Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Hemachandra & Sravana Bhargavi

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం:

Aditya Hrudayam

భైరవద్వీపం  షూటింగ్ జరిగే రోజుల్లో రావికొండలరావు గారు, సింగీతం గారికి డైలాగ్ వెర్షన్ రీడింగ్ ఇచ్చాక ఆ సీన్స్ ని మళ్ళీ చదివేటప్పుడు  అచ్చు అవే విరుపులతో అలాగే మాడ్యులేట్ చేసి చదివేవాణ్ణి - దానివల్ల బాలయ్యబాబుతో సహా అందరూ ప్రధాన నటీనటులకి  డైలాగులు నన్ను చెప్పమనేవారు నా సీనియర్లు. అలా హీరో బాలకృష్ణ గారికి బాగా దగ్గరయ్యాన్నేను. పైగా ఆయనకి సూర్యభగవానుడంటే ఇష్టం, యాదృచ్చికంగా నా పేరు ఆదిత్య అవ్వడం - కలిసొచ్చిన అంశాల్లో ఒకటి. ఇక్కడ దాకా బానే ఉంది. - ఆ అభిమానం ఎక్కువై హీరోగారు షాట్ గ్యాప్ లో ఆయనతో కూచొని పేకాడమనేవారు - సింగీతం గారు, రావికొండలరావు గారు, నిర్మాత వెకట్రామిరెడ్డి గారు మొదట్లో పర్వాలేదు వెళ్ళండి అన్నారు. కానీ తర్వాత తర్వాత నాకు తెలిసింది చాలా పర్వా ఉందని - హీరోగారిని కలవడానికి పరిశ్రమ పెద్దలు చాలామంది వస్తుండేవారు - రాఘవేంద్రరావు గారు, అశ్వనీదత్ గారు, కోదండరామిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు తదితరులు - ఎవ్వరొచ్చినా ఈయన లేవనిచ్చేవారు కాదు - పైగా పరిచయం చేయడం అసిస్టెంట్ డైరెక్టరు - ఫస్ట్ సినిమా - అని చెప్పేవారు - నేను మాత్రం మనసులో ఇదే లాస్ట్ సినిమా అనుకునేవాణ్ణి. షూటింగ్ ప్రోగ్రెస్ లో పడ్డాక పనిభారం పెరుగుతూ వచ్చింది నాకు. అయినా సింగీతం గారు పట్టించుకోలేదు కానీ రావికొండలరావు గారికి నా గురించి టెన్షన్ ఉండేది - నేను యూనిట్ లో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నానేమో అని - హీరోకి చెప్పలేరు కదా! నాకు రోజూ ఇండైరెక్ట్ గా సెటైర్లు పడేవి - అలా నాకు చాలా సంకటంగా ఉండేది - మనం అభిమానించే హీరో మనని అభిమానిస్తే మనం తట్టుకోలేకపోవడం విచిత్రమైన పరిస్థితి - మరి ఆ హీరో కొన్ని లక్షల కోట్ల మంది అభిమానాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నాడు ఏళ్ళ తరబడి... నా ఆలోచనకి అంతు పట్టేది కాదు - కానీ ప్రెషర్ మాత్రం చాలా పెరిగిపోయింది. అయిదారు నెలల తర్వాత, ఓ రోజు నేను తెగించి, ఇవ్వాళ్టి నుంచి నేను షూటింగ్ లో పేకాడనని మా అమ్మగారి మీద ఒట్టేసుకున్నానండి అని చెప్పేశాను - బాలకృష్ణ గారు ముందు నన్ను నమ్మలేదు - తర్వాత నన్నర్ధం చేసుకున్నారు. ఇంకెప్పుడూ  నన్ను పేకాడదామని పిలవలేదు - అలాగని నా మీద అభిమానం కూడా  పోగొట్టుకోలేదు - షాట్ గ్యాప్ లో సినిమా గురించి, సీన్ల గురించి, రామారావు గారి క్లాసిక్ సినిమాల గురించి చాలా విషయాలు నాతో చర్చించేవారు - ఆయన సహృదయానికి  మనసులోనే దణ్ణం పెట్టుకున్నాను.
వచ్చేవారం...  "నిర్మాతృదేవోభవ"

మరిన్ని సినిమా కబుర్లు
Raja Music Muchchatlu