డొక్కా సీతమ్మ. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

డొక్కా సీతమ్మ.

కలియుగ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ.
'అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ'
షోడశదానాలను చెప్పిన పెద్దలు అన్నదానాన్ని అందులో చేర్చలేదు ఎందుకంటే అన్నదాన ఎంతో పవిత్రమైనది. అటుటువంటి అన్నదాతలలో ఒకరైన సీతమ్మగారుతూర్పుగోదావరిజిల్లా, రామచంద్రపురం తాలుకా,
మండపేట గ్రామంలో 1841 అక్టోబరు రెండోవారంలో సీతమ్మ జన్మించింది. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గారు . సీతమ్మ తండ్రి శంకరం గారిని గ్రామస్థులు 'బువ్వన్న' గారని ముద్దు పేరుతో పిలుస్తుండేవారు. చిన్ననాటి సీతమ్మకు తల్లి, తండ్రి గురువులై కథలు, గాథలు, పాటలు, పద్యాలు అన్నీ నేర్పారు. ఆమె ఆ రోజుల్లో స్త్రీ విద్య నేర్చుకునే అవకాశాలు అంతగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు బద్ధురాలై, పెద్దబాలశిక్ష వంటి గ్రంథాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండానే, పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ కాలం చేస్తే, ఇల్లు చక్కదిద్దే భారం సీతమ్మ పై పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది. గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు గారనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమయ్యింది. భోజనం చేసే సమయం అయింది. వారు మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకరం గారు గుర్తుకు వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం గారింటికి వెళ్లి ఆ పూట వారి ఇంటి ఆతిధ్యాన్ని స్వీకరించారు. జోగన్నగారికి అతిథి మర్యాదలను చేయటంలో సీతమ్మగారు చూపించిన ఆదరాభిమానాలకు ఆయనసంతృప్తిచెందాడు,పరమానందభరితుడయ్యాడు. యవ్వనంలో
ఉన్న సీతమ్మగారు చూపించిన గౌరవ మర్యాదాలు, ఆమె వినయ విధేయతలు నచ్చిజోగన్నగారికి ఆమెను వివాహం చేసుకోవాలనే భావన కలిగింది. ఆయనకు సాముద్రిక శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. బువన్న సీతమ్మను డొక్కా జోగన్నకు ఇచ్చి వైభవంగా పెళ్ళి జరిపించాడు. సీతమ్మకు మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్కా ఇంటి పేరుగా మారింది. ఆమెకు వయసుతో బాటు ఉదార గుణం కూడా నానాటికీ పెంపొందసాగింది.జోగన్నసీతమ్మగార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి ఆనందించనివారు లేరనే చెబుతుండే వారు. శుచి, శుభ్రతలతో బాటు ఆప్యాయతా, ఆదరణలకు వారి ఇల్లు పెట్టింది పేరుగా ఆ గ్రామమంతా చెప్పుకునేవారు. ఆ కాలంలో గోదావరి దాటాలంటే ఒకే ఒక ప్రయాణ సాధనం పడవ. జోగన్న ఊరు లంకగన్నవరం గోదావరికి మార్గమధ్యంలో ఉన్నందు వల్ల ప్రయాణీకులు అలసి అక్కడకు చేరేవారు. అలాటివారికి అన్నపానాలు సమకూర్చడం సీతమ్మ భర్తతో కలిసి చేస్తుండేది. ఆ ఇంటి దంపతుల లక్ష్యం ఒక్కటేగా ఉండేది. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమని అడిగినా లేదు, తర్వాత రా అనే పదాలే లేకుండా, ఆదరించి అన్నంపెట్టడం వారికి నిత్యకృత్యంగా మారింది.
ఆమె గురించిన కథల్లో... తన జీవిత చివరలో, ఆమె తన ఆస్తులను ఇచ్చి, తన హిందూ విశ్వాసాలకు అనుగుణంగా చనిపోవడానికి ఆమెను వారణాసికి తీసుకెళ్లడానికి ఒక ఎద్దు బండి డ్రైవర్‌ను నియమించింది, కానీ వెనక్కి తిరిగి, తరువాతి గదిలో ఆకలి గురించి విన్న తర్వాత ఒక కుటుంబానికి త్వరగాభోజనంవండినారు.అలాగేఒకసారి అంతర్వేది తీర్ధానికి ప్రయాణమైన వారు కొందరు తీర్ధ యాత్రికులు సీతమ్మ గారి ఇంటికి వెళ్ళలని అనుకోవడం విని వెనక్కి మరలినట్టుగా చెప్తారు.ఈ మహాతల్లి జీవితచరిత్రను 1959 వ సంవత్సరంలో శ్రీ మిర్తిపాటి సీతారామఛయనులు గారు 'విరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ' పేరిట గ్రంథస్తం చేయడం జరిగింది. ఈ గ్రంథమును వీరి పుత్రులు సర్వశ్రీ మిర్తిపాటి నారాయణ, మాచరిబాబు, వేంకట్రామయ్య గార్లు 2009 లో పునర్ముద్రించి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకునిరావడం జరిగిందిజననం 1841 నుండి మరణము 1909 వరకూగలఈమెచరిత్రసెకండరీ పాఠశాల తెలుగు పాఠ్యాంశముగా చేర్చబడింది.గన్నవరం గోదావరి నదిపై కల అక్విడెక్ట్ కు ఈమె పేరున డొక్కాసీతమ్మ అక్విడెక్ట్ అని నామకరణం చేసారు.ఆంధ్ర దేశపు కీర్తి పతాకను ఇంగ్లండు వరకు వ్యాపింపజేసి, మాతృప్రేమను అతిథులకుపంచి, జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ.
ఆమె కేవలం అన్న దానమే కాదు, ఎన్నో పెళ్ళిళ్ళకూ, ఇతర శుభాకార్యాలకూ విరాళాలు యిచ్చిన దాత కూడా.చందాల రూపంలో కాని, విరాళాల రూపంలో కాని ఎవరి వద్దా ఏమీ తీసుకోని కారణంగానూ, ఆస్తిపాస్తులు ఏమీ లేని కారణంగానూ ఆమె వంశస్థులు ఆమె తదనంతరం ఎక్కువకాలం ఈ వితరణ జరపలేకపోయారు.
బ్రిటీష్ ప్రభుత్వం ఆమె దాతృత్వాన్ని గుర్తించింది, కింగ్డ్ ఎడ్వర్డ్ VII ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు భారతదేశంలోని ఇతర అతిథులతో కలిసి ఆహ్వానించారు. గౌరవంతో ఆమెను ఢిల్లికి తీసుకురావాలని ఆయన మద్రాస్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు, కాని సీతమ్మ మర్యాదగా ఆహ్వానాన్ని తిరస్కరించింది, ప్రచారం కోసం ఆమె తన సేవలను అందించడం లేదని అన్నారు. మద్రాస్ ప్రధాన కార్యదర్శి బదులుగా కింగ్ ఎడ్వర్డ్ ఆమె యొక్క ఫోటోను ఇచ్చారు, ఆ వేడుకలో ఆమె కూర్చునే కుర్చీపై ఉంచడానికి అతను విస్తరించాడు. సీతమ్మవారి ఫోటో కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి ఆలయంలో ఆవిష్కరింపబడింది.సికింద్రాబాద్ లో కంటోన్మెంటులో ఆంగ్లప్రభుత్వం నిర్మించిన స్టేడియం నేటికి సీతమ్మగారి పేరుతో పిలవబడుతుంది. సేవాభావం లండన్ వారి ఆహ్వానాన్ని తిరస్కరించిన ఈమె సేవాభావమే జీవితపరమార్ధంగా భావించి జీవించిన వీరు1909 తుదిశ్వాసవిడిచారు.
 

 

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - Amayaka Prajalu
కాశీ ప్రయాణ కథలు - అమాయక ప్రజలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Akashayanam lo anagarikatha
ఆకాశయానంలో అనాగరికత (వ్యాసం)
- మద్దూరి నరసింహమూర్తి
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - prathubhaku Pattam
కాశీ ప్రయాణ కథలు - ప్రతిభకు పట్టం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు