కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - ethuku pi ethu

కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

"సోదరులారా ఈరోజు మీకు ఎత్తుకు పై ఎత్తు అనే కథ చెపుతాను వినండి " అని కథ చెప్పడం ప్రారంభించాడు శివయ్య...

సింహపురి రాజ్యాన్ని గుణనిధి అనే రాజు పరిపాలిస్తుండేవాడు ,అతను సమర్ధవంతమైన పాలకుడు ధైర్య,సాహసాలకు మారు పేరుగా ఉండేవాడు. అతని రాజ్యం చిన్నదికావడంతో రాజ్యరక్షణకు మూడువేల మంది సైనింకులు మాత్రమే ఉండేవారు. తన రాజ్యం అంతటా ఉద్యానవనాలు పెంపకం,ప్రతియింట పూలమమేక్కలు పెంచడం తప్పని సరి చేస్తు చట్టం చేసాడు, తన కోట బురుజుపై వందలాది తేనె టీగల పెట్టెలలో పెంపకం అనుభవం ఉన్నవారిచే పెంపకం చెయసాగాడు. అలా తేనెటీగల పెంపకం ద్వారా మంచి ఆదాయం తన కోశాగారానికి చేరుతుండేది.

ఒకరోజు తమరాజ్యానికి చెందిన వేగులు రాజుగారిదర్శనం చెసుకుని " ప్రభు భువనగిరి పాలకుడు రుద్రసేనుడు మనారాజ్యంపైన వచ్చె పౌర్ణమి నాడు అపారమైన తన ఇరవై వేలమంది సైనికులతో దాడి చేయడానికి యుధ్ధ సన్నాహలు ప్రారంభించాడు 'అనే సమాచారం అందించి వెళ్ళిపోయారు.

వెంటనే తన మంత్రి,సైన్యాధిపతులతో సమావేశమై పరిస్ధితి వివరించి పౌర్ణమి రోజు తమపై దాడి చేయబోతున్న రుద్రసేనుని ఎలా ఎదుర్కొనాలో వ్యూహరచన చెసాడు.

రేపు పౌర్ణమి అనగా ముందురోజు సాయత్రం తన సేనలతో వచ్చిన రుద్రసేనుడు సింహపురి కోటకు సమీపంలోని అడవిలో విడిది చేసాడు.

అదిచూసిన గుణనిధి తన సైనికులకు సైగ చేసాడు, వందలాది తేనెటీగలతో ఉన్న పెట్టెలు ,దూరంగా విసిరే యంత్రాలద్వారా రుద్రసేడు విడిది చేసిన సైన్యం పైకి విసరబడ్డాయి, ఆపెట్టెలలొని తేనెటీగలు కోపంతో రుద్రసేనుడి సైనికులను తరిమి ,తరిమి కుట్టసాగాయి. హఠాత్తుగా జరిగిన తేనెటీగల దాడికి భయపడిన రుద్రసేనుడు,అతని సేనలు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు 'అన్నాడు .

"గుణనిధి చాలా తెలివైన వాడు ఆదాయంతో యాటుగా ఆత్మరక్షణకు తేనెటీగలను ఎంచుకుని ,రుద్రసేనుడి ఎత్తుకు తన పైఎత్తువేసి విజయం సాధించాడు "అన్నాడు శ్రీహరి.

అంతా నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్