ఒంటరి'తనం వద్దు.. మాకూ 'తోడు' కావాలి.! - ..

Don't be lonely.

కోరి వరించిన వరుడినే కాదంటున్నారు. లేత వయసులో అవగాహన లేని పెళ్లిళ్లు చేసుకుని అపార్ధాలకు ఆస్కారమిస్తూ, పచ్చని సంసారాలు కూల్చుకుంటున్నారు. వయసులో జరుగుతున్న పెళ్లిళ్ల తంతు ఇలా ఉంటే, వయసు మళ్లి రకరకాల కారణాలతో తోడును కోల్పోయిన పెద్దవాళ్లు తమకు నచ్చిన తోడును వెతుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదృష్టవశాత్తూ కొందరు పిల్లలే, ఇలా లేటు వయసులో తోడును కోల్పోయిన తమ తల్లి తండ్రులకు తోడును వెతుకుతున్నారు. శరీరాన్ని పంచుకునే బంధం కాదు వీరిది. మనసును పంచుకునే బంధం. జనరేషన్‌ గ్యాప్‌ కావచ్చు. ఇతరత్రా వేరే కారణాలు కావచ్చు.. లేటు వయసులో తల్లి తండ్రులను అర్ధం చేసుకోవడంలో పిల్లలు వెనకబడిపోతున్నారు. దాంతో తోడును కోల్పోయిన పెద్దలు, తమ అభిప్రాయాల్ని పంచుకునే తోడు లేక ఒంటరితనంతో బాధపడుతున్నారు.

తోడు అనేది ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ అవసరమే. లేటు వయసులో తమ తమ మనోభావాల్ని పంచుకునేందుకు ఖచ్చితంగా మనసెరిగిన తోడు ఉండాల్సిందే. కానీ, అలాంటి తోడును కోల్పోయిన వారు మళ్లీ తోడు వెతుక్కోవడాన్ని సొసైటీలో చాలా మంది తప్పుగా భావిస్తారు. కానీ, ట్రెండ్‌ మారింది. ట్రెండ్‌కి యూత్‌ మాత్రమే బ్రాండ్‌ అంబాసిడర్స్‌ కాదు. ఇప్పుడు పెద్దలు చేసుకునే వివాహాల్ని మనస్పూర్తిగా ఆహ్వానించే పిల్లలూ ఉన్నారు. ఒంటరిగా మిగిలిన తమ తల్లితండ్రులకు మళ్లీ పెళ్లి చేసి, చిన్నతనంలోనే తమ పెద్దరికాన్ని చాటుకుంటున్నారు. తల్లి తండ్రుల శేష జీవితం ఒంటరితనంతో, నిరాశగా మిగిలిపోకుండా, కొత్త ఆశలు చిగురించేలా సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు.

ఇక తోడు కోల్పోయిన తల్లి తండ్రుల్ని పట్టించుకోని పిల్లలూ లేకపోలేదు. అలాంటి పిల్లలున్న పెద్దలు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తమ తోడును తామే వెతుక్కుంటున్నారు. అలా వారి పని సాఫీగా సాగేందుకు ప్రత్యేకమైన మ్యారేజ్‌ బ్యూరో సంస్థలు కూడా అంకురించాయి. ఆయా సంస్థల ద్వారా ఈ తరహా వృద్ధ జంటలు ఒక్కటవుతున్నారు. వారి శేష జీవితం ఆనందంగా గడిపేందుకు ఈ తరహా ట్రెండ్‌ ఉపయోగపడుతోంది. ఈ ట్రెండ్‌ పట్ల ఇప్పటికే చాలా మందిలో అవగాహన ఏర్పడింది. ఈ అవగాహన మరింత పెరగాలి. చిన్నతనంలో కంటికి రెప్పలా కాపాడిన తల్లితండ్రుల శేష జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా గడిపేందుకు పిల్లలే వారి బరువు బాధ్యతల్ని గ్రహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఆవశ్యకతను గుర్తించి పిల్లలు నడుచుకోవాలని పెద్దలు ఆశిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, అప్పుడెప్పుడో 'మా నాన్నకు పెళ్లి' అనే టైటిల్‌తో ఓ డైరెక్టర్‌ ఇదే కథాంశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా గుర్తొస్తోంది కదా.. అవును ఆ దర్శకుడు చెప్పినట్లే, ఒంటరి అయిన తల్లి అయితే, 'మా అమ్మకు పెళ్లి', తండ్రి అయితే 'మా నాన్నకు పెళ్లి' పద్ధతిని పిల్లలూ పాఠించండిక.

మరిన్ని వ్యాసాలు

prayer(children story)
మొక్కు (చిన్నపిల్లల కథ)
- డి వి డి ప్రసాద్
forbes indians list 2019
2019 సంపన్నులు
- గోతెలుగు ఫీచర్స్ డెస్క్
wide meditation center shantivanam
సువిశాల ధ్యాన కేంద్రం శాంతివనం
- గోతెలుగు ఫీచర్స్ డెస్క్
Dangerous Tic-Tac Challenge
ప్రమాదకర ఛాలెంజ్
- లాస్య రామకృష్ణ
suitable bride children story
తగిన వరుడు (చిన్నపిల్లల కథ)
- పద్మావతి దివాకర్ల