రమణీయ రచనామృతం రామాయణ పుస్తకం - దుర్గమ్ భైతి

రమణీయ రచనామృతం రామాయణ పుస్తకం

ఆదికావ్యం రామాయణం భారతీయ సంస్కృతి , చరిత్రకు ప్రతీక. కోట్లాది హిందువులకు ఆరాధ్య పుణ్య చరితము .రామాయణంలోని పాత్రల స్వభావం , ప్రవర్తనా విధానము నేటి సమాజానికి ఆదర్శ జీవన ప్రమాణముగా భావించవచ్చు .తల్లిపట్ల ప్రేమ భావం , తండ్రి మాట పాటించడం , అన్న అడుగుజాడలో నడవడం . భార్యాభర్తల పవిత్ర బంధం, గురువు పట్ల భక్తి ,ఉత్తమ మైత్రి , ధర్మ సంస్థాపన లాంటి సద్గుణాల మిళితం రామాయణ కావ్య సారాంశం . రామాయణంలోని ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది . ప్రతి పాత్ర మన జీవన గమనానికి దిక్సూచిని తెలియజేస్తుంది . కొన్ని పాత్రలు చెడుకు ప్రతీకలుగా నిలిచాయి . అంతిమంగా చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ కావ్యం మనకు బోధిస్తుంది . ఎంతటి బలవంతుడైనా స్త్రీలను అవమానపరిస్తే ఏ గతి పడుతుందో ఆందులోని ప్రతినాయక పాత్ర చెబుతుంది . అలాగే ధర్మ రక్షణార్థం కధానాయకుడు కష్టాలను ఇష్టంగా స్వీకరిస్తాడని తెలియపరుస్తుంది. పుస్తక సంకలన కర్త పెందోట వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులుగా , పద్య , గేయ , వచన కవిగా , బాల సాహిత్య ప్రోత్సాహకులుగా సుపరిచితులు . తన రచనతో పాటు పిల్లల రచనలను ప్రోత్సహిస్తూ శ్రీవాణి సాహిత్య పరిషత్ ద్వారా పుస్తక ప్రచురణలు చేస్తూ నిరంతరం సాహితీ సేవ చేస్తున్నారు.సాహిత్యములో 34 పుస్తకాలను ప్రచురించాడు . ఇప్పుడు వినూత్న ప్రయోగంగా " రామాయణ పాత్రల విశిష్టత " అను శతాధిక కవితా సంకలన పుస్తకాన్ని సాహితీ లోకానికి పరిచయం చేయడం చాలా సంతోషము . మానవత్వం కనుమరుగవుతున్న ఆధునిక అవసరాల ప్రపంచానికి ఈ పుస్తకం ఒక కనువిప్పు కావాలి . ఈ కవితా సంకలనంలో అత్యధికంగా రాముని గురించే కవితలు పద్యాలు వ్రాసారు . రాంబంటు వీర హనుమాన్ గురించిన రచనలు బాగున్నాయి . ప్రతి కవి/కవియిత్రి తమరచనల ద్వారా రామాయణంలోని పాత్రలను తమ చెడు స్వభావం ద్వారా పతనమయ్యారని వర్ణించారు . రామాయణంలోని ప్రతి పాత్ర ఒక సందేశానికి సూచిక , రాముని పట్ల భక్తి తన భక్తిని ప్రదర్శిస్తూ గోస్వామి తులసీదాస్ " రామ చరిత మానస్ " లాంటి మహత్తర కావ్యాన్ని భక్త కోటికి అందించారు . అలాగే రాముని పట్ల తన భక్తిభావంతో పెందోట రూపొందించిన ఈ చిరు ప్రయత్నంలో భాగస్వాములైన 108 మంది కవులకు శుభాభినందనలు. నిత్య నూతన జీవన స్రవంతికి రమణీయ రచనామృతం రామాయణ కావ్యం.రాముడు సమస్త మానవాళి కి మార్గదర్శి.సీతమ్మ తల్లి మహా సాధ్వి. సిద్దిపేట పెందోట భవిష్యత్తు లో మరిన్ని సంకలనాల రూప కల్పనకు శ్రీకారం చుట్టాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు