Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
akkineni fight

ఈ సంచికలో >> సినిమా >>

స్పైడర్‌ మార్మోగిపోతోంది

spider relese on 27th september

ఎక్కడ విన్నా 'స్పైడర్‌' గురించే చర్చ జరుగుతోంది. రెండు భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. అందులోనూ తొలిసారిగా తమిళంలో మహేష్‌ నటిస్తున్న చిత్రం కూడా ఇదే. మురుగదాస్‌ దర్శకుడు కావడంతో చిత్రంపై తెలుగులోనూ, తమిళంలోనూ కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఓవర్సీస్‌లో అయితే ఈ సినిమాపై మరీ ఎక్కువ అంచనాలున్నాయి. ఓవర్సీస్‌లో గత రికార్డుల్ని ఈ సినిమా కొల్లగొట్టేస్తుందని భావిస్తున్నారు. మహేష్‌కి ఓవర్సీస్‌లో మార్కెట్‌ సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ మహేష్‌ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తాయి. అయితే 'స్డైడర్‌' విషయంలో అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. 'బాహుబలి' వసూళ్లతో 'స్పైడర్‌' పోటీ పడనుందని అక్కడి ట్రేడ్‌ వర్గాల అంచనా. టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్‌ అదరిపోతోంది. అయితే టీజర్‌లో చూపించింది చాలా తక్కువట.

సినిమా జేమ్స్‌బాండ్‌ తరహాలో ఉండబోతోందట. సాంకేతికంగా సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీ ఇది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్‌ - రకుల్‌ జంట చాలా బాగుంది. వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీ గురించి పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంత బాగుంటుందట ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ. సాంగ్‌ ప్రోమోస్‌, స్టిల్స్‌ చూస్తుంటేనే తెలుస్తోంది ఈ సినిమాలో వీరి లవ్‌స్టోరీ ఎంత స్టైలిష్‌గా ఉందో. దసరా కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 27న 'స్పైడర్‌' విడుదల కానుంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
one and only big boss NTR