మేధ - ఆదూరి హైమావతి

smart person

పావురాళ్లగుట్టలో ప్యాసింజర్ రైలు ఆగింది.జనం నిదానంగా ఎక్కసాగారు. ఎందుకంటే రైలు ముందు స్టేషన్ నుంచే బయ ల్దేరు తుంది. అక్కడ పది నిముషాలు ఆగుతుంది. చిన్నాపెద్ద ముసలీ ఉతకా అంతా తాము దిగబోయే స్టేషన్ నుంచీ బయ ట కు సులువుగా వెళ్లే బోగీలోకి ఎక్కుతున్నారు.చివరగా వున్న బోగీలోకీ కొందరు ఎక్కారు. విండో దగ్గర సింగిల్ సీట్లో ఒకవ్యక్తి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చిరునవ్వుతో కూర్చున్నాడు, ఆయ న ఎదురుగా సింగిల్ సీట్లో ఆవ్యక్తితో వచ్చిన మరో వ్యక్తి కూర్చునున్నాడు.

ఆసెక్షన్ లో వున్న రెండు లాంగ్ బెర్తుల్లో ఒకరొకరుగా వచ్చి సుమారుగా ఎనిమిదిమంది కూర్చున్నారు .

రైలు మెల్లిగా కదులుతూ క్రమేపీ వేగం అందుకుంది.

ఇంకా చాలా మంది జనం ఫ్లాట్ ఫాం మీద వున్నారు. వారు మరో రైల్ కోసం వేచి చూస్తున్నట్లున్నారు.

అక్కడ కూర్చున్నవారిలో ఒక వ్యక్తి "చూడండీ ! ఎంత జన మో! ఎన్ని రైళ్ళున్నా , ఎన్ని బస్సులున్నా చాలడం లేదు. మన దేశ జనభా అంతులేకుందా పెరిగిపోతున్నాది. దీన్ని అరికట్టే వారేలేరు.మరీ గ్రామప్రాంతాల్లో చిన్న తనంలో నే పెళ్ళిళ్ళు చేయడం వారికి వెంట వెంటనే కాన్పులు. తల్లుల కూ ,పిల్లలకూ అనారోగ్యాలు, హాస్పెట్ల్స్ , వైద్యులు ఎందరు న్నా చాలడం లేదు. గ్రామాలకెళ్ళి ముందుజాగ్రత్తకోసం ఏవైనా మందులిస్తే అవి సరిగా వాడరు. చెప్పిన మాటలు బేఖాతర్ చేస్తారు.ఎలాగండీ ఈదేశం బాగుపడేది? " అని వాపోయాడు.

" అసలు చదువుల్లో ఆరోగ్యం గురించిన ప్రత్యేక పాఠ్యాంశం పెద్దక్లాసుల్లో పెట్టాలండీ! అసలు గ్రామవాసులు ఎందరు కాలేజీ వరకూ వస్తున్నారండీ! పదోక్లాసు, లేక ఇంటర్ కాగానే ఇహ చదువుకు స్వస్ఠి పలికేసి అమ్మాయిలకైతే మీరన్నట్లు అంత దాకా కూడా రానివ్వరు, పెళ్ళిళ్ళు చేసేయడమే. మగ పిల్లలైతే ఏదో ఒక పని మొదలెడ తారు.జీవితాలు అంతంత మాత్రంగానే గడుపుతారు. ఎవేర్ నెస్ లేదందండీ! కనీసం డిగ్రీవరకూ చదివి ఏదైనా మంచి వృత్తిలో కుదురుకుంటే జీవితాలు బొత్తిగా అర్ధ్వాన్నంగా ఉండవు.కానీ మన విద్యా వ్యవస్థేకాదు, సామాజిక వ్యవస్థ కూడా ఎదగాలండీ! అసలు ఈ కాలం పిల్లల్లో ఎందరికో సరిగా చదవనూ వ్రాయనూ రాదు తెలుసాండీ! ఏం చదువు లండీ! మాచిన్న తనంలో ఒకటో క్లాసుకుకూడా పరీక్షలు వుండేవి. అది పాసైతేనే రెండోక్లాస్ . లేక పోతే మరోమారు ఒకటోక్లాస్ చదవాల్సిందే.ఇప్పట్లా వుండే ది కాదు విద్యా విధానం. పరీక్షలు లేని ఈ తరగతి ప్రెమోషన్స్ వల్ల విద్యావిధానమే నాశనమై పోయిందండీ! ఏం చేస్తాం ?" అంటూ అలసిపోయి ఆపినట్లునాడు పాపం .

"నిజం చెప్పారు.అసలు ఈకాలంలో ఎందరికి ఇది మంచి ఇది చెడు అని తెలుస్తున్నది చెప్పండి. అనుసరణ అధిక మైపోయింది.పులిని చూసి నక్క వాతలేసుకున్నట్లు. ఇతర దేశాల వారిని చూసి మన జీవన విధానాలను మార్చుకోడం ఎంత ఫూలిష్ నెస్ ! చలిదేశాల వారిలా వస్త్రధారణ ! ఎండకు మండే మనకు ఆ జీన్స్ ప్యాంట్లెందుకు? మన హిందూ సాంప్ర దాయం ఎక్కడుందండీ!అసలు మానవు లకు మానవతా విలు వ లెక్కడి వండీ!అసలు విలువలంటే తెలుసా ఒక్కరికైనా ! సత్యం పలకడమే లేదు.ధర్మం ఎప్పుడో పోయింది. అసలు శాంతి అనేది ధూపం వేసి చూసినా లేదు. ఏ ఇంట్లో చూసినా అశాంతే.ఇంట్లో ఒకరితో ఒకరికి అవస రాలు తప్ప ప్రేమాభి మానాలు కరువయ్యాయి.ఇహ ఎక్కడ చూసినా హింసే. మాట లతో క్రియలతో, మానసిక,శారీరక హింస పెరిగిపోయింది. దేశం ఎటుపోతోందో తెలీడం లేదు." అంటూ ఊపిరిపీల్చు కోను ఆపాడులా ఉంది.

"బాగాచెప్పారు. మంచి పోయి నేర ప్రవృత్తి పెరిగిపోయింది. మంచికోసం ఒక పైసా ఖర్చుచేయరుకానీ, ఏదైనా ఇబ్బంది లోనో కేసులోనో ఇరుక్కుంటే ఎంతడబ్బైనా ఖర్చుచేయను ముందుకువస్తారు.లాయర్నను అంటారు కానీ నేరాలు చేసే వారిని ఎవ్వరూ ఏమీ అనరు. లాయర్లూ బతకాలి కదండీ! ఎవడో కోపంలోనో, కసితోనో ఎవర్నో కొడతాడు. దెబ్బలు తగులుతాయి. కేసవుతుంది. లాయరుదగ్గరకొస్తే తన వృత్తి కనుక స్వీకరించాలికదా! ఏడాదవుతుంది.కోర్టు తీర్పివ్వదు. పనికిరాని లాయరంటారు.ఖర్మ కాక పో తే!ఎవరేం చేస్తారండీ! కోర్టులోనూ కేసుల కట్టలు పెరిగి పోతున్నాయాయె. పోనీ ఒకరి ని చూసి మరొకరు బుధ్ధితెచ్చుకుంటారా? ఊ హూ లేదే .మళ్ళా మరొకరు ఇంకోరిని కొట్టడమో చంపడమో . కేసులు కేసులు. ఇలా ఉంది లోకం." అంటూ ఆపాడు మిగతా వాళ్ళు వింటు న్నా రా లేదా అని గమనించనులా వుంది.

" నిజం చెప్పారు. యధార్ధం. ఐనా మచి అలవాట్లు లేవు, మంచి ఆహారవిహారాలు లేవు. అర్ధరాత్రివరకూ హోటళ్ళలో పడి తినడం.నూలెలోడే తిండి. ఇంటి తిండిపనికి రాదు. వారంక్రితం ఏసివనో ఏమో వెడిచేసి పెడితే బిల్లు మోగుతు న్నా ఆహా ఆహా అనుకుంటూ తిని రోగాల పాలవుతారు. తినడం ,తిరగడం రోగాలు, మందులు ,కేసులూ ,హాస్పెటల్స్ .పోనీ వైద్యుడు చెప్పినట్లు వింటారా ? లేదే! జ్వరం వస్తే వారం పాటు మందు బిళ్ళలు వాడ మంటే మూడో రోజుకు జ్వరం తగ్గిందని ఆబిళ్ళలు మూల పారే స్తారు. మళ్లా ఇంకోమారు జ్వరం వస్తే ఆబిళ్ళలు వారే వడేసుకుంటా రు , తీవ్రస్థాయికి వచ్చాక వైద్యుడు గుర్తువస్తా డు. ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తే నే వైద్యుడు. వుత్తిత్తి బిళ్లలు పనికిరావు. గోళ్ళూడ గొట్టి ఫీజు తీసు కుని మందుల లిస్ట్ రాయాలి , వృత్తికూడా న్యాయంగా చేసు కోలేక పోతున్నారండీ వైద్యులు కూడానూ" అని ఆపాడు.

"మరేనండీ! ఒక ప్రార్ధనా, ఒక పూజా లేనేలేవు.ఒక వ్రతం, ఒక నమ్మకం లేనేలేవు.దేవిని అలయానికి వచ్చి నమస్కరిం చుకోడం నామూషీ. ఆధునికత అంధకారంలోకి తోస్తున్నది. పూజలూ, వ్రతాలు చేసుకునే వారు పనికిరాని వారన్నమాట. పెద్దలు చెప్పినా వినరుకాక వినరు. మీరన్నట్లు త్రిగొచ్చి అర్ధ రాత్రికి పడుకోడం పదిగంటలకు లేవడం , ఒక స్నానమా! పానమా! ప్రార్ధనా, ఒక సూర్య నమస్కారమా! ఆరోగ్యప్రదాత సూర్య దేవుడు అనేమాటే తెలీదు.అమ్మా నాన్నలకు నమస్క రించే వారేలేరు. పెద్దలను గౌరవించే వారేలేరు.'వ్రతాలేంటికి ?'అంటారు. ఆలయాలకు వచ్చేదీ లేదు. నిజానికి అన కూడదు కానీ విదేశీ సంస్కారం వచ్చి విచ్చలవిడి తనం పెరిగి పోయింది. చదువు ఇవ్వాల్సిన సంస్కారం చట్టుబడలై పోయింది. చదువు కేవలం డిగ్రీల కోసంగా వుంది. మర్యాద మన్నన అడుగంటాయి. దైవ ప్రీతిలేదు, పాపభీతిలేదు, సమాజం పట్ల బాధ్యతలేదు. చేతులెత్తి మొక్కడం అనాగరి కత గా భావిస్తున్నారు . ఏంటో లేండి" తన కడుపులోబాధ వెలి గక్కా డు ఆవ్యక్తి.

" పిల్లలు లేనివారు లేరని బాధపడుతున్నారుకానీ, వున్నవారు ఎందుకుంపుట్టుకొచ్చారా ఈకొయ్యలగోపులు అని ఎడుస్తున్నా రండీ. ఎంత సేపటికీ నాయన డబ్బివ్వాలి, అమ్మ కోరింది వండిపెట్టాలి. నచ్చకపోతే నేలకేసి కొట్టింపోతారు.వాళ్ళకు భయపడుతూ బతకాలి. ఏమంటే ఏం చేసుకుంటారో అనిభయం. చదువుకోసం అని కాలేజీల్లో చేరిస్తే పనికి రానివన్నీ అలవాటు చేసుకుని మీరన్నట్లు ఏపొద్దుకు ఇంటికి వస్తారో తెలీదు. వారి గుడ్డలకూ, జేబుఖర్చులకూ ఎంత ఇచ్చినా చాలదు. చివరకు పరీక్ష ఉట్టెక్కి కూర్చుంటుంది. అదేమని గదమాయించను భయం. ఏంచేసుకుంటారోని. ఏం కేసవుతుందో అని భయపడి చావాల్సి వస్తున్నది. ఎందు కొచ్చిన పిల్లలండీ బాబూ!"

" ఎందుకండీ! అంత ఇదైపోతారు. ఒకనాటికి తప్పక మార్పు వస్తుంది. మనవేదభూమి, పుణ్యభూమి , ధన్య భూమి తిరిగి పూర్వ స్థితికి వస్తుంది. నిరాశపడకండి.నిర్వేదం వద్దు. పూర్వం ఎన్నెన్ని మార్పులు రాలేదు.ఎన్నెన్ని అనాచరాలూ పఒలేదు. మానవులంతా చేసే పాపపు పనులు, పంచ భూతా లను దుర్వయం చేసుకోడం వల్లా ఇలా వుంది పరిస్థితి. ఆంగ్లే యులు పాలించినపుడు మనకు స్వతంత్రం వస్తుందను కున్నామా! రాలేదూ! ఎన్నిమార్పులు ,చేర్పులూ, కూర్పులూ సమాజంలో వచ్చాయి.అలాగే ఓర్పువహిస్తే తప్పక మంచి మార్పు వస్తుంది.కాస్త ఓపిక పట్టాలి.తప్పదు. ‘వుందిలే మంచి కాలం ముందుముందునా’ అన్నట్లు వస్తుం దండీ మంచి కాలం ." అన్నాడు.

అంతా పక్కకు చూసి "ఆవిండో సింగిల్ సీట్లో కళ్లద్దాలాయన ఏమీ మాట్లడడేమండీ? ఎదురు వ్యక్తి నిద్ర పోతు న్నాడు. ఎక్కడ దిగాలో ఏమో పాపం అలసిపోయినట్లున్నాడు.ఏం బాబూ నల్ల కళ్ళద్దాల బాబూ! మాట్లాడు ఏదైనా " అన్నాడు వారిలో ఒకాయన.

"ఏముందండీ మాట్లాడను?. మీరు చెప్పిన అక్షరసత్యాలైన విషయాలన్నింటినీ వింటున్నాను.ఇంకో పదినిముషాల్లోనేను దిగాల్సినస్టేషన్ వస్తుంది." అన్నాడా నల్లకళ్ళద్దాల వ్యక్తి.

" ఇలాదగ్గరగా వచ్చికూర్చో నాయనా!మేం సర్దుకుంటాం."

"ఫరవాలేదండీ ! ఇక్కడ బాగానే వుంది. మీ మాటలన్నీ చక్కగా వినిపిస్తున్నాయి.వాసూ! లేలే మరో కొద్ది నిముషాల్లో మన స్టేషన్ వస్తుంది "అని ఎదుటి వ్యక్తిని పిలిచాడా నల్ల కళ్ళద్దాల వ్యక్తి.

అతడు పలకలేదు. తన పక్కనే వున్న చేతికర్రతో ఎదుటి వ్యక్తిని వెతుకుతున్నట్లు త్రిప్పడంలో కర్ర క్రింద పడింది. ఆశ బ్దానికి ఎదుటి వ్యక్తిలేచాడు.

వాసు నిద్రమేల్గొని " వచ్చేశామా గోపీ! "అన్నాడు.

"ఇహ ఐదునిముషాలకు స్టేషన్ వస్తుంది.నా చేతికర్ర క్రింద పడింది చూడు వాసూ!అన్నట్లు ప్లాట్ ఫాం ఎటు ఇస్తాడో చూడు." అన్నాడు నల్లకళ్ళద్దాల వ్యక్తి ఐన గోపీ.

"అదేంటీ! ఇతడు ఒంగి కర్ర తీసుకోవచ్చుకదా! లేచి ఫ్లాట్ ఫాం ఎటువస్తుందో చూసుకోవచ్చుకదా! చూడండి ఎంత బధ్ధకమో! అన్నీంటికీ ఎదుటివారిమీద అధారపడటం చిత్రం కాదూ!" అన్నారు ఆఎనిమిమందిలో ఒకరు మెల్లిగా . ఐనా గోపీ కి ఆరహస్య వచనాలు వినిపించాయి.

అప్పుడు గోపీ తన నల్లకళ్ళద్దాలు తీసి " నేను చూడ లేనం డీ!అందుకే అన్నింటికీ వాసుమీద ఆధారపడటం " అన్నాడు. వారు ఎనిమిదిమందీ అతడికళ్ళను చూసారు ,కంటి గుడ్ల స్థానం లో రెండు గుంటలు వున్నాయి.

" వుయ్ ఆర్ సారీ!" అన్నారంతా.

" ఫరవాలేదు నాకిది మమూలే."

" సారీ ! వాసూ! మీ గోపీగారు ..."అని ఒకరు అంటుండగా..

" మీరు మాగోపీని తక్కువ అంచనావేయకండి.మీమాటలను బట్టి ఎవరు ఎవరో చెప్పేస్తాడు."అన్నాడు వాసు.

"ఎలాగా? అదెలాగా ?" అనివారు అంటూండగానే---

" మీలో ఒకరు సోషల్ వర్కర్ ,మరొకరు లెక్చరర్, ఇంకోరు ఆధ్యాత్మిక వేత్త, మరొకరు, లాయర్ , ఇంకోరు వైద్యుడు, మరొకరు పురోహితుడు, ఒకరు మధ్యతరగతి తండ్రి , ఇంకొకరు ఆశావాది. నా అంచానా తప్పయితే మన్నించండి. కళ్ళు లేని కబోదినికదా!" అంటూ రైలు వేగం తగ్గగానే వాసు చేయి పట్టు కుని నడిచి,రైలు ఆగాక క్రిందకు దిగి వెళ్ళి పోయా డు గోపి.

రైల్లో ఆబోగీలో అంత వరకూ మాట్లాడుకున్న వారంతా ఆశ్చర్య పోతూ మౌనం వహించారు .

గర్తింపుకు కళ్ళే అక్కరలేదు. మేధ ఉంటేచాలు. కళ్ళున్న వారంతా యదార్ధాలను గ్రహించగలరనే నమ్మకం లేదు కదా!

***

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి