే ఓ ప్రచూరణ సంస్ధను స్ధాపించి 'జయంతి' అనే పత్రికను నిర్వహించారు.దాదాపు ఇరవై వేల పద్యాలు, అరవైకి పైగా నవలలు రాసారు.'వేయిపడగలు '-' చెలియలికట్టు'-'స్వర్గానికినిచ్చెనలు'-'తెరచిరాజు'-'మాబాబు'-'ధర్మచక్రం'-'కమిడిచెట్టు'-'నందిగ్రామరాజ్యం'-'వీరపూజ'-హాహాహూహూ'-'బద్దన్నసేన'-'మ్రెయుతుమ్మెద'-'బాణావతి'-'పునర్జన్మ''జేబుదొంగలు''కిన్నేరసాని''వీరవల్లుడు''పురాణవైరగ్రంధమాల'(12)భాగాలు.'నేపాలరాజువంశనవలలు(6)భాగాలు.కాశ్మీరిరాజవంశనవలలు(6)బాగాలు.'రామాయణకల్పవృక్షం'(6)బాగాలు.ఈరచనకు కేంద్రసాహిత్యఆకాడమివారు'జ్ఞానపీఠ్' (1970)అవార్డువచ్చింది.

ఇలా పలు నాటికలు,థలు,వ్యాసాలు,విమర్శలు ఎన్నోరాసారు.వీరి వేయిపడగలు నవల సాహిత్య అభిమానులహ్రుదయంలో నిలిచిపోయింది. అత్యంతప్రజాదరణపొందింది.పి.వి.నరసింహారావు,తెన్నేటివిశ్వనాధం,టంగుటూరిప్రకాశం,బెజవాడగోపాలరెడ్డి,కళావెంకట్రావు,మండలికృష్ణారావు వంటివారు వీరి శిష్యవర్గంలో ఉండేవారు. సాహిత్య ఆకాడమి ఉపాధ్యక్షులుగా, శాశనమండలి సభ్యులుగా తనవంతు సేవలు అందించారు.వీరితొలినవల' 'అంతరాత్మ'తరువాత 'ఏకవీర' తమిళనాడు మధుర ప్రాంతానికి చెందిన ఈనవల సినిమాగా కూడా రూపుదిద్దుకుంది ఆంగ్లలోను,సంస్కృతంలో పలు రచనలు వీరు చేసారు.వీరి భాషాభిమానం' ఆంధ్రపౌరుషం'-'ఆంధ్రప్రశస్తి'రచనలు తెలియజేస్తాయి. ఇంతటి పేరుకలిగిన ఈమహనీయుడు నిరాడంబర జీవితంగడిపారు.వీరికి గుడివాడలో 'గజారోహణం' ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు'కళాప్రపూర్ణ' 'శ్రీవెంకటేశ్వరావిశ్వవిద్యాలయిం వారు'గౌరవడాక్టరేట్'తొ సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ధానకవిగా నియమించింది. భారతప్రభుత్వం'పద్మవిభూషణ'తొ గౌరవించింది.తెలుగు భాషకు మహాన్నతసేవలు అందించిన వీరు 1976 అక్టోబర్ 18 న కళామతల్లికి పాదసేవకై తరలి వెళ్ళారు.