20-12-2019 నుండి26-12-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం ఉద్యోగంలో చేపట్టిన పనులను అధికారుల సహకారంతో విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో మీరు ఇచ్చిన మాటల విషయంలో స్పష్టత కలిగి ఉండుట అలాగే వాటికీ కట్టుబడి ఉండుట సూచన. రుణపరమైన విషయాల్లో మాత్రం కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. స్వల్పఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఒకింత ఇబ్బంది పెట్టే ఆస్కారం కలదు, జాగ్రత్త. చర్చాపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండుట సూచన.  

 

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం మిత్రులనుండి ముఖ్యమైన సూచనలు వస్తాయి, వాటివిషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలను అనుభవజ్ఞులకు తెలియజేయుట సూచన. మీమాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం కలదు.   

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం సంతానం విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం కలదు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం కలదు. నూతన వాహనాలను కొనుగోలు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట సూచన. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. కుటుంబంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. చర్చల్లో నిదానం అవసరం. 
 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం కుటుంబంలో పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు. చర్చాపరమైన విషయాలకు సమయం కేటయిస్తారు. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. జీవితభాగస్వామి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు , ప్రయాణాలు చేసే విషయంలో స్పస్టత వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం కొంతమేర చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. చర్చాపరమైన విషయాల్లో సమయం గడుపుతారు.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం మానసికపరమైన విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. చేపట్టిన పనుల విషయంలో స్పస్టత కలిగి ఉండుట సూచన. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం అలాగే అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయం ఉపయోగపడుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. బంధువులను కలుస్తారు.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం మీ ఆలోచనలను మిత్రులతో పంచుకొనే అవకాశం కలదు. నూతన ప్రయత్నాలను చేయుటకు ఉత్సాహాన్ని చూపుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందిన, ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. స్వల్పదూరప్రయాణాలకు చేయు ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయే ఆస్కారం కలదు. కుటుంబంలో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి.


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం ఆరంభంలో ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది, అలాగే అధికారుల నుండి ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది, కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాల విషయంలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. సాదేమైనంత మేర చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.

 

ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం బంధువులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. రావాల్సిన ధనం విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. మిత్రులనుండి వచ్చిన సూచనల విషయంలో స్పస్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. పెద్దలతో మీకున్న పరిచయాలు మీకు ఉపయోగపడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వ్యాపారంలో కాస్త సర్దుబాటు అవసరం.

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం ఉద్యోగంలో బాగాఉంటుంది, గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు పొందుతారు. ప్రమోషన్ లేక బదిలీకి అవకాశం ఉంది. బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత మేర మీ వ్యక్తిగతవిషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. బద్ధకం వలన చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయాల్లో అశ్రద్ధ వద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు. చర్చల్లో నిదానముగా వ్యవహరించుట సూచన.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు, కుటుంబంలో సర్దుబాటు విధానము మంచిది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చెనందుకు చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేయినపుడు నూతన పరిచయాలకు అవకాశం కలదు. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం కలదు, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం ఆరంభంలో మానసికంగా ఇబ్బందులు కలుగుతాయి, ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేపట్టు పనులను పూర్తిచేసే విషయంలో మరింతగా శ్రమంచాల్సి వస్తుంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. చిన్న చిన్నవిషయాల్లో ఆందోళన తప్పక పోవచ్చును. కుటుంబపరమైన విషయాల్లో తీసుకొనే నిర్ణయాలు ఒకటికి రెండుసార్లు ఆలచన చేయుట మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన విషయంలో మరింతగా స్పష్టత అవసరం.

మరిన్ని వ్యాసాలు

prayer(children story)
మొక్కు (చిన్నపిల్లల కథ)
- డి వి డి ప్రసాద్
forbes indians list 2019
2019 సంపన్నులు
- గోతెలుగు ఫీచర్స్ డెస్క్
wide meditation center shantivanam
సువిశాల ధ్యాన కేంద్రం శాంతివనం
- గోతెలుగు ఫీచర్స్ డెస్క్
Dangerous Tic-Tac Challenge
ప్రమాదకర ఛాలెంజ్
- లాస్య రామకృష్ణ
suitable bride children story
తగిన వరుడు (చిన్నపిల్లల కథ)
- పద్మావతి దివాకర్ల