ముద్దుగుమ్మ మెహరీన్ 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో 'మహాలక్ష్మీ' పాత్రలో క్యూట్‌గా ఆకట్టుకుంది. తన నటనతో అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకట్టుకుంది మెహరీన్. సంవత్సరం తర్వాత మళ్లీ ఇప్పుడు 'మహానుభావుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మేఘన పాత్రలో కొంచెం స్లిమ్‌గా అంతే క్యూట్‌గా కనిపిస్తోంది. అంతేకాదండోయ్ హాట్‌నెస్ కూడా ఉందట. ఆ హాట్‌నెస్ రేంజ్ ఏంటో తెరపైనే చూడాలట. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి 'శతమానం భవతి' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శర్వానంద్.
ఈ సారి 'మహానుభావుడు' సినిమాతో వస్తున్నాడు. ట్రైలర్ చాలా బాగుంది. అతిశుభ్రం అనే ఓ వింత వ్యాధి ఈ సినిమాలో శర్వానంద్ పాత్రకి. అందులోంచి పుట్టే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంటుంది. చాలా చాలా సరదా కామెడీ. మెహరీన్ అందచందాలు అదనపు ఆకర్షణ ఈ సినిమాకి. ఈ ఇద్దరి పెయిర్ సింప్లీ సూపర్బ్ అంటున్నారు. కెమిస్ట్రీ అయితే చాలా బాగా పండిందట మెహరీన్ - శర్వానంద్ మధ్య. ఆకట్టుకునే మ్యూజిక్, మెహరీన్ గ్లామర్, శర్వానంద్ కామెడీ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో 'మహానుభావుడు' వచ్చేస్తున్నాడు. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఇద్దరు స్టార్ హీరోలతో పోటీ పడి గెలిచేందుకు సిద్ధమైపోయాడు. ఈ నెల 29న 'మహానుభావుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. పండక్కి హాయిగా నవ్వుకునేందుకు మీరు కూడా సిద్ధమైపోండిక.
|