లాక్డౌన్ స్మృతులు - మండా. సూర్యనారాయణ

లాక్డౌన్ స్మృతులు

వ్యాసం పేరు : “ లాక్డౌన్ స్మృతులు ” ​ ******** “ లాక్డౌన్ స్మృతులు ” ******** కళ్ళు ముందు సమయం పరుగులు పెడుతుంది, తాను ఒక రైలు బండికి ఎం తక్కువ కాను అన్నట్లుగా కాలాలు వేగంగా ప్రయాణిస్తున్నాయి, చూస్తుండగానే మహమ్మారి వచ్చి ఏడు ఏండ్లు కావొస్తుంది, చరిత్రలో కోవిడ్ ఒక నూతన అధ్యయన్ని లిఖించింది కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్లు గా ప్రపంచం మారింది ప్రపంచాన్ని ఆర్థికంగా మానసికంగా తీవ్రంగా నష్టం కలిగించింది, గొప్ప పాఠలను ప్రపంచానికి నేర్పింది. నేను అప్పుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న, చైనా లొ ఎదో భయంకరమైన అంటువ్యాధి ఒకటి పుట్టిందని యావత్తు ప్రపంచం జాగ్రత్తగా ఉండాలి అని టీవీ లలో, న్యూస్ పేపర్ లొ ఒకటే వార్తలు, నేను నా ఎగ్జామ్స్ రాసేటప్పటికి కరోనా తాకిడి దేశంలో లేదు అయినప్పటికీ పరీక్షలు రాయడానికి వచ్చినవాళ్ళు మాస్క్ లు ధరించి, తమ వెంట శానిటైజర్ లు తెచ్చుకునేవారు, నా జీవితంలో అప్పటివరకు హాస్పిటల్ లొ డాక్టర్స్ మాత్రమే మాస్క్ ధరిస్తారు అని అనుకునేవాడిని, ఇక శానిటైజర్ అనే మాట అంతకు పూర్వం నేను వినిందే లేదు. రోజులు గడిచేకొద్ది మహమ్మారి దాటికి ప్రపంచం విలవిలా లాడింది, మన దేశంలో కుడా రోజురోజుకి కేసులు పెరుగుతూ వస్తున్నాయి, చాలా దేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి, మన దేశంలో కూడా మన ప్రధాని సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు, లాక్డౌన్ అనే నూతన పదం ప్రపంచానికి పరిచయం అయ్యింది, ఎక్కడ కార్యక్రమాలు అక్కడే నిలిచిపోయవి, దేశా దేశాలు మధ్య రాకపోకలు నిలిచాయి, చిన్న చిన్న పల్లెటూరి వారు కూడా తమ ఊరులోకి మిగతా ఊరు వాళ్ళు రాకుండా కంచెలు కట్టుకున్నారు, స్కూల్స్ కీ సెలవులు ఇచ్చి ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు, సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటినుంచే తమ పనులను చేసుంటున్నారు, సినిమా హాల్ లు, వంటి జన సంచారాలు విరివిగా ఉండే ప్రాంతాలు మూతపడ్డాయి, స్టూడెంట్స్ కీ ఎగ్జామ్స్ రద్దు చేశారు, కార్మికులు రోజు వారి కూలీ లు కుడా బడి పిల్లలు లా ఇంట్లోనే గడిపారు, కొన్ని ప్రాంతాలలో రెడ్ జోన్స్ అంటూ కఠినమైన అంక్షలు విధించారు, ధనవంతులు, మధ్య తరగతి వాళ్ళు, పేద వాళ్ళు అని తేడా లేకుండా అందరు మహమ్మారి దాటికి విలవిలా లాడారు, ప్రభుత్వాలు, ఊరి పెద్దలు, సినిమా వాళ్ళు ఇలా ఎంతో మంది ప్రజలకి నిత్యావసర సరుకులు, ఇంకా డబ్బులు ఇచ్చి తమ మంచి మనసులని చాటుకున్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్యను ప్రతి న్యూస్ ఛానల్ వారు ఒక పక్కన చూపెట్టేవారు, నేటి ఆధునిక యుగం లొ లక్షల్లో ప్రజలని ఒక అంటూ వ్యాధి బలితీసుకుంటుందని ఎవరు ఊహించి ఉండరు, కరోనా బారిన పడిన వాళ్ళని సమాజం వెలివేసేలా చుసేది కరోనా బారిన పడి మరణించిన వాళ్లదే దురదృష్టం అందరు ఉన్న కూడా ఆనాధలా దహనసంస్కారాలు జరిగేవి మోయడానికి కూడా ఎవరు లేని దయనియా స్థితి లొ వారి జీవితం ముగిసింది. ఇదంతా నాణనికి ఒక పక్క మాత్రమే తల్లితండ్రులకు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇంట్లో ఉన్నారు, పిల్లలకు ఎగ్జామ్స్ రద్దు అయ్యవీ అని ఆనందం, పాతకాలం రోజులు లా విధిచివర్ల ముచ్చట్లు, హౌసీ ఆటలు, బయటికి రావొద్దని ప్రభుత్వాలు, పోలీస్ వారు ఎంత చెప్పిన మధ్యాహ్నం 3 అయితే ఊరుచివర పొలంలో క్రికెట్ ఆడేవాళ్ళం మాస్క్ లు కట్టుకొని, బాల్ కి బ్యాట్ కి శానిటైజర్ లు రాసుకొని మరి ఆడేవాళ్ళం, పోలీస్ హారన్ వినిపించగానే వాళ్ళకి కనిపించకుండా దాగునే వాళ్ళం యావత్తు ప్రపంచానికి కరోనా ఎలా ఉన్న మాకు మాత్రం ఆ ఆటలు, ఆ ముచ్చట్లు, ఆ తిరగడాలు, ఆ పరుగులు ఎప్పటికి మరిచిపోలేని జ్ఞాపకాలు అందించింది. రోడ్లు అన్ని నిర్మాణష్యంగా నడిచేటప్పుడు మాకు మేము ఒక గొప్ప చక్రవర్తిలము ఏమో అనిపించేలా చేసేవి, జనసంచారం లేనందు వలన వాతావరణం లొ కాలుష్యం కూడా చాలా వరకు తగ్గింది, కరోనా అంటే మాకు మాత్రం ఒక మధుర జ్ఞాపకం, మొదటి లాక్డౌన్, రెండవ లాక్డౌన్ అంటూ మహమ్మారి తీవ్రత ను బట్టి కొంచం కొంచం అంక్షలు తగ్గించారు, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సన్నగిల్లింది, కరోనా బారిన పడి సమస్తం కోల్పోయి చిన్న భిన్నమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఆ చావులు ఆ దయనియా పరిస్థితులు గుర్తొస్తుంటే అసలు ఇలాంటి ఒక పరిస్థితిని ప్రపంచం ఎలా ఎదురుకుందో అంతుపట్టదు, కానీ కరోనా బారిన పడిన వాళ్ళని అయినవాళ్లు కూడా అమడు దూరం చేసే కష్ట కాలంలొ కూడా డాక్టర్స్, నర్సులు, పోలీస్ వాళ్ళు,పరిశుద్ధకార్మికులు,ప్రభుత్వ అధికారులు ప్రజల వెన్నంటే ఉండి భరోసాగా మేము ఉన్నాం అని దైర్యం నింపారు వాళ్ళ కష్టం వర్ణించాలేనిది సేవ చేసే తరుణంలో ప్రాణాలను పోగుట్టుకున్న వీరులు ఎంతో మంది ఉన్నారు ఏది ఏమైనా అదో గడ్డు కాలం,అయినా ప్రపంచంలో దేశాలు అన్ని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ప్రజలు కూడా ప్రభుత్వాలికి సహకరిస్తూ అందరు కలిసి సమిష్టిగా కరోనా ని తరిమి కొట్టారు, కరోనా మీద అంతిమ విజయం మానవాళిదే, ఐకమత్యమే మహాబలం అని నిరూపించుకున్నాం. ఇప్పటికి ఆ హృదయవిధాకర దృశ్యాలు కళ్ళముందు మేదులుతూనే ఉన్నాయి…అంత కలల జరిగిపోయింది చరిత్రలో కరోనా తనకంటూ ఒక అధ్యయన్ని లిఖించుకొని పోయింది, ప్రపంచం ముందులానే పరుగులు తీస్తుంది, కరోనా ఒక పీడ కలలా మిగిలిపోయింది కరోనా పోయి 7 ఏండ్లు గడిచిన ఆ రోజులు మాత్రం ప్రపంచం ఎప్పటికి మరిచిపోదు . ********************************

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు