బుల్లితెరపై బిగ్ షో 'బిగ్‌బాస్' ప్రోగ్రాం మొదటి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ వారంతో బిగ్‌బాస్ షో మొదటి సీజన్ కంప్లీట్ కానుంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా తనదైన శైలితో ఆకట్టుకున్నాడు ఈ ప్రోగ్రాంని. అయిపోతుందంటే అభిమానుల్లో అలజడి మొదలైంది. అంతగా ప్రతీరోజూ ఈ ప్రోగ్రాం ప్రేక్షకులకు దగ్గరయిపోయింది. టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా చూసుకున్నా రికార్డులు సొంతం చేసుకుంది బిగ్‌బాస్ గేమ్ షో. వారాంతంలో రెండు రోజుల మాత్రమే ఎన్టీఆర్ కనిపించినప్పటికీ, ఆ ఇంపాక్ట్ వారంలో మిగిలిన రోజులు కూడా ఉండడంతో అభిమానులతో ఎన్టీఆర్ బాగా ఇంటరాక్ట్ అయిపోయారు. ఎన్టీఆర్ నట విశ్వరూపం గురించి వెండితెరపై తెలిసిందే.
అయితే అందులోనూ ఏమైనా చిన్నా చితకా ప్లస్‌లూ, మైనస్‌లూ ఉంటే ఈ ప్రోగ్రాం ద్వారా కవర్ అయిపోయాయి. ఎన్టీఆర్ ఆటా పాటా సందడి కోసం ప్రేక్షకుల ఎంతగా ఎదురు చూసేవారో అంతగానే ఎంజాయ్ చేశారు. ఆ ప్లేస్‌లో ఎన్టీఆర్‌ని తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టమే అనిపిస్తోందిప్పుడు. అందుకే నెక్స్ట్ సీజన్‌కీ ఎన్టీఆరే హోస్ట్‌గా వ్యవహరించనున్నారనీ తెలియవస్తోంది. ఫ్యాన్స్‌కి కావల్సింది కూడా అదే. మూడు వేరియేషన్స్‌ని ఒకే సినిమాలో చూపించిన ఎన్టీఆర్ 'జై లవకుశ' సినిమాకి 'బిగ్‌బాస్' ప్రోగ్రాం ఎంతగానో సహకరించిందనీ ఎన్టీఆర్ చెప్పడం విశేషం. అంతగా ఎన్టీఆర్‌నీ ఆ షో ప్రభావితం చేసిందన్న మాట.
|