Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
saametha by bannu

ఈ సంచికలో >> శీర్షికలు >>

అధిక బరువు - లాస్య రామకృష్ణ

heavy weight

మన బరువు తగిన మోతాదులో ఉందో లేదో తెలుసుకోవడం బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ద్వారా సాధ్యం. అయితే BMI గురించి ఈ క్రింది పాయింట్లు దృష్టిలో పెట్టుకోవాలి

1. బిఎంఐ 20 కంటే తక్కువగా ఉంటే తక్కువ బరువు

2. 20 నుండి 25 మధ్యలో ఉంటే సాధారణంగా ఉన్నట్టు.

3. అదే 25 నుండి 30 మధ్యలో ఉంటే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్టు అర్ధం.

4. 30 నుండి 40 మధ్యలో ఉంటే ఉబకాయుల కింద లెక్క.

5. 40 దాటితే మీ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు.

బిఎంఐ ఎలా లెక్కించాలి?

ఉదాహరణ  - 1.70 మీటర్ల పొడవు 60 కేజీల బరువు ఉన్నవారి BMI లెక్క చూద్దాం.

60 / (1.7 x 1.7) = 20.8

ఈ వ్యక్తి యొక్క BMI సాధారణ స్థాయిలో ఉంది.

బరువుని అదుపులో పెట్టుకుంటే ఆరోగ్యకరమైన శరీరాన్ని సొంతం చేసుకోవచ్చు. అధిక బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చెయ్యడం మంచిది. అయితే, ఒకేసారి ఎక్కువ మొత్తం లో బరువు తగ్గడం కూడా మంచిది కాదు. ఆరోగ్యంపై దుష్పలితాలు లేకుండా క్రమ క్రమంగా బరువు తగ్గించుకోవాలి.

మరి బరువు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకుందామా.

1. శరీరం లో ని కొవ్వు ఎక్కువగా పేరుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. ఎక్కువ కేలరీలని వ్యాయామం చెయ్యడం ద్వారా ఖర్చు పెట్టడం ద్వారా ఈ సమస్య నుండి బయటకు రావచ్చు. అయితే, ఒకే రోజు నిర్విరామంగా వ్యాయామం చేసి బరువు తగ్గించుకోవాలనే ఆలోచన కన్నా ప్రతి రోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించండి. త్వరలోనే మంచి ఫలితాలను పొందండి.

2. ఎక్కువగా పళ్ళు, కూరగాయలని ఆహారంలో భాగం గా చేసుకోవాలి. అవసరమైన పోషకాలన్నీ తగిన మోతాదులో శరీరానికి అందేలా ప్రణాళిక వేసుకోవాలి.

3. పిజ్జాలు, బర్గర్ ల పై అభిమానం తగ్గించుకోవాలి. వీటిలో ఎక్కువ శాతం ఉండే కొవ్వు ఊబకాయానికి దారితీస్తుంది. నిజానికి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల బరువు పెరిగే ప్రమాదం ఎక్కువ.

4. ఫైబర్ సమృద్దిగా లభించే ఆహారాలను తీసుకోవాలి. రోజుకి 25 గ్రాముల ఫైబర్ రిచ్ ఫుడ్స్ ని ఆహారం లో భాగం చెయ్యడం వలన సత్ఫలితాలను పొందవచ్చు.

5. సమయానికి ఆహారం, తగిన నిద్ర అవసరం. నిద్ర తగినంత లేకపోయినా బరువు పెరుగుతారు.

6. అనవసరమైన ఆందోళనలకు దూరం గా ఉండాలి. మనసు ప్రశాంతం గా ఉండాలి. ఒత్తిడి వల్ల కుడా బరువు పెరుగుతారు.

7. ఆహార నియమాలను కచ్చితంగా పాటించాలి. ఆహరం విషయం లో ఏమాత్రం రాజీ పడిన బరువు సమస్యలు తప్పవు.

8. ఆహారాన్ని ఒకే సారి అధిక మొత్తం లో తీసుకోకుండా తక్కువ మొత్తం లో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఈ పద్దతి ఉపయోగపడుతుంది.

9. మీకు ఏ డ్రింక్స్ త్రాగాలనిపించినా నీళ్ళు తాగండి.

10. టైం పాస్ కోసం తినకండి. ఆకలి వేసినప్పుడే తినండి. మీరు తినే ప్రతి దానిని త్రాగే ప్రతిదానిని మరచిపోకుండా కనీసం రెండు మూడు రోజుల వరకు టైం తో సహా ఒక బుక్ లో నోట్ చేసుకోండి. అప్పుడు, మీరు వాటిలో ఏవి అవాయిడ్ చేయవచ్చో తెలుసుకోవచ్చు.

ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల బరువు ని అదుపులో ఉంచవచ్చు. 

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu