ప్రబాస్ హీరోగా నటిస్తున్న 'సాహో' చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో నటించినందుకు చాలా సంతోషంగా భావిస్తోందట. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు, తాను కూడా ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తోందట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా సినిమా అంటే శ్రద్ధాకి ఎంత ప్యాషనో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఏం చేయడానికైనా, ఎంత కష్టపడ్డానికైనా రెడీ ఈ బ్యూటీ. సినిమాలో తన పాత్ర కోసం తనని తాను ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసేసుకుంటుంది. అయితే ఇదంతా ఎందుకంటే ఇప్పుడు.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తోందట.
మాట్లాడడం అంటే ఏదో అలా అలా మాట్లాడడం కాదట. భాషపై పూర్తిగా పట్టు సాధించాలనుకుంటోందట. అంతేకాదు, తొలి సినిమా అయినప్పటికీ, తెలుగులో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా రెడీ అంటోంది. అయితే ఇంకా తెలుగు అంత స్పష్టంగా నేర్చుకోలేదట కానీ, ఒకవేళ డైరెక్టర్ తనని డబ్బింగ్ చెప్పుకోమంటే ఎంత కష్టపడైనా తెలుగు నేర్చేసుకుని డబ్బింగ్ చెప్పేస్తానంటోంది ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెబుతోంది. ఇదో యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రబాస్ కటౌట్‌కి తగ్గ స్టోరీ అని అంటోంది. ఇలాంటి మంచి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం చాలా తృప్తిగా ఉందనిపిస్తోందంటోంది శ్రద్ధా. అలాగే బాలీవుడ్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో శ్రద్ధా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం స్వయంగా బ్యాడ్మింటన్ నేర్చుకుంటోంది ఈ బ్యూటీ. ఈ ఆట ఆడుతున్నప్పుడు భలే శ్రద్దగా అనిపిస్తోందట. ఆడేకొలదీ ఆడాలనిపిస్తోందంటోంది ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్.
|