Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

'యువత ' సినిమా ఆశయాలు

film chances for youth

సినిమాలంటే యువతలో వుండే క్రేజ్‌ గురించి తెలియనిదెవరికి? సినీ సెలబ్రిటీలకు అందుకే అంత ఫాలోయింగ్‌ వుండేది. సినిమా స్టార్స్‌ని దేవుళ్ళలా భావించేవారు ఇప్పటికీ వున్నారు, వుంటారు కూడా. అందుకే సినీ పరిశ్రమపై సహజంగానే యూత్‌కి ఆసక్తి ఎక్కువ వుంటుంది. అలా సినిమా మీద ఆశతో, కెరీర్‌ని పక్కన పెట్టి, సినిమా పరిశ్రమలో ఏదో ఒక విభాగంలో సెటిలైపోవాలనుకుంటారు.

కానీ, అవకాశాలు అందరికీ రావు కదా. ఏ రంగమైనా అంతే. సినీ పరిశ్రమలో అవకాశాలకి టాలెంట్‌తోపాటుగా అదృష్టమూ కలిసి రావాలి. అదృష్టం కలిసొచ్చి అవకాశం వచ్చినా, ఫలితం తేడా కొడితే.. మళ్ళీ డీలా పడాల్సి వస్తుంది. వెనక్కి వెళ్ళలేక, ముందుకు సాగలేక ఇబ్బందులు పడక తప్పదు. గొప్ప గొప్ప నటులుగా వెలిగిన వారైనా, కెరీర్‌లో ఒక్కసారి దెబ్బ తగిలితే, కోలుకోలేరనడానికి చాలా ఉదాహరణలున్నాయి.

అందుకే సినీ పరిశ్రమలో వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. సినీ పరిశ్రమ అనే కాదు, ఎక్కడైనా అంతే. సినీ పరిశ్రమలో ఇంకొంచెం ఎక్కువ. నటుల విషయంలో వారికి వారు కన్పించేది ఒకలా.. అదే దర్శకుడి ఆలోచనల్లోంచి చూస్తే ఇంకొకలా వుండొచ్చు. దర్శకుడికి తగ్గట్టు తమను తాము మలచుకునే టాలెంట్‌ నటులుగా ఎదగాలనుకున్నవారికి వుండి తీరాల్సిందే.

ఆశ పడ్డం, సినిమాలే ఆశయంగా పెట్టుకోవడం తప్పు కాదుగానీ, వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేస్తేనే ఆ ఆశ నిజమయ్యేది.. ఆశయం నెరవేరేది.

మరిన్ని సినిమా కబుర్లు
nanditha beauty