Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sridevi not doing mistake as radha

ఈ సంచికలో >> సినిమా >>

కథానాయిక అంటే విప్పక తప్పదా?

is exposing copulsary for heroine?

హీరోయిన్లు అంటే గ్లామర్‌, గ్లామర్‌ అంటే హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌ అనే అభిప్రాయం ఒకటుంది. కాని కొందరు ఎక్స్‌పోజింగ్‌ చేయకపోయినా కెరీర్‌లో నిలదొక్కుకుంటారు. అలా ఓ ప్రత్యేకమైన కేటగిరీలోకి చేరుతుంది హీరోయిన్‌ నిత్యా మీనన్‌. 'అలా మొదలైంది' ఆమెకు తెలుగులో మొదటి సినిమా. మలయాళ సినీ పరిశ్రమ నుంచొచ్చింది నిత్యామీనన్‌.

ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ హద్దులు దాటి ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు. ఓ మోస్తరు గ్లామర్‌కీ ఆమె ఇష్టపడలేదు. హైట్‌ విషయంలో ఆమెపై ఎన్ని విమర్శలొచ్చినా, నటిగా ఆమె టాలెంట్‌ టాలీవుడ్‌ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తోంది. సింగింగ్‌ టాలెంట్‌, దానికి తోడు ఆమె సినిమాలో నటిస్తే హిట్‌ అవుతుందన్న సెంటిమెంట్‌.. ఇవన్నీ నిత్యామీనన్‌కి ప్లస్‌ పాయింట్స్‌.

ఎక్స్‌పోజింగ్‌ అదనపు ఆకర్షణ మాత్రమే. నటనతోనే ఎవరైనా ఆకట్టుకోవాలి.. అనడానికి నిత్యామీనన్‌ని ఉదాహరణగా చెప్పవచ్చు. ఎక్స్‌పోజింగ్‌ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్‌ వున్నాయట. అందుకే ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదని చెపుతుంది నిత్యామీనన్‌ 'గ్లామర్‌' గురించి ఎవరైనా ఆమెను ప్రశ్నించినట్లయితే.

మరిన్ని సినిమా కబుర్లు
using pawan kalyan