Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Celebrities at Double Satavadhanam

ఈ సంచికలో >> సినిమా >>

ఈ దర్శకుడికి ఇదొక అలవాటు

Multi Talented Director

సినిమాని ప్రేమించడంలో కొందరు దర్శక నిర్మాతలది ప్రత్యేకమైన శైలి. టైటిల్‌ పెట్టడం దగ్గర్నుంచీ, దాని డిజైన్‌.. ఇలా చాలా విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడ్తారు. కొందరైతే, ఏ విభాగానికి ఆ విభాగం అందులో నిష్ణాతులకు అప్పగించి, మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు. పూరి జగన్నాథ్‌ సినిమా టైటిల్స్‌ని తీసుకుంటే, చాలా వెరైటీగా వుంటాయవి.

‘ఈ రోజుల్లో’ ఫేం మారుతి స్వతహాగా మంచి ఆర్టిస్ట్‌. డ్రాయింగ్‌ మీద మంచి పట్టు వుండడంతో.. ‘ఈ రోజుల్లో’ సినిమా టైటిల్‌ తనంతట తానే రాసుకున్నాడు. ఆ టైటిల్‌కి మంచి గుర్తింపు లభించింది. సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ సెంటిమెంట్‌తోనే, ‘బస్‌ స్టాప్‌’ సినిమాకీ టైటిల్‌ తానే రాసుకున్న మారుతి, అదో సరదాగా కాకుండా యజ్ఞంలా భావిస్తాడట.

ఒక్కొక్కరికి ఒక్కో సరదా.. అని కాకుండా, చేసే పని మీద పూర్తి అవగాహనతో, కసితో చేయడం విశేషమే కదా. మారుతి టైటిల్స్‌ రాయడాన్ని సెంటిమెంట్‌గా కొనసాగిస్తాడేమో చూడాలి.

మరిన్ని సినిమా కబుర్లు