కాశీ ప్రయాణ కథలు - అంతిమ పరిక్ష - డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

Kaashi Prayana Kathalu - Anthima Pariksha

కాశీ ప్రయాణ కథలు - అంతిమ పరిక్ష.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

"సోదరులారా ఈరోజు మీకు అంతిమ పరిక్ష అనే కథ చెపుతాను వినండి " అని కథ చెప్పడం ప్రారంభించాడు బ్రహ్మయ్య...

"భువనగిరి రాజ్యాన్ని జయపాలుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు,అతని పరిపాలనా విభాగంలో రెండు పదవులు నిర్వహించడానికి విద్యావంతులు,తెలివైన యువకులు కావలసి వచ్చారు,ఈవిషయం రాజధాని అంతటా దండోరా వేయగా పలువురు యువకులు ఆపదివి ఎంపిక కొరకు వచ్చరు. అలా వచ్చిన వారిలో రంగనాధం,శివయ్య అనే ఇరువురు అన్ని పరిక్షలలో నెగ్గుతూ చివరివరకు వచ్చారు.

"నాయనలార ఇప్పుడు మీరు అంతిమ పరిక్ష వరకు వచ్చారు అభినందనలు, మనకోటకి చేరువలో ఉన్న కొండపైకి ఒకరాత్రిలో ఎక్కవలసి ఉంటుంది, మీఇరువురికి చెరి ఒక దీపం ఇస్తాను అది ఎంతగాలివీచినా ఆరిపోకుండా ఏర్పాటు చేసాము కాని దీపంలో నూనె సగం కొండ ఎక్కేసరికి అయిపోతుంది కాని మీరు వెలుగుతున్న దీపంతో వేకువనే కొండపై ఉన్న ఆలయం వద్ద ఉన్న మాసైనికులకు దీపంవెలుగుతూ మీరు కనిపించాలి, మరలా చెపుతున్నాను మీచేతిలోని దీపంలోని నూనె సగం కొండవరకే వస్తుంది ,మీరుమాత్రం దీపం వెలుగులో కొండపైభాగాన ఉన్న ఆలయం లోని మాసైనికులవద్దకు వెలుగుతున్న దీపంతో వెళ్ళాలి ,మీకు తోడుగా మాభటులు ఇద్దరు మీవెంట ఉంటారు"అన్నాడు రాజుగారు.

ఆరోజు సాయంత్రం అందరూ కేండవద్దకు చేరుకుని ,రాత్రి కావడంతో వెలిగించిన రెండు దీపాలతో రంగనాథం,శివయ్యలు భటులు తోడురాగా విజయవంతంగా దీపం వెలుగులో ఆలయం వద్దనున్న సైనికులను కలుసుకున్నారు.

ఆవిషయం తెలుసుకున్న రాజుగారు ఆరెండు పదవులలో రంగనాథం,శివయ్యలను నియమించాడు. ఇంతకీ వారు దీపం వెలుగులో కొండ పైభాగానికి ఎలా చేరుకున్నారు ? అన్నాడు.

"ఇక్కడ రెండు విధాల చేసే అవకాశం ఉంది, మొదటిది రెండో దీపంలోని నూనె కూడా మెదటి దీపంలో పోసుకుని ఆదీపం వెలుగులో వారు కేండపైకి వెళ్ళవచ్చు, రెండవది ముందుగా శివయ్య చేతిలోని దీపం ఆర్పివేసి, మొదట రంగనాథం దీపం వెలుగులో కొండ అర్ధభాగానికి చేరుకుని రంగనాథం దీపం నూనెలెక ఆరిపోయిన అనంతరం శివయ్య చేతిలోని దీపంవెలిగించి దాని వెలుగులో కొండపైనున్న ఆలయం వద్దకు చేరుకోవచ్చు అన్నది సరస్వతి.

కథ పూర్తికావడంతో అంతా నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్