తెలుగింటికి ముద్దుగుమ్మ రేణూదేశాయ్ వచ్చేస్తోంది. అంటే బుల్లితెరపై రేణూ దేశాయ్ ఓ డాన్స్ ప్రోగ్రాంకి జడ్జ్‌గా వ్యవహరించనుంది. 'నీతోనే డాన్సులే' అనే ఓ డాన్స్ ప్రోగ్రాం త్వరలోనే ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాంకి రేణూ దేశాయ్ జడ్జ్‌గా వ్యవహరించనుంది. అంటే బుల్లితెర ద్వారా రేణూ దేశాయ్ తెలుగు నట్టింట్లో అడుగు పెడుతున్నట్లే. ఇప్పటికే చాలా డాన్స్ ప్రోగ్రాంలు బుల్లితెరపై సందడి చేశాయి. చేస్తూనే ఉన్నాయి. సదా, ప్రియమణి, రంభ, స్నేహ తదితర ముద్దుగుమ్మలు ఈ ప్రోగ్రాంస్‌కి జడ్జ్‌లుగా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. అలాగే రేణూ దేశాయ్ కూడా అభిమానులకి దగ్గర కానుందన్న మాట.
హీరోయిన్‌గా వవన్‌కళ్యాన్‌తో నటించిన 'బద్రి' సినిమా ద్వారా ఈమెకు బోలెడంత క్రేజ్ వచ్చింది. హీరోయిన్‌గా పెద్దగా సినిమాలు చేయకపోయినా, రెండో సినిమా కూడా పవన్‌తోనే నటించి, మెప్పించింది.రేణూ దేశాయ్‌కి జనం గుండెల్లో మంచి స్థానం దక్కేలా చేసింది. పవన్ కళ్యాణ్‌కి మాజీ భార్యగా ఆమె పట్ల అభిమానులకు విపరీతమైన అనుబంధం ఏర్పడింది. డైరెక్టర్‌గా మరాఠీలో ఓ సినిమాని తెరకెక్కించింది రేణూదేశాయ్. ఆ సినిమాలో కొడుకు అకీరానందన్ నటించాడు. తాజాగా తల్లి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఈ డాన్స్ ప్రోగ్రాంలో అకీరా కూడా కనిపించి సందడి చేస్తాడేమో చూడాలి. అలాగే ఈ ప్రోగ్రాంకి రేణూనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. సో ఆమె పిలిస్తే పవన్ కూడా గెస్ట్‌గా వస్తాడేమో. మొత్తానికి 'నీతోనే డాన్సులే..' స్టైలిష్ డాన్స్ షో కోసం రేణూ తెలుగింట సందడి మొదలైందనుకోవాలి. స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ ఉదయభాను ఈ షోకి యాంకర్ కాగా, జానీ మాస్టర్ మరో జడ్జ్‌గా వ్యవహరించనున్నారు.
|