వావికొలను సుబ్బారావు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

వావికొలను సుబ్బారావు.

వావిలికొలను సుబ్బారావు.
1863 జనవరి 23న రాయలసీమలోని ప్రొద్దుటూరులో
జన్మించారు. తండ్రి రామచంద్రరావు. తల్లి కనకమ్మ. భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలూకా ఆఫీసులో గుమాస్తాగా చేరి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఈయన కాలాంతరమున వాసుదాస స్వామిగా ప్రసిద్ధికెక్కినారు.ఆంధ్ర వాల్మీకిగా పేరుపొందినవీరు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని ఇరవై నాలుగు వేల ఛందో భరిత పద్యాలుగా తెలుగులో వ్రాశారు. దానికి మందరం అని పేరు. ఇది అనితర సాధ్యమైన విషయం. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలనూ ) 108 సార్లు నియమ పూర్వకంగా పూర్తిగా పారాయణం చెయ్యటం వలన ఆయనకు అందులోని నిగూఢ అర్ధాలు స్ఫురించాయి.ఆయనవ్రాసిన రామాయణాన్నిమహాసభా
మద్యంలో ఒంటిమిట్ట రామా లయంలో శ్రీరామునకు అంకితం ఇచ్చాడు. అప్పుడు బళ్ళారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు 'ఆంధ్రా వాల్మీకి' అని బిరుదు ప్రదానం చేసారు.రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికీ వారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి ఆలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకొని ఆయన టెంకాయ చిప్పను చేతిలో ధరించి ఆంధ్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఎంత ధనం దానిలో పడినా ఏదీ ఉంచుకోనక రామునకిచ్చి చివరకు తాను ఖాళీ అయిన టెంకాయచిప్పను చూచి "నీ జన్మ ధన్యము కదే టెంకయ చిప్పా" అంటూ దానిమీద 'టెంకాయ చిప్ప శతకం' చెప్పిన మహాకవి.ఆయన ఎంతటి మహా కవి అంటే నెల్లూరులో జరిగిన ఒక సభలో సభ అందరి ఎదురుగానే కొన్ని గంటలలో రంగనాయకునిపై నూరు పద్యాలు ఆశువుగా చెప్పి శతకాన్ని పూర్తిచేసాడు.ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజు భారతదేశాన్ని చూడటానికి వచ్చినపుడు, కళాశాల తెలుగు పండితుడు గనుక యువరాజును స్తుతిస్తూకవితలుచెప్పమని బ్రిటిషు ప్రభుత్వంఆయన్నుఆదేశించింది.
బహుమతిగా బంగారు కంకణం ఇస్తామని ఆశ చూపింది. దాన్ని తిరస్కరించి తాను రామదాసునే గాని కాసుదాసును గానని తేల్చి చెప్పాడు.ఆయన 1920 ప్రాంతాలలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితునిగా పనిచేసాడు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచీ ధరించి రాముని కోసం ఒంటి మిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేసాడు. కాని ఊరిలోని కొందరు స్వార్థపరులు కుళ్ళు రాజకీయాలతో ఆయన్ను అవమానించి ఆలయంలోనికి రానివ్వక వెడలగొట్టి ఊరిలో నిలువలేని పరిస్థితిని కల్పించారు. ఆయన దుఖించి, ఆ ఊరినివీడి,మొదట గుంటూరుజిల్లా నడిగడ్డపాలెంలోనూ తరువాత అంగలకుదురులోనూ తన ఆశ్రమాన్ని స్థాపించుకొని అక్కడే ఉన్నాడు. ఈయన మొదలు పెట్టిన గురుపరంపర నేటికీ కొనసాగుతూ ఉన్నది.ఆంధ్ర వాల్మీకి రామాయణం,శ్రీకృష్ణలీలామృతము,ద్విపద భగవద్గీత,ఆర్య కథానిధులు,ఆర్య చరిత్రరత్నావళి,సులభ వ్యాకరణములు ,శ్రీకుమారాభ్యుదయము (రమాకుమార చరితము)గాయత్రీ రామాయణం,శ్రీరామనుతి,కౌసల్యా పరిణయం,సుభద్రా విజయం నాటకం,హితచర్యమాలికఆధునిక వచనరచనా విమర్శనం,పోతన
నికేతన చర్చ,పోతరాజు విజయం,రామాశ్వమేథము,ఆంధ్ర విజయము,
టెంకాయచిప్ప శతకము,ఉపదేశ త్రయము,మంధరము (రామాయణ పరిశోధన),శ్రీరామావతారతత్వములు,శ్రీకృష్ణావతారతత్వములు,దేవాలయతత్త్వముదండక త్రయము వంటి పలురచనలు చేసినవీరు 1936 ఆగష్టు 1వతేదిన తుదిశ్వాసవిడిచారు.

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం