Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

సినీ కవులకి కొసరు సంపాదన?

extra income for cini poets

సినిమా పాటల రచయితలకి కొసరు సంపాదన రాబోతోంది. సినిమా పాటలు రాశాక, దానికి పారితోషికం తీసుకోవడంతోనే సరిపోతోంది. కానీ, ఇకపై పాటల రచయితలకు అదనపు ఆదాయం వచ్చే మార్గమొకటి అందుబాటులోకి రాబోతున్నట్లుగా సమాచారమ్‌.

అదెలాగంటే, కాలర్స్‌ ట్యూన్స్‌.. రింగ్‌ టోన్స్‌... ఇలా ఏ రూపంలో వచ్చినా ఏ మాధ్యమంలో వచ్చినా ఆయా సంస్థలు 50 శాతం ఆడియో కంపెనీలకు ఇవ్వాల్సి వుంటుంది. దాంట్లో పాతిక శాతం పాటల రచయితలకీ, పాతిక శాతం మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కీ దక్కనుందట. అలా పెద్ద మొత్తంగా మారాక, దాన్ని రచయితలకు అందించనున్నారని తెలుస్తోంది.

ఒకటీ అరా పాటలు రాసినవారికి ఇదేం పెద్దగా ఉపయోగపడదుగానీ, వేల పాటలు రాసినవారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే పెన్షన్‌లా అనుకోవచ్చు. ఇండియన్‌ పొయట్స్‌ రైట్స్‌ సొసైటీకి ఆ మొత్తం అందుతుందట. మంచి ఆలోచనే కదా ఇది. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగినా, చివరికి ఏమీ మిగుల్చుకోలేకపోయినవారికి ఇలాంటివి బాగానే ఉపయోగపడతాయని చెప్పక తప్పదు.

మరిన్ని సినిమా కబుర్లు
telugu movie industry is united