ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? అని అభిమానులు తమ అభిమాన హీరో తాజా సినిమా టీజర్ చూసి మురిసిపోతున్నారు. 'బ్రూస్‌లీ' సినిమాలో కాస్సేపు కనిపించినా, చిరంజీవి నుంచి సూపర్బ్ మూవీ ఆశిస్తున్న అభిమానులకి, ఆ పండగ తీసుకొచ్చేందుకు చిరంజీవి రెడీ అయ్యారు. ముందుగా టీజర్‌ని అభిమానులకి రుచి చూపించారు. టీజర్ వచ్చీ రావడంతోనే సంచలనాలకు తెరలేపింది. సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ టీజర్‌ని కొనియాడారు. 'నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా..' అని చిరంజీవి చెప్పే డైలాగ్ అద్భుతహ. అంతే కాకుండా చివర్లో 'స్వీట్ వార్నింగ్' అంటూ చిరంజీవి చెప్పి డైలాగ్‌ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
టాలీవుడ్ గత రికార్డులకి మెగాస్టార్ తన తాజా చిత్రం టీజర్ ద్వారా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు అభిమానులు విశ్వసించడం జరుగుతోంది. రామ్‌చరణ్ నిర్మాతగా, వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఆడియో క్రిస్‌మస్ కానుకగా విడుదల కానుంది. విజయవాడ ఇందుకు వేదిక కాబోతోంది. సంక్రాంతికి 'ఖైదీ నెంబర్ 150' సినిమా రిలీజ్‌ని లాక్ చేశారు. అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో చిరంజీవితో జతకట్టింది. చరణ్‌తో కాజల్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. ఇప్పుడు ఆ చరణ్ నిర్మాతగా మారిన తొలి సినిమాలోనూ కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'కత్తి' సినిమాకి రీమేకే అయినా 'ఖైదీ నెంబర్ 150' సినిమాని ఒరిజినల్ సినిమా అన్పించేలా చాలా మార్పులు చేసి తెరకెక్కించారట.
|