ఎన్టీయార్ గేర్ మార్చాడు. బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లా ప్లాన్ చేశాడట ఎన్టీయార్. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్' ఈ మూడు చిత్రాలూ కొంచెం సీరియస్ టోన్‌లో సాగే సినిమాలే. వీటిల్లో 'టెంపర్' సినిమాలో కొంచెం ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నా, అందులో ఎన్టీయార్ సీరియస్‌నెస్ పీక్స్‌లో ఉంటుంది. అందుకనే జస్ట్ ఫర్ ఛేంజ్ అంటూ 'అదుర్స్' తరహాలో ఉండే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని ఎన్టీయార్ ఎంచుకున్నాడని సమాచారమ్. ఆ తరహా కథ సిద్ధం చేయమని బాబీకి ఎన్టీయార్ సూచించగా, ఎన్టీయార్ ఆలోచనలకు తగ్గ సబ్జెక్ట్‌ని బాబీ ప్రిపేర్ చేశాడట.
దాంతో ఎన్టీయార్ ఇంకో మాట చెప్పకుండా ఓకే అనేశాడని తెలియవస్తోంది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీయార్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. అది మరీ ఎక్కువేమీ కాదు. మొనాటమీ అనిపించకుండా చిన్న ఛేంజ్ కోసం ఈ గ్యాప్ ఉపయోగపడిందని భావించవచ్చు. అతి త్వరలో బాబీతో ఎన్టీయార్ చేయబోయే సినిమాలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట కూడా మొదలయ్యిందట. కథ గురించే కొంత టైమ్ తీసుకున్న ఎన్టీయార్ ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యనంటున్నాడు. సినిమా లాంఛనంగా ప్రారంభమైతే, ఆ వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్ళిపోయి, శరవేగంగా సినిమాని పూర్తి చేసెయ్యాలని దర్శకుడు బాబీతో ఎన్టీయార్ చెప్పాడని సమాచారమ్. బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లు ఇచ్చిన ఎన్టీయార్, ఈసారి ఇండస్ట్రీ హిట్ మీద కన్నేశాడు. ఆల్ ది బెస్ట్ టు ఎన్టీయార్.
|